For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దూరమైపోయిన మీ ప్రేమ జ్ఞాపకాలను విడిచిపెట్టాక ఏమి జరుగుతుంది?

|

"నా జ్ఞాపకాలు నను వీడి దూరంగా మరలాయి, నేను వాటికై ప్రతి దారిలో అన్వేషిస్తున్నా!" ఇలాంటి ప్రేమనా మనం కోరుకునేది? మన కలలు అన్ని కల్లలు అని చాటిన ప్రేమ నిజంగా మనకు అవసరమా? మనని వీడి వెళ్లిపోయిన ప్రేమ గురుతులను తలుచుకుని పదే పదే విలపించడం సమంజసమేనా?

ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తులు ఆనందంగా సుఖదుఃఖాలను కలిసి పంచుకోవడమే! ప్రేమలో ఉన్న వ్యక్తులు అనుక్షణం తమ భాగస్వామి యొక్క సహచర్యం కోసం తహతహలాడతారు. ఈ భావోద్వేగం వారిలో ఒక రకమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇద్దరు కలిసి లెక్కలేనన్ని జ్ఞాపకాలను పొదివి పెట్టుకుంటారు. కానీ ఇంత గాఢమైన ప్రేమబంధం ఏ క్షణంలోనైనా తెగిపోతే?ఆనందాన్ని పంచి ఇచ్చిన ప్రేమే విషాదాన్ని మిగులుస్తుంది. దూరమైన వారి ఆలోచనలతో అంతులేని దుఃఖంలో కూరుకుపోతారు. అనుక్షణం వారు మీకు తోడుగా లేరనే శోకం మీలో పెల్లుబుకుతుంది.

ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి కారణాలెన్నైనా ఉండవచ్చు. కానీ ఆ జ్ఞాపకాలలోనే ఉండిపోతే ఏమవుతుంది? తలచుకోకూడదనుకునే విషయాలను పదేపదే తలచుకోవడం మానవ నైజం. కానీ జీవితంలో ముందుకు సాగాలంటే ఈ ఆలోచనలను మీ మనసు నుండి నెట్టేయడం తప్పనిసరి!

WHAT HAPPENS WHEN YOU ARE NO MORE HUNTING THE MEMORIES OF LOVE?

దూరమైపోయిన మీ ప్రేమ జ్ఞాపకాలను విడిచిపెట్టాక ఏమి జరుగుతుంది?

1. మీరు కొన్ని మార్పులు చేసుకోవలసి ఉంటుంది.

1. మీరు కొన్ని మార్పులు చేసుకోవలసి ఉంటుంది.

ఇద్దరు వ్యక్తులు విడిపోయాక, సాధారణంగా వారు ఒకరి జ్ఞాపకాలను ఒకరు దూరం చేసుకోవడానికి, వారితో కలిసి గడిపిన ప్రదేశాలకు, వారికి సంబంధించిన వస్తువులకు ఉండటానికి ప్రయత్నిస్తారు. తమను తాము మార్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెడతారు. ఈ మార్పులునొక కొత్త ప్రారంభానికి నాంది పలుకుతాయి. వారిని లోపల నుండి సంతోషంగా ఉంచటానికి సహాయ పడతాయి.

మీ జ్ఞాపకాల వేట అంతమవగానే, మీరు ఏదైనా కొత్తదనాన్ని ఆహ్వానించి జీవితంలో ముందుకు సాగాలనుకుంటారు. మిమ్మల్ని మీరు మునుపటి కంటే శక్తివంతంగా, కొత్తగా మార్చుకుంటారు. ఈ మార్పులు మీలో మానసిక ఆనందం తీసుకుని వస్తాయి. మార్పు అనేది ప్రకృతి సహజం. ఇవి మీరు జీవితంలో ముందుకు సాగడానికి సహాయపడతాయి. భాగస్వామి నుండి విడిపోయాక జీవితం దుఃఖభరితంగా అనిపిస్తుంది. మార్పును స్వాగతించడం వలన నిస్తేజంగా మారిన మీ జీవతంలో తాజాదనం వస్తుంది.

2. కొత్త అభిరుచులను పెంచుకోండి.

2. కొత్త అభిరుచులను పెంచుకోండి.

బంధం.అనేది ఒక వ్యసనం లాంటిది. ఆ వ్యసనం నుండి బయటపడాలంటే ఇంకో అభిరుచిని అలవాటు చేసుకోవాలి. ఇది కేవలం, ఆ బంధం తెగిపోవడం వలన కలిగిన బాధ నుండి బయట పడ్డాక మాత్రమే అలవర్చుకోగలం. ఈ అలవాట్లు మనం విశ్వాసం కోల్పోయే సమయంలో, మనలో ప్రేరణ కలిగిస్తాయి. కనుక మీ అభిరుచికి తగిన వ్యాపకాన్ని ఎంచుకోండి. అవి మీపై మీకు నమ్మకాన్ని పెంచి మిమ్మల్ని సమర్థులుగా చేస్తాయి. కొంతమంది సంగీతానికి దగ్గరైతే, కొంతమంది పెంపుడు జంతువును పెంచడం మొదలుపెడతారు. బొమ్మలు వేయడం, కవితలు రాయడం, పుస్తకాలు చదవడం, శారీరక వ్యాయామం చేయడం, కొత్త బంధం కోసం అన్వేషించడం వీటిలో కొన్ని. ఈ అలవాట్లు మనలో ప్రశాంతతను కలుగజేస్తాయి.

3. మీలో మీరు ఆనందించండి.

3. మీలో మీరు ఆనందించండి.

కొన్ని భయంకరమైన జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతున్నా, వాటికి ఎదురెళ్ళి జీవితంలో ముందడుగు వేసేంత మానసిక స్థైర్యం పెంచుకునప్పుడు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం కూడా మొదలుపెడతారు. ప్రేమ నుండి దూరమవ్వడం మీకు జీవితంలో కొన్ని పాఠాలను నేర్పుతుంది. మీరెలాంటి వ్యక్తి అనేది మీకు తెలిసొస్తుంది. మీరు మీరుగా మరీంత ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుదు, మీ ఆనందం కొరకు వేరొక వ్యక్తిపై ఆధారపడటానికి మీకు సమయం కూడా దొరకదు. మీ ఆనందం మీలోనే దాగి ఉంది. మీకు లభించిన ఈ జీవితాన్ని ఆనందంగా మలచుకోవడం మీ చేతిలోనే ఉంది.

జ్ఞాపకాలు ఒక్కోసారి మన జీవితంలో అడుగు ముందుకు వేయడానికి అడ్డంకిగా మారతాయి. ఇలా మన వల్లనే జరుగుతుంది. మన జీవితంలో జరిగిన సంఘటనలను తలచుకుని తలచుకుని కుమిలిపోతుంటాం. వాటిని చేరిపేయాలనే ఆలోచన చేయకుండా అనుక్షణం గుర్తు చేసుకుంటాము. జీవితం ఒక ప్రవాహంలా తన దారిలో తాను ప్రయాణించే అవకాశం.ఇవ్వకుండా మనమే అడ్డు పడుతుంటాం. మనం.జీవితాన్ని నియంత్రించాలనుకుంటూ, బాధాకరమైన గతం మనల్ని వెంటాడేలా చేసుకుంటాం. ప్రేమ అనేది చాలా.మధురమైన అనుభూతి. కానీ మనం ప్రేమలో లేకపోయినా సంతోషంగా ఉండవచ్చు. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే. మనం దాని వెంక వెంపర్లాడనవసరం లేదు. కాలంతో పాటు రకరకాల ప్రేమలు మనని దగ్గరవ్వడం, దూరమవ్వడం సహజమే! మనం చేయవలసినదల్లా, మనల్ని మనం మానసికంగా సంసిద్ధం చేసుకుని, అనుకూలతలకు, ప్రతికూలతలకు సమానంగా స్పందించడం మాత్రమే.

ప్రేమ అనేది

ప్రేమ అనేది

ప్రేమ అనేది విద్యుత్ మెరుపులు వంటిదే కానీ ఉరుము వంటిది కాదు అని గుర్తుంచుకోండి. మెరుపు కొన్ని క్షణాలు పాటు మెరిసి మాయమవుతుంది కానీ ఉరుము చేసే సడి నలు దిశలా వ్యాపిస్తుంది. ఉరుము లాంటి గర్జన మీ మదిలో ఎప్పటికి నిలిచిపోతుంది కానీ క్షణికమైన ప్రేమ అనే మెరుపు కాదు.

English summary

WHAT HAPPENS WHEN YOU ARE NO MORE HUNTING THE MEMORIES OF LOVE?

These memories that we made are lost and I am searching for them in every lane. Is this the love that you and I wanted, the dream of forever lost in the streets of memories. What happens when you are no more hunting the memories of love and why do we seek for these memories even after the end? Love is a phenomenal happiness.
Story first published: Friday, July 20, 2018, 11:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more