For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేల‌ల్లో ఒక్క ప్రేమ క‌థ వీరిది!

అంగ‌వైక‌ల్యం ఉన్న‌వారు ఎవ‌రైనా వ్య‌క్తి ప్రేమ‌లో ప‌డితే త‌మ లోపం ఎక్క‌డ వారికి శాప‌మ‌వుతుందో అనే ఉద్దేశంతో ప్రేమ‌ను త‌మ మ‌న‌సులోనే దాచుకుంటారు. నిజ‌మైన ప్రేమ ఇద్ద‌రి మ‌ధ్య ఉంటే ఎలాంటి లోపమైనా చిన్న‌గా

By Sujeeth Kumar
|

మ‌న‌కిష్ట‌మైన‌వారి ముందు ఆక‌ర్ష‌ణీయంగా క‌నప‌డాల‌ని త‌హ‌త‌హ‌లాడటం మాన‌వ నైజం. మ‌నం ప్రేమించేవారైతే ఈ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండి వారి ప్రేమ‌ను పొందాల‌నుకుంటాం.

దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇలాంట‌ప్పుడే మ‌న లోప‌లే మ‌న‌కు భూత‌ద్దంలో చూసిన‌ట్టుగా పెద్ద‌గా క‌నిపిస్తాయి. ఏవైనా లోపాలుంటే వాటితో జీవితాంతం ఎలా అడ్జ‌స్ట్ అవుతారో అనే సందేహం మ‌న‌సును తొలుస్తూ ఉంటుంది.

శారీర‌క లోపాలున్న వారికి ఈ భావ‌న మ‌రింత అల‌జ‌డిని క‌లిగిస్తుంది. శారీర‌క వైక‌ల్యం ఉన్న‌వారికి చిన్న‌ప్ప‌టి నుంచే చుట్టూ ఉన్న‌వారు త‌గిన ప్రోత్సాహ‌మిచ్చి వారు విజ‌య‌వంతుల‌య్యేలా దిశానిర్దేశం చేస్తుంటారు.

when-love-is-the-greatest-ability

అంగ‌వైక‌ల్యం ఉన్న‌వారు ఎవ‌రైనా వ్య‌క్తి ప్రేమ‌లో ప‌డితే త‌మ లోపం ఎక్క‌డ వారికి శాప‌మ‌వుతుందో అనే ఉద్దేశంతో ప్రేమ‌ను త‌మ మ‌న‌సులోనే దాచుకుంటారు. నిజ‌మైన ప్రేమ ఇద్ద‌రి మ‌ధ్య ఉంటే ఎలాంటి లోపమైనా చిన్న‌గానే అయిపోతుంది. స‌రిగ్గా ఇలాంటి సంద‌ర్భాలే అమిత‌, ఆనంద్‌ల మ‌ధ్య చోటుచేసుకున్నాయి. మ‌రి వాళ్ల ప్రేమ క‌థ లోతుల్లోకి తొంగి చూద్దామా...!

చ‌క్ర‌బంధ‌నంలో జీవితం

చ‌క్ర‌బంధ‌నంలో జీవితం

అప్పుడు అమిత‌కు 8ఏళ్లు. ఒక రోజు రోడ్డు ప్ర‌మాదంలో ఆమె దివ్యాంగురాల‌య్యారు. ఎన్నో ఏళ్ల‌పాటు చికిత్స చేసిన డాక్ట‌ర్లు చివ‌రికి చేతులెత్తేసి ఆమె శేష జీవితం కుర్చీల‌కే అంకిత‌మ‌వుతుందని తేల్చేశారు. ఈ విష‌యంలో ఇంక తామేమీ చేయ‌లేమ‌ని అన్నారు.

స‌ర్దుకుపోతూ సాగిన జీవ‌న‌విధానం

స‌ర్దుకుపోతూ సాగిన జీవ‌న‌విధానం

మొద‌ట్లో ఈ విష‌యం విన్న అమిత‌కు, వారి కుటుంబ‌స‌భ్యులు జీర్ణించుకోలేక‌పోయారు. మెల్ల‌గా అమిత త‌న అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్టుగా జీవన విధానాన్ని మార్చుకుంటూ ఉంది. తొంద‌ర్లోనే ఆమెలో ఒక చిత్ర‌కారిణి దాగి ఉంద‌ని తెలుసుకొంది. 12వ త‌ర‌గ‌తి పూర్తి అవ్వ‌గానే ఒక ఆర్ట్స్ స్కూల్‌లో చేరిపోయింది.

ప్ర‌శంస‌ల వెల్లువ‌

ప్ర‌శంస‌ల వెల్లువ‌

ఆర్ట్ స్కూల్‌లో అడుగుపెట్టాక‌, త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. అన్ని ప‌రీక్ష‌ల్లోనూ రాణించ‌డ‌మే కాకుండా ఆమె చిత్రాల‌కు అంత‌ర్జాతీయ ప్ర‌శంస‌లు సైతం అందుతూ వ‌స్తున్నాయి. ముందు నుంచీ అమిత‌కు క‌ళ‌లంటే బాగా ఇష్టం. త‌న మొద‌టి, చివ‌రి ప్రేమ క‌ళే అని ఆమె అనుకోసాగింది. ఇదిలా జ‌రుగుతుండ‌గానే....

అభిప్రాయాలు మారిన‌ప్పుడు

అభిప్రాయాలు మారిన‌ప్పుడు

ఆమె ఒక ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉండ‌గా ఆనంద్‌ను క‌లుసుకుంది. ఆనంద్ మంచి క‌ళాపోష‌కుడు. త‌న స్నేహితుల‌తో క‌లిసి అక్క‌డి చిత్రాల‌ను త‌న్మ‌య‌త్వంతో చూడ‌సాగాడు. అప్పుడే అమిత ఆన్ంద్‌ను తొలిసారి చూసింది. అత‌డి ప‌ట్ల ఆక‌ర్ష‌ణ మొద‌లైంది. అయితే అంత‌లోనే త‌మాయించుకొని త‌న లోపం వ‌ల్ల ఆనంద్‌ను తాను అందుకోలేనంత దూరంలో ఉన్నాన‌ని గ్ర‌హించి త‌న భావ‌న‌ల‌ను లోలోప‌లే దాచుకుంది.

ఒక చిత్త‌ర‌వు మార్చేసింది

ఒక చిత్త‌ర‌వు మార్చేసింది

ఆనంద్ కు ఆ చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌లో ఒక చిత్త‌ర‌వు విశేషంగా ఆక‌ట్టుకుంది. అది ఒక త‌ల్లి, బిడ్డ‌ల చిత్ర‌ప‌టం. అక్క‌డి నిర్వాహ‌కుల‌ను అడిగి స‌ద‌రు పెయింటింగ్ వేసిన‌వారిని క‌లుసుకోవాల‌నుకుంటున్న‌ట్టు తెలిపాడు. ఈ చిత్రాన్ని కొత్త‌గా ఇప్పుడిప్పుడే ఈ రంగంలో రాణిస్తున్న ఓ అమ్మాయి గీసింద‌ని నిర్వాహ‌కులు అంటారు. ఆ త‌ర్వాత ఆమెను క‌ల‌వాల‌ని ఆనంద్ త‌హ‌త‌హ‌లాడాడు.

క‌ల‌యిక‌

క‌ల‌యిక‌

ఆ త‌ర్వాత నిర్వాహ‌కుల స‌హాయంతో ఇద్ద‌రూ క‌లుసుకున్నారు. ఎవ‌రో అభిమాని త‌న‌ను క‌లిసేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్టుగా మాత్ర‌మే అమిత‌కు తెలుసు. అనుకున్న‌ట్టుగానే ఇద్ద‌రూ ఒక‌ర్నొక‌రు క‌లుసుకున్నాక కాస్తంత ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే ఆనంద్‌కు ఇది తొలి చూపులోనే ప్రేమ‌గా మారింది.

ఆ త‌ర్వాత ...

ఆ త‌ర్వాత ...

తొలిసారి క‌లుసుకున్న‌ప్పుడు ఇద్ద‌రు ఫోన్ నెంబ‌ర్లు మార్చుకున్నారు. ఇద్ద‌రూ తొంద‌ర్లోనే మంచి స్నేహితులైపోయారు. ఒక‌సారి బ‌య‌ట క‌లుసుకుందామ‌ని ఆనంద్ అన్నాడు.

ప్రేమ వ్య‌క్తీక‌ర‌ణ‌

ప్రేమ వ్య‌క్తీక‌ర‌ణ‌

ఆనంద్ మ‌న‌సులోని భావాల‌ను తెలియ‌ని అమిత అత‌డు త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర్చిన‌ప్పుడు ఆశ్చ‌ర్య‌పోయింది. ఇంత వ‌ర‌కు ఈ వ్య‌క్తికి తాను స‌రిపోన‌నే భావ‌న‌తో ఉండేది. అయితే అత‌డే వ‌చ్చి ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచే స‌రికి ఏం చెప్పాలో ఆమెకు పాలుపోలేదు.

అదే స‌మ‌యంలో ఆమెలోని అభ‌ద్ర‌తాభావాల‌న్నీ క‌ళ్ల ముందు క‌ద‌లాడ‌సాగాయి. ఆనంద్‌కు తాను సాధార‌ణ జీవితాన్ని ఇవ్వ‌లేనేమో అనే సందేహం ఉండేది. అందుకే సున్నితంగా అత‌డి ప్రేమ‌ను తిర‌స్క‌రించింది. గుండెలో అంత‌లా ప్రేమ ఉన్నా అది దిగ‌మింగి అలా చేసింది.

అయినా వ‌ద‌ల్లేదు

అయినా వ‌ద‌ల్లేదు

అమిత అభ‌ద్ర‌తాభావంతోనే అలా చెప్పింద‌ని ఆనంద్‌కు అర్థ‌మైంది. దాన్నే పోగొట్టాల‌ని అత‌డు ప్ర‌య‌త్నించాడు. ఇది నెల‌ల పాటు కొన‌సాగింది. ఆమెను అర్థం చేయించ‌డానికి బాగానే క‌ష్ట‌ప‌డ్డాడు. చివ‌రికి అత‌డి క‌ష్టం ఫ‌లించి ఆమె పెళ్లికి ఒప్పుకుంది.

అవ‌రోధాలు

అవ‌రోధాలు

అమిత ఒప్పుకోవ‌డం ఒక్క‌టే స‌రిపోదు క‌దా! ఆ త‌ర్వాత అసలైన స‌వాలు ఆనంద్ వాళ్ల త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించాలి. వీల్ చెయిర్‌లో ఉండే కోడ‌లిని వాళ్లు స‌సేమిరా ఇష్ట‌ప‌డ‌లేదు.

వీరి ప్రేమ‌, న‌మ్మ‌కాలే ఇరు కుటుంబాల వారిని ఒప్పించ‌గ‌లిగే చేసింది. నిదానంగా అయినా ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకున్నాయి.

క‌థ సుఖాంతం

క‌థ సుఖాంతం

ఈ రోజు ఇరు కుటుంబాలవారు పెళ్లి ప‌నుల్లో హ‌డావిడిగా ఉన్నారు. వైవాహిక బంధంలో త్వ‌ర‌లో అడుగుపెట్ట‌బోతున్నారు. పెళ్లి ప‌నులు స‌జావుగా అయ్యేలా కుటుంబ‌స‌భ్యులు చూసుకుంటున్నారు. ఇలాంటి ప్రేమ‌క‌థ‌లు సుఖాంతం అని చెప్పేందుకు ఒక చూడ‌చ‌క్క‌ని ఫొటో చాలు.

వీళ్ల వివాహ బంధం క‌ల‌కాలం ఆనంద‌మ‌యంగా ఉండాల‌ని కోరుకుందాం.

English summary

when-love-is-the-greatest-ability

Here is an amazing love story which is in fact a very unusual one. Read to know how love blossomed between the two. Check this story.
Story first published:Wednesday, January 31, 2018, 17:53 [IST]
Desktop Bottom Promotion