మా విచిత్ర‌మైన‌ డేటింగ్ అనుభ‌వాలు ఇవే!

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

మీరు ఏదైనా డేట్ కు వెళ్లి దేవుడా ఇలాంటిది ఇక జ‌న్మ‌లో జ‌ర‌గొద్దు అనుకున్న సంద‌ర్భాలేమైనా ఉన్నాయా? డేటింగ్ అనుభ‌వం ఒక్కోసారి చాలా విచిత్రంగా, బాధాక‌రంగా ఉండొచ్చు. మ‌నం క‌లిసేవారు మ‌న నుంచి ఏం ఆశిస్తారో అంచనా వేయ‌లేం. కొంద‌రు మ‌హిళ‌ల‌ను త‌మ డేటింగ్ అనుభ‌వాల‌ను చెప్ప‌మ‌న్నాం. అవి మీతో పంచుకోవాల‌నుకొని ఈ క‌థ‌నంతో మీ ముందుకొచ్చాం.

Women reveal their weirdest dating experience

1. ఒక ఆన్‌లైన్ డేటింగ్ యాప్ లో గంట పాటు ఒక అబ్బాయితో చాట్ చేశాను. ఆయ‌న బాగా చ‌దువుకున్నవాడిలా మంచి వ్య‌క్తిలా క‌నిపించాడు. మ‌రుస‌టి రోజు కాఫీ తాగేందుకు క‌లుసుకుందామ‌నుకున్నాం. క‌లిశాక అత‌డు త‌న కుటుంబ చ‌రిత్ర మొత్తం చెప్ప‌డం ప్రారంభించాడు. అంత‌టితో ఆగితే స‌రే. అత‌డ్ని చేసుకోబోయే భార్య ఎంత‌టి అదృష్ట‌వంతురాలో చెప్ప‌డం మొద‌లుపెట్టాడు. అత‌డు ప‌రిచ‌య‌మై 30 గంట‌లే అయ్యింది. అంత‌లోనే అత‌డు పెళ్లికి ప్ర‌పోజ్ చేశాడు. నేను అర్జంట్ ప‌ని ఉందంటూ అక్క‌డి నుంచి పారిపోయాను.

Women reveal their weirdest dating experience

2. కాలేజ్‌లో మా సీనియ‌ర్ డిన్న‌ర్‌కు పిలిచాడు. సంతోషంగా అంగీక‌రించాను. అంత‌కుముందు మేం మాట్లాడుకున్న‌ది చాలా త‌క్కువ‌. మా ఇద్ద‌రికీ మ్యూచువ‌ల్ ఫ్రెండ్స్ లేరు. డేట్ కి వ‌చ్చాక తెలిసింది ఆ రోజు అత‌డి మూడ్ అంతా అప్‌సెట్ అయ్యింద‌ని. కార‌ణం అడిగితే చెప్ప‌లేదు. ఆ త‌ర్వాత నిదానంగా అడిగి చూస్తే తెలిసింది. ఉద‌య‌మే వాళ్ల గ‌ర్ల్ ఫ్రెండ్‌తో బ్రేక‌ప్ అయ్యింద‌ని. ఆమె నాలాగే ఉంటుంద‌ని. అందుకే నాతో కొంచెం స‌మ‌యం గ‌డ‌పాల‌నుకున్నాడ‌ట‌.

Women reveal their weirdest dating experience

3. ఇది ఒక ఏడాది ముందు జ‌రిగిన సంఘ‌ట‌న‌. ఇత‌డ్ని రెండో సారి క‌లిశాను. నాతో మాట్లాడుతున్నంత సేపు సెల్‌ఫోన్ లో చూస్తూనే ఉన్నాడు. ఒక ప‌క్క అవ‌త‌లివారికి మెసేజీలు పంపిస్తూనే మ‌రో ప‌క్క నా వంక చూసి న‌వ్వుతున్నాడు. ఆ త‌ర్వాత అత‌డి ఫోన్‌లో తొంగి చూస్తే అర్థ‌మైంది. మేమిద్దరం ఇదివ‌ర‌కు క‌లిసిన డేటింగ్ సైట్‌లోనే అత‌డు వేరే అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. ఇద్ద‌రూ కిస్ ఎమోజీలు మార్చుకుంటున్నారు. ఇద్ద‌రి వ్య‌వ‌హారం చూసిన నాకు చిరాకు వేసింది. అర గంట త‌ర్వాత అక్క‌డి నుంచి వెళ్లిపోయాను. ఆ త‌ర్వాత ఎప్పుడు అత‌డికి రిప్లై ఇవ్వ‌లేదు.

Women reveal their weirdest dating experience

4. ఇది త‌ల‌చుకున్న‌ప్పుడ‌ల్లా నాకు నవ్వాగ‌దు. నేను క‌లిసిన వ్య‌క్తి జంతు, ప్ర‌కృతి ప్రేమికుడు. డేట్ రోజు న‌న్ను జూ పార్కుకు తీసుకెళ్లాడు. ఎండ విప‌రీతంగా మండిపోతుంది. చెమ‌ట‌లు మొత్తం ప‌ట్టేశాయి. 40 నిమిషాలు గ‌డిచాక నా వ‌ల్ల కాక‌, క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికెళ్లిపోయాను. అత‌డు న‌న్ను ద‌గ్గ‌ర‌లోని మెట్రో స్టేష‌న్‌లో దింపుతాన‌ని కూడా అన‌లేదు. క‌నీసం నా ఆరోగ్యం గురించీ ప‌ట్టించుకోలేదు.

Women reveal their weirdest dating experience

5. ఒక సారి ఫేస్‌బుక్‌లో ఒక ఫొటోగ్రాఫ‌ర్‌తో చాట్ చేస్తున్నాను. అత‌డు చాలా మంచివాడిలా అనిపించాడు. అత‌డ్ని క‌లిశాక అస్స‌లు గుర్తుప‌ట్ట‌లేక‌పోయాను. ఆ త‌ర్వాతే అర్థ‌మైంది. ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫొటోల‌న్నీ ఫొటోషాప్ చేసిన‌వ‌ని. అక్క‌డ క‌నిపించిన దానికి వాస్త‌వంగా అత‌డు చాలా తేడాగా ఉన్నాడు. నేను మోస‌పోయాన‌ని గుర్తించి అత‌డితో వాదించి అక్క‌డినుంచి వ‌చ్చేశాను.

English summary

Women reveal their weirdest dating experience

Have you been to a date that was no less than a torture, and you wish you never actually went for it? Well, we all know a date can be a pretty awkward experience sometimes. There is no guarantee how the person turns out to be and what they expect from you, right? We asked women about the creepiest date they have ever been to and here’s what they had to share…
Story first published: Wednesday, February 21, 2018, 8:00 [IST]