Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
ఆ రాత్రి అతనితో సముద్ర తీరానే వెన్నెల్లో ఇసుక తిన్నెలపైనే.. అయితే అదే పనిగా నన్ను అనుమానించేవాడు
ఆ అబ్బాయిలందరినీ అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు. వాళ్లకు డైరెక్ట్ గా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఎలా అంటే అలా తిట్టాడు. తను ప్రతి క్షణం నాపై అనుమానపడేవాడు. నేను తనను మోసం చేస్తున్నాని భావించేవాడు.
థర్టి ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయాలని ఉన్నా చేయలేను, అబ్బాయితో బలవంతంగా డ్యాన్స్ చేసేలా చేశారు
ఫస్ట్ ఇయర్ లో డిసెంబర్ థర్టి ఫస్ట్ నైట్ వసంత్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను కూడా వెంటనే యాక్సెప్ట్ చేశాను. తర్వాత తను బైక్ పై నన్ను సముద్ర తీరానికి తీసుకెళ్లాడు. ఆ రోజు రాత్రి నాకు భూమిపై ఉన్నట్లు లేదు. ఏదో స్వర్గంలో విహరించినట్లుగా అనిపించింది.

సముద్ర తీరాన వెన్నెల్లో
ఆ రోజు రాంత్రంతా సిటీకి దూరంగా సముద్ర తీరానే వెన్నెల్లో ఇసుకు తిన్నెలపై కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. నేను తన కౌగిళ్లలో ఒదిగిపోయిన క్షణంలో కాలం అలాగే ఆగిపోతే బాగుండనిపించింది. గంటల తరబడి ఇద్దరం మాట్లాడుకున్నా ఇంకా ఏదో తనకు చెప్పాలని వెలితిగా అనిపించింది.

మళ్లీ డిసెంబర్ థర్టి ఫస్ట్ వచ్చింది
అలా తెల్లవారు జామున వరకు అక్కడే ఉన్నాం. తర్వాత తను నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్లాడు. ఆ రోజు నేను జీవితంలో మరిచిపోలేను. కాలం గిర్రున తిరిగింది. మళ్లీ డిసెంబర్ థర్టి ఫస్ట్ వచ్చింది. కానీ ఈసారి కబర్లు చెప్పుకునేందుకు నా పక్కన వసంత్ లేడు.

తను పెద్దవిగా చేశాడు
మా ఇద్దరి మధ్య వచ్చిన చిన్నచిన్న సమస్యల్ని తను పెద్దవిగా చేశాడు. నాకు తనతో కాకుండా మరెవరితోనో ఎఫైర్ ఉన్నట్లు అనుమానపడ్డాడు. నా డిగ్రీ క్లాస్ మేట్స్ అప్పడప్పుడు కాల్ చేసేవారు. నాకు మెసేజ్ లు పంపేవారు.

తప్పుగా అర్థం చేసుకున్నాడు
ఆ అబ్బాయిలందరినీ అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు. వాళ్లకు డైరెక్ట్ గా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఎలా అంటే అలా తిట్టాడు. తను ప్రతి క్షణం నాపై అనుమానపడేవాడు. నేను తనను మోసం చేస్తున్నాని భావించేవాడు.

నా ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకునేవాడు
నా గురించి నా ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకునేవాడు. నా ఫోన్ ను ఎప్పుడూ చెక్ చేసేవాడు. నన్ను చాలా వేధించేవాడు. వాటిని తట్టుకోలేక నేను కొన్నాళ్లు అతనితో మాట్లాడడం మానేశాను.

దూరం పెరిగింది
తర్వాత మా మధ్య దూరం పెరిగింది. తను మరో అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. నాతో అస్సలు పరిచయం లేనట్లు నటించడం మొదలుపెట్టాడు. ఎంతో నమ్మకంగా ప్రేమిస్తే తను అలా చేశాడు.

ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటే
అందరూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటే నేను మాత్రం తను చేసిన మోసాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ గడుపుతున్నాను. ప్రతి క్షణం తనతో నేను గడిపిన క్షణాలే గుర్తొస్తున్నాయి. ఆ బాధ నుంచి కోలుకోలేక నిత్యం నరకం అనుభవిస్తున్నాను.

మోసం చేసే అమ్మాయిలపైనే
నమ్మకంగా ప్రేమించే అమ్మాయిల్ని చాలా మంది అబ్బాయిలు అస్సలు నమ్మరు. మోసం చేసే అమ్మాయిలపైనే ఎక్కువ మోజు పడుతుంటారు.

చాలా మంది బాయ్ ఫ్రెండ్స్
వాస్తవానికి ఇప్పుడు వసంత్ తో పాటు తిరుగుతున్న అమ్మాయి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ను మెయింటెన్ చేస్తుంది. కానీ ఆ అమ్మాయినే తను ఎక్కువగా నమ్ముతున్నాడు. తననే పెళ్లి చేసుకుంటాడట.

మోసం చేయొద్దని నా విన్నపం
నా బాయ్ ఫ్రెండ్ లా ఏ అబ్బాయి కూడా తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని మోసం చేయొద్దని నా విన్నపం. అసలు నిజం తెలుసుకోకుండా అనవసరంగా అనుమానాలు పెంచుకోకండి.



Click it and Unblock the Notifications