Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
Anti-Valentine’s Week 2023 List :యాంటీ వాలెంటైన్ వీక్ ఎప్పుడు.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా...
యాంటీ వాలెంటైన్స్ డై వీక్ 2023 : ఏరోజున స్లాప్ డే, కిక్ డే, బ్రేకప్ డే జరుపుకుంటారు.. అన్ రొమాంటిక్ వీక్ గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడే చూసెయ్యండి.
Anti-Valentine's Week 2023:ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసం వచ్చిందంటే చాలు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులంతా కొత్త లోకంలో విహరిస్తున్నట్లు.. కొత్త జంటలు.. ప్రేమ పావురాలన్నీ గాల్లో తేలియాడుతున్న అనుభూతిని పొందుతూ ఉంటారు.

ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14వ తేదీ కంటే వారం రోజులు ముందు నుండే చ్లాకెడ్ డే, కిస్ డే, హగ్ డే, ప్రపోజ్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, రోజ్ డే అంటూ ఆ వారమంతా పండుగ వాతావరణంలా ఫీలవుతారు. ఈ వాలెంటైన్ వీక్ సందర్భంగా తమ మనసుకు నచ్చిన వారికి ఖరీదైన బహుమతులు, ఎన్నో సర్ ప్రైజులు ఇస్తూ ఉంటారు. అలా తమ ప్రియమైన వారికి మరింత దగ్గరయ్యేందుకు.. వారి మనసులో స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇలా వాలెంటైన్ వీక్ మొత్తాన్ని ఎంతో హాయిగా జరుపుకుంటారు.

ఇదిలా ఉండగా.. ప్రేమికుల కోసం మాత్రమే కాదు.. బ్రేకప్ చెప్పుకున్న వారికి కూడా యాంటీ వాలెంటైన్ వీక్ అనేది ఒకటుందట. వినడానికి వింతగా ఉన్నా.. ఇది వాస్తవమే. ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే ఎలా అయితే జరుపుకుంటారో.. ఆ తర్వాత రోజు నుండి యాంటీ వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. అయితే ఇదంతా ప్రేమికులకు వ్యతిరేకం అనుకునేరు.. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.

ఎందుకంటే బ్రేకప్ పేరిట విడిపోయిన వారు సరదాగా గడిపేందుకు కొత్త జీవితాన్ని మరోసారి ప్రారంభించాలనేది దీని ఉద్దేశ్యం. అందుకే ఫిబ్రవరి 15వ తేదీన స్లాప్ డే, 16వ తేదీన కిక్ డే, 17వ తేదీన పర్ఫ్యూమ్ డే, 18వ తేదీన ఫ్లర్టింగ్ డే, 19వ తేదీన కన్ఫెషన్ డే, 20వ తేదీన మిస్సింగ్ డే, 21వ తేదీన బ్రేకప్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

చరిత్రను పరిశీలిస్తే..
యాంటీ వాలెంటైన్ డేకి సంబంధించి ఎలాంటి హిస్టరీ లేదు. అయితే ఈ వేడుకలను కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఈ యాంటీ వాలెంటైన్ వీక్ లో ఉన్న ఏడురోజులకు ఎలాంటి ప్రాధాన్యత ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్లాప్ డే(Slap Day)
యాంటీ వాలెంటైన్ వీక్ లో తొలి రోజును స్లాప్ డే జరుపుకుంటారు. అయితే ఈ సందర్భంగా మీరిద్దరూ ఘర్షణ పడాలని అర్థం కాదండోయ్.. ఈ కాలంలో మీ సంబంధంలో వచ్చే చిన్న చిన్న సమస్యలకు దీన్ని సంకేతంగా భావిస్తారట.

కిక్ డే(Kick Day)
యాంటీ వాలెంటైన్ వీక్ లో భాగంగా రెండో రోజు కిక్ డే జరుపుకుంటారు. దీనికి ఓ స్పెషాలిటీ ఉంది. ఈ సమయంలో ఇద్దరు ప్రేమ పావురాల మధ్య మాటల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో గొడవ పడేందుకు దారి తీస్తుంది. దీనికి సంకేతంగా భావించి కిక్ డే ను జరుపుకుంటారట.

పర్ఫ్యూమ్ (Perfume Day)
యాంటీ వాలెంటైన్ వీక్ లో భాగంగా మూడో రోజు పర్ఫ్యూమ్ డేను జరుపుకుంటారు. తమ రిలేషన్ షిప్ వచ్చిన కలహాలు, అంతవరకు మానసికంగా ఇబ్బంది పడిన వారికి కొంచెం ఉపశమనం కలిగించేదే పర్ఫ్యూమ్ డే. ఈ కాలంలో మీ లైఫ్ లో జరిగిన గొడవలన్నీ మరచిపోయి.. సాఫీగా ముందుకు సాగిపోవాలనే సందేశాన్నిచ్చేదే పర్ఫ్యూమ్ డే.

ఫ్లర్ట్ డే..
యాంటీ వాలెంటైన్ వీక్ లో భాగంగా నాలుగో రోజున ఫ్లర్ట్ డేగా జరుపుకుంటారు. తమ ప్రియుడు లేదా ప్రియురాలితో విడిపోయిన తర్వాత కొత్త లైఫ్ కి వెల్ కమ్ చెబుతూ ఈ ఫ్లర్ట్ డేని జరుపుకుంటారు.

కన్ఫెషన్ డే..
యాంటీ వాలెంటైన్ వీక్ లో భాగంగా ఐదో రోజున కన్ఫెషన్ డేను జరుపుకుంటారు. రిలేషన్ షిప్ లో ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు, గత రిలేషన్లో ఏర్పడిన గాయాలు, ఇబ్బందులన్నీ పూర్తిగా మరచిపోయి.. సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించుకునేందుకు ఈ కన్ఫెషన్ డేగా జరుపుకుంటారట.

మిస్సింగ్ డే..
యాంటీ వాలెంటైన్ వీక్ లో భాగంగా ఆరో రోజున మిస్సింగ్ డేగా జరుపుకుంటారు. కొన్ని సందర్భాల్లో మనం ఎంత బ్యాలెన్స్ గా ఉందామని అనుకున్నా.. రిలేషన్ షిప్ లో వచ్చిన ఇబ్బందులు మనల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వవు. అంతేకాదు.. పార్ట్నర్ తో గడిపిన అద్భుతమైన సమయాన్ని మిస్సవుతుంటాం. అందుకే సంకేతంగా ఈ మిస్సింగ్ డే జరుపుకుంటారు.

బ్రేకప్ డే..
యాంటీ వాలెంటైన్ వీక్ లో భాగంగా చివరి రోజైన ఏడో రోజున బ్రేకప్ డే జరుపుకుంటారు. మిస్సింగ్ డే తర్వాత తమ సంబంధం విషయంలో చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయం ఇది. ఇప్పటిదాకా ఎవరైతే టాక్సిక్ రిలేషన్లో ఉన్నారో.. వారంతా ఆ రిలేషన్ నుండి బయటకు వచ్చే రోజునే బ్రేకప్ డేగా జరుపుకుంటారు.

హ్యాపీగా గడిపేందుకు..
చూశారు కదా.. యాంటీ వాలెంటైన్ వీక్ విశేషాలను. అయితే వాలెంటైన్ వీక్ అయినా.. యాంటీ వాలెంటైన్ వీక్ అయినా.. ఏదైనా మనం హ్యాపీగా ఉండేందుకే జరుపుకుంటామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే మీరు ఎవరితో అయితే హ్యాపీగా ఉంటారో.. ఎవరైతే మిమ్మల్ని హ్యాపీగా మారుస్తారో అలాంటి వారితో ఎక్కువ సమయం గడపండి.
ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే ఎలా అయితే జరుపుకుంటారో.. ఆ తర్వాత రోజు నుండి యాంటీ వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. అయితే ఇదంతా ప్రేమికులకు వ్యతిరేకం అనుకునేరు.. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే బ్రేకప్ పేరిట విడిపోయిన వారు సరదాగా గడిపేందుకు కొత్త జీవితాన్ని మరోసారి ప్రారంభించాలనేది దీని ఉద్దేశ్యం. అందుకే ఫిబ్రవరి 15వ తేదీన స్లాప్ డే, 16వ తేదీన కిక్ డే, 17వ తేదీన పర్ఫ్యూమ్ డే, 18వ తేదీన ఫ్లర్టింగ్ డే, 19వ తేదీన కన్ఫెషన్ డే, 20వ తేదీన మిస్సింగ్ డే, 21వ తేదీన బ్రేకప్ డే జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications