Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
Father's Day gifts 2022: నాన్నకు ప్రేమతో.. అదిరిపోయే కానుకలిచ్చేయండి...
ఫాదర్స్ డే 2021 సందర్భంగా మీ నాన్నకు ఎలాంటి బహుమతులివ్వాలో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.
నాన్న అంటనే ఒక ధైర్యం.. నాన్న అంటే ఒక నమ్మకం.. నాన్న అంటే ఒక అభయం.. నాన్న అంటే మమకారం.. నాన్న అంటే కొంచెం కోపం.. నాన్న అంటే బాధ్యత.. నాన్న అంటే ఒక త్యాగం.. నాన్న అంటే ఒక భరోసా ఒక్కటే కాదు మనల్ని విడదీయలేని బంధం..

అందుకే ఆ పదం వింటేనే ప్రతి ఒక్కరికీ ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. మనం పుట్టినప్పటి నుండి మన ఎదుగుదల కోసం అనునిత్యం కష్టపడే నాన్న.. మన బాధ్యతను మనకు గుర్తు చేసే నిత్య గురువు. మన లక్ష్యం చేరడానికి తను ప్రతి నిమిషం తోడుగా నిలుస్తూ..

మనకు ఆత్మస్థైర్యాన్ని అందించే నాన్న అప్పుడప్పుడు మనతో కఠినంగా ఉంటున్నప్పటికీ, తన గుండె లోతుల్లో మాత్రం ఎంతో ప్రేమను దాచుకుంటాడు. అలాంటి నాన్నలందరికీ ఫాదర్స్ డే సందర్భంగా ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుందో చూసెద్దామా...

స్మార్ట్ వాచ్..
మనలో చాలా మంది నాన్నలు పాత తరం వాళ్లే. అంటే స్మార్ట్ వాచ్ గురించి వారికి పెద్దగా తెలియకపోవచ్చు. వారు ఎక్కువగా సాధారణ వాచ్ లను వాడుతూ ఉంటారు. కాబట్టి ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నకు స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇవ్వండి. ఇందులోని ఫీచర్ల గురించి వారికి తెలియజేయండి. ఈరోజుల్లో స్మార్ట్ వాచ్ టెక్నాలజీ బాగా పెరిగింది. ఫాదర్స్ డే సందర్భంగా లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ను మీ నాన్నగారికి గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.

స్మార్ట్ ఫోన్..
మనం చిన్నప్పటి నుండి ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే నాన్నకు మనం ఈసారి స్మార్ట్ ఫోన్ ను కానుకగా ఇవ్వొచ్చు. స్మార్ట్ ఫోనులోనూ లేటెస్ట్ టెక్నాలజీ 5G ఫోన్ ను కొనుగోలు చేసి మీ నాన్నగారికి గిఫ్ట్ గా అందివ్వొచ్చు. మీ నాన్నగారిని టెక్నాలజీ పరంగా అప్ డేట్ అవ్వమని కోరండి. ఇది చూసిన మీ తండ్రి ఎంతగానో సంతోషిస్తారు.

మంచి కెమెరా..
మీ నాన్న ఎక్కువగా జర్నీ చేస్తుంటారా? అందులోనూ టూరిస్టు ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తుంటే.. అలాంటి వారికి కెమెరాను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ప్రస్తుతం కెమెరాల్లో కొత్త టెక్నాలజీ వచ్చింది. 4K రిజల్యూషన్ ఉన్న వీడియోలను కూడా కెమెరాతో తీసే టెక్నాలజీ వచ్చింది. అంతేకాదు ఇవి వైఫై, ఎన్ఎఫ్ సీలకు సపోర్ట్ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఇలాంటి కొత్త కెమెరాను మీ నాన్నకు గిఫ్ట్ గా ఇచ్చేయండి. వారిని సర్ ప్రైజ్ చేయండి.

సన్ గ్లాసెస్..
మీ నాన్న ఎండలో ఎక్కువగా జర్నీ చేస్తుంటారా? అయితే సూర్యుడి నుండి మీ నాన్న కళ్లను కాపాడుకోవడానికి మీరు మంచి నాణ్యత గల కళ్లజోడు(Sun glasses)ను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మంచి స్టైలీష్ గా ఉండే సన్ గ్లాసెస్ ను మీ తండ్రికి బహుమతిగా ఇచ్చేయండి.

మంచి డ్రస్..
మీ నాన్న ఎప్పుడూ చొక్కాలు వేస్తుంటే.. వారిని ఫాదర్స్ డే రోజున కొంచెం కొత్తగా చూడాలనుకుంటే.. వారికి మీరు మంచి టీషర్ట్ ను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. అయితే ఆ టీ షర్ట్ మీద మంచి కొటేషన్ లేదా ఏదైనా సూక్తి ప్రింట్ చేసి ఇస్తే, తను చాలా కాలం గుర్తుంచుకుంటాడు.

కాఫీ మేకర్..
మీ నాన్నకు కాఫీ అంటే చాలా ఇష్టమా.. అయితే తనకు మీరు ఓ మంచి కాఫీ మేకర్ ను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. దీని వల్ల మీ తల్లిగారు కూడా ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే ప్రతిరోజూ ఆమెకు కాఫీ చేసే శ్రమ కూడా తగ్గుతుంది.

ఫొటో ఫ్రేమ్..
మీ తండ్రితో మీకు ఉన్న మంచి తీపి గుర్తులను, మధుర క్షణాలను, జ్ణాపకాలను మీ దగ్గరే ఉంచుకోవడానికి మంచి ఫొటోలను బంధించడానికి మంచి క్వాలిటీ ఉన్న ఫొటో ఫ్రేమ్ అనేది చాలా ముఖ్యం. ఇవి ప్రతి సందర్భంలోనూ ప్రత్యేకమే. ఇలాంటి అరుదైన ఫొటోలను ఒకే చోట కూర్చి మంచి ఫొటోఫ్రేమ్ గా మార్చండి. దాన్ని మీ నాన్నకు గిఫ్ట్ గా ఇవ్వండి.

నాన్నతోనే ఉండండి..
ఇలాంటి గిఫ్టులతో పాటు మీ నాన్నకు మంచి ట్రిమ్మర్, బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ బట్టలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గిఫ్టులను ఇవ్వొచ్చు. ఇక చివరగా ఈరోజు మీ నాన్నతోనూ పూర్తిగా గడిపేందుకు ప్రయత్నించండి. మీ నాన్న కోసమే సమయాన్ని కేటాయించండి. వీలైతే అమ్మనాన్నలను ఓ మంచి రెస్టారెంటుకు తీసుకెళ్లండి. ప్రస్తుతం అది వీలు కాకపోతే మంచి రెస్టారెంట్ నుండి మీ నాన్నకు నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేయండి.



Click it and Unblock the Notifications
