Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Mother’s Day 2022:ఈ మదర్స్ డే వేళ అమ్మకు మరచిపోలేని అనుభూతిని అందివ్వండి...
తొలిసారి మదర్స్ డే జరుపుకోవాలనుకుంటే.. ఈ మార్గాలను అనుసరించండి.
అమ్మ అనే పదంలోనే ప్రపంచం మొత్తం నివసిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన కడుపులో నలుసు పడిన నాటి నుండి తొమ్మిది నెలల పాటు ఎంతో సహనంతో.. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి పునర్జన్మనెత్తుకుంటుంది.

అయితే అప్పటివరకు పడిన పురిటినొప్పులను కాస్త.. బిడ్డ ఒడిలో పడిన వెంటనే మరచిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరి లైఫ్ లో అమ్మ ఎంతో ప్రత్యేకం. తల్లీబిడ్డల మధ్య అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. అమ్మ ప్రేమ, త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏటా సెలబ్రేట్ చేసుకునే రోజే మదర్స్ డే.

'అమ్మ త్యాగం తన కంటే కోటి రెట్లు ఎక్కువని.. భూదేవిని అడిగినా చెబుతుంది.. అమ్మ అంటేనే ఓర్పు అని.. ఓర్పు అంటేనే అమ్మ అని.. అందుకే ఈ సృష్టిలో అమ్మే గొప్పది.. తల్లిని మించిన యోధులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు' అని కొందరు కవులు, మేధావులు చెబుతుంటారు. అయితే అమ్మ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. ఈ నేపథ్యంలో మే 8వ తేదీన ఆదివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ తల్లుల దినోత్సవ వేడుకలు జరుపుకోనున్నారు.

ఈ మదర్స్ డే సందర్భంగా అదిరిపోయే కానుకలను అమ్మకు అందిస్తారు. అయితే ఇంతవరకు మీరు ఎప్పుడూ మదర్స్ డే వేడుకలు జరుపుకోలేదా? తొలిసారిగా మీ అమ్మగారిని శ్చర్యపరచాలనుకుంటున్నారా? అయితే మీ కోసం మా దగ్గర కొన్ని అద్భుతమైన ఐడియాలు ఉన్నాయి. అవేంటో చూడండి.. వీటిని ఫాలో అవుతూ మీ అమ్మగారిని సర్ ప్రైజ్ చేయండి..

తొలి కానుక..
మదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మంచి కానుక(Best Gift). మీరు మీ తల్లికి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటే, మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మీరు చింతించాల్సిన పనిలేదు. మార్కెట్లో మన బడ్జెట్ కు అందుబాటులో ఉండే కాఫీ మగ్స్, ఇయర్ రింగ్స్, ఫొటో ఫ్రేమ్స్, మట్టి గాజులు తదితర వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటితో మంచి గ్రీటింగ్ కార్డు కూడా ఇవ్వొచ్చు. ఏదేమైనా మీ అమ్మకు మీరిచ్చే కానుక ఖరీదైనదా లేదా తక్కువ ధర ఉండేదా అనే పట్టింపు తల్లికి ఎలాగూ ఉండదు.

తల్లితో ఎక్కువ సమయం..
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో కనీసం మదర్స్ డే రోజైనా మీ అమ్మతో ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ అమ్మకు ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. అంతేకాదు మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది.

ఈరోజు విశ్రాంతినివ్వండి..
ప్రతిరోజూ నిద్ర లేచిదగ్గర్నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు విరామం అనేది లేకుండా ఒళ్లంతా పులిసిపోయేలా పని చేస్తుంది. చిన్నారులకు ఉదయం పాఠశాలకు పంపేందుకు, పెద్దవారికి ఆఫీసుకు పంపేందుకు మంచి రుచికరమైన వంటలు తయారు చేసేందుకు, ఇంకా ఏవేవో టెన్షన్లతో అమ్మ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మకు, కనీసం మదర్స్ డే రోజైనా పూర్తి విశ్రాంతి ఇవ్వండి. ఈ ఒక్కరోజు తనకు ఎలాంటి పనులు చెప్పొద్దు.

ఇష్టమైన వంటకం..
అమ్మ చేతి వంట ఎప్పటికీ ప్రత్యేకమే. అది ఎండాకాలం అయినా, చలికాలం అయినా.. గంటల తరబడి కిచెన్లో కష్టపడి మన కోసం వండి పెడుతుంది అమ్మ. అయితే మదర్స్ డే రోజున మాత్రం తనకు ఇష్టమైన వంటకాన్ని మీరే తయారు చేయండి. మీరు కూడా కొన్ని అద్భుతమైన వంటలను చేయడం ద్వారా ఈ ప్రత్యేక సందర్బాన్ని మరింత ప్రత్యేకంగా చేయొచ్చు.

ఇంటిని అలంకరించడం..
మన ఇంటిని అనునిత్యం శుభ్రం చేస్తూ.. ఇంటిని కలర్ ఫుల్ గా ఉంచే అమ్మ కోసం.. మదర్స్ డే రోజున ఇంట్లో అందమైన వస్తువులను ఉంచడం.. అరుదైన వస్తువులతో ఇంటిని అలంకరించడం వంటివి చేసి మీ అమ్మగారికి అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చేయండి.

ఏదైనా టూర్..
మీ అమ్మ ఎప్పటినుంచో ఏదైనా ప్రదేశానికి వెళ్లాలని ఆశపడుతున్నా.. కుటుంబం, ఇతర బాధ్యతల వల్ల అది సాధ్యం కాకపోయిండొచ్చు. లేదా ఇతర కారణాలు కావొచ్చు. అయితే మదర్స్ డే రోజున మీ అమ్మ మనసులో ఏముందో ఓ ఫ్రెండ్ గా తెలుసుకుని తనకు తెలియకుండా ఓ సర్ ప్రైజ్ టూర్ ప్లాన్ చేయండి. అయితే ప్లానింగుకు ముందు మీ అమ్మను.. ఆ ప్రదేశానికి తీసుకెళ్లేందుకు కరెక్ట్ డేట్ ఏదో మీరే గుర్తించాలి. అలాగే ఆ సీజన్ ను కూడా గుర్తు పెట్టుకోవాలి.



Click it and Unblock the Notifications