For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ కార్యంలో కలకాలం కచ్చితంగా సక్సెస్ కావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి...

|

ఈ విశ్వంలో ప్రతి జంట తమ కోరికలను తీర్చుకునేందుకు తెగ ఆరాటపడుతుంటారు. వివాహం కాక ముందు ఎన్నెన్నో కలలు కంటారు. ఊహాలోకంలో విహరిస్తూ ఏవేవో ఊహించుకుంటారు. వివాహం అయిన తర్వాత ఆ కలలను నిజం చేసుకోవాలనుకుంటారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యానికి వారు దూరమవుతుంటారు. కానీ అలాంటి సమయాల్లో ఉద్రేకం పెరుగుతూ ఉంటుంది.

simple attitude adjustments can change your life

కానీ మీ భాగస్వామి అంతకుముందు జరిగిన విషయాలను గుర్తు పెట్టుకుని మీకు దూరంగా ఉంటారు. అందుకే మీ భాగస్వామిని రెచ్చగొట్టాలంటే మీరు కొన్ని ట్రిక్కులు ప్లే చేయాలి. అప్పుడు మీ కోరికలను తీర్చుకునేందుకు ప్రయత్నించండి... అందుకోసం ఈ చిట్కాలను ఫాలో అవ్వండి...

వీకెండ్స్ లో టూర్స్...

వీకెండ్స్ లో టూర్స్...

మీకు మీ భాగస్వామికి మధ్య ఇప్పటి వరకు ఎన్ని మనస్పర్దలు ఉన్నా... లేదా మీ రొమాంటిక్ జీవితంలో మరింత ఊపు కావాలన్నా మీరు వీకెండ్స్ లో ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడానికి ప్రయత్నించండి. అక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ లు మాట్లాడుకోండి. అవి మీ మూడ్ ను మరియు కోరికలను పెంచుతాయి. అయితే మీ భాగస్వామి పరిస్థితిని బట్టి ఇలాంటివి చేయండి. దీని వల్ల మీకు ఆ కార్యం పూర్తి చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీ భాగస్వామికి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. ఆటోమేటిక్ గా మీరు ఇద్దరు మరింత దగ్గరవుతారు.

కొత్త వాటిని ట్రై చెయ్యండి...

కొత్త వాటిని ట్రై చెయ్యండి...

ప్రస్తుత రోజుల్లో గ్రామీణ వాతావరణం తగ్గిపోతుంది. ఎక్కడ చూసినా సిటీ కల్చర్ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. అందుకే మీరు కూడా కొంచెం కొత్త విషయాలను ట్రై చెయ్యాలి. మీరిద్దరూ కొన్ని కారణాల వల్ల శారీరకంగా దూరంగా ఉన్నా స్మార్ట్ ఫోన్ ద్వారా ఆ కోరికలను తీర్చుకునేందుకు ప్రయత్నించండి. రొమాంటిక్ యాంగిల్ లో మంచి ఫొటోను తీసి మా పార్ట్ నర్ కు పంపండి.

అవసరమైతే వెబ్ కామ్..

అవసరమైతే వెబ్ కామ్..

మీకు అప్పటికీ సంతోషం కలగకపోతే మీరు టెక్నాలజీ వాడుకోండి. వెబ్ కామ్ ఓపెన్ చేసి మరీ ముచ్చట్లు కలపండి. లేదా స్మార్ట్ ఫోన్లలో వీడియో కాల్స్ చేయండి మీ జీవిత భాగస్వామిని మరింత ఉద్వేగానికి గురి చేయండి. ఇలాంటి విషయాలలో పురుషులు చాలా త్వరగా లొంగిపోతారు.

పొరపాటు జరిగితే సారీ..

పొరపాటు జరిగితే సారీ..

భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు అనేది చాలా సహజం. అందుకనే మీరు కోపంతో జీవిస్తే మీరు కోరికలను మీరు చేతులారా నాశనం చేసుకున్నట్టే. అందుకనే మీరు మనోవేదనలను అధిగమించాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని క్షమించమని అడగడం వంటివి చేయాలి. అప్పుడే మీ మధ్య దూరం తగ్గుతుంది. మీ ఇద్దరి మధ్య వద్దన్నా ఆత్రం పెరుగుతుంది.

సహాయం చేయండి..

సహాయం చేయండి..

మీ జీవిత భాగస్వామి వంటలు చేసే సమయంలోనూ మీరు రొమాన్స్ చేయవచ్చు. అయితే మీరు కూడా మీ పార్ట్ నర్ కు సహాయం చేయాల్సి ఉంటుంది.

మితంగా మద్యం..

మితంగా మద్యం..

మీకు మద్యం సేవించే అలవాటు ఉంటే మాత్రం సాధ్యమైనంత మేరకు మానుకోవడానికి ప్రయత్నించండి. అయితే మీరు మితంగా మద్యం తీసుకుంటే ఆ విషయంలో మీరు మంచి పట్టు సాధించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో పరిమితికి మంచి మద్యం సేవించకండి.

సరైన సమయంలో కునుకు..

సరైన సమయంలో కునుకు..

మీరు మీ ఒత్తిడికి తగ్గట్టు సరైన సమయంలో సరైన గంటలు కునుకులోకి జారుకోవాలి. ఒక అధ్యయనం ప్రకారం ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోయే వారు ఆ కార్యంలో రాణించేందుకు మంచి ఉత్సాహంతో ఉంటారని తేలింది. నిద్రకు ముందు రొమాంటిక్ నవలలు చదవండి. ఇవి మహిళలకు మంచిగా ఉపయోగపడతాయి. అలాగే మీరు ఖాళీగా ఉన్న సమయంలోనూ వీటిని చదవండి.

వ్యాయామం..

వ్యాయామం..

మీరు మంచంపై చేసే వ్యాయామంలో రాణించాలంటే ముందుగా మీరు బయటి వాతావరణంలో వాకింగ్, జాగింగ్, లేదా జిమ్ బాట పట్టాలి. మీ శరీర ధారుడ్యాన్ని అందంగా మలచుకోవాలి. అప్పుడు మీ భాగస్వామికి మిమ్మల్ని చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది. మీ శరీరం నుండి మీరు ఎంతగా చెమటను చిందిస్తే మీకు అంత లాభం వస్తుంది.

షాపింగ్ మరియు సినిమాలు..

షాపింగ్ మరియు సినిమాలు..

మీరు ప్రతి వారం లేదంటే కనీసం నెలకు ఒకసారైనా కలిసి షాపింగ్ చేయండి. అలాగే సినిమాలకు వెళ్లండి. సినిమాలలో కూడా రొమాంటిక్ మూడ్ పెంచే వాటిని చూడండి. దీని వల్ల కూడా మీలో రగిలే కోరికలను చల్లార్చుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

English summary

simple attitude adjustments can change your life

Here we talking about simple attitude adjustments can change your life. Read on
Story first published: Wednesday, December 11, 2019, 17:19 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more