For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలేషన్ షిప్ లో ఆ విషయాలను అస్సలు ఆశించకండి! ఎందుకంటే..

ప్రేమ అంటే కేవలం రొమాంటిక్ మ్యాజిక్ కాదు. ప్రేమ జీవితం ఎప్పుడూ గులాబీల గుబాళింపు అసలే కాదు. ప్రతి ప్రేమ కథలో మాయాజాలం అయితే ఉంటుంది.

|

ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకరిని ప్రేమించడం లేదా ప్రేమించబడటం అనేది చాలా అద్భుతమైన అనుభూతి. ఎవరైనా మిమ్మల్ని కలుసుకోవడం ప్రారంభించినప్పుడు, మీరు వారితో మీ భవిష్యత్తు గురించి చాలా మాట్లాడుకుంటూ నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇలాంటివి మీ బంధాన్ని బాగా బలపరుస్తాయి. కానీ ప్రేమలో లేదా రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో పదే పదే సమస్యలు చెప్పుకోవడం ప్రారంభించడం.. వారి నుండి ఏదో ఆశించడం చేస్తే, వాటి వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.

Things You Should Not Expect In A Relationship

అలాగే మీరు సినిమాలను ఫాలో అయితే కూడా కష్టమే. ఎందుకంటే సినిమాలో ప్రేమలు ప్లాన్ ప్రకారం నాటకీయంగా సాగుతాయి. అలాంటి ప్రేమలు చాలా వరకు వాస్తవాం కాదు. అందుకే మీరు రిలేషన్ షిప్ లో లేదా ప్రేమలో ఉన్నప్పుడు సినిమాలకు వెళ్లడం వంటివి చేస్తుంటే మీరు కచ్చితంగా నిరాశ చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి వల్ల మీ ప్రేమలో లేదా రిలేషన్ షిప్ లో చీలికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందుకే మీరు ప్రేమలో ఉన్నసమయంలో కచ్చితంగా ఆశించడకూడని విషయాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మీ ప్రేమలో

మీ ప్రేమలో

మీ ప్రేమలో లేదా రిలేషన్ షిప్ లో ఉన్న సందర్భంలో ఏ వ్యక్తి పర్ఫెక్ట్ కాదు అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలు అనేవి ఉంటాయి. మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ గానీ ఇలా పర్ఫెక్ట్ నెస్ ఆశిస్తే అది తెలివితక్కువతనం అవుతుంది. మీరు ఒకరి లోపాలను ఒకరు ఎంతవరకు అంగీకరించి దానిపై ఎంతవరకు కట్టుబడి ఉంటారు అనేదే ప్రేమలో కీలకం. కొన్నిసార్లు మీరు మీ భాగస్వామి యొక్క బలహీనతలను బహిరంగంగా చెప్పేస్తారు. అలాంటి సమయంలో మీరు వాటిని అంగీకరించండి. కానీ వారి మాయలో మాత్రం పడకండి.

రొమాంటిక్ మ్యాజిక్..

రొమాంటిక్ మ్యాజిక్..

ప్రేమ అంటే కేవలం రొమాంటిక్ మ్యాజిక్ కాదు. ప్రేమ జీవితం ఎప్పుడూ గులాబీల గుబాళింపు అసలే కాదు. ప్రతి ప్రేమ కథలో మాయాజాలం అయితే ఉంటుంది. మీరు మరియు మీ భాగస్వామి కలిసినప్పుడు పక్షుల కిలకిలలు, పాటలు పాడటం, వయోలిన్ వాయించడం లేదా సినిమాలకు వెళ్లడం వంటివి ఆశించవద్దు. వాస్తవికతను అంగీకరించండి. మీ సహచరుడు గురించి మీరు ఏమనుకుంటున్నారో అనేది ముఖ్యం. మీరు ఎల్లప్పుడూ మీ సహచరుడి కోసం ఒక మాయా వాతావరణాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ ప్రేమ సున్నితంగా మరియు నిజాయితీ ఉన్నప్పుడు మాత్రమే అది మీ మనసును తాకుతుంది.

ప్రేమ కథ ఆసక్తికరంగా..

ప్రేమ కథ ఆసక్తికరంగా..

అందరి కంటే మీ ప్రేమ ఆసక్తికరంగా ఉండవచ్చు. కానీ మీ ప్రేమలో మీరు అదే ఆశించినట్లయితే, ఆ ఆలోచనను వెంటనే వదిలేయండి. మీ ప్రేమను అద్భుత కథగా మార్చడానికి మీ ఇద్దరి కృషి ఎంతగానో అవసరం. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య విభేదాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉండవచ్చు. మీరిద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంటేనే మీ సంబంధం మరింత బలపడుతుందని మీరు అర్థం చేసుకోవాలి.

ఎప్పుడూ ఆనందం ఆశించడం..

ఎప్పుడూ ఆనందం ఆశించడం..

మీ సహచరుడు మిమ్మల్ని ఎప్పటికీ బాధించడు. మనం మానవులం కాబట్టి ఎప్పుడు ఏమి జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఇందుకు మీ సహచరుడు కూడా మినహాయింపు కాదు. కాని ఒకరి మనసులో ఏముందో ఎవ్వరూ చెప్పలేరు. మీరు ఏదైనా ఓ సందర్భంలో మీ జీవిత భాగస్వామిని ఏదైనా కోరుకుంటే వారు దానిని నెరవేర్చకుండా నివారించడానికి ప్రయత్నించవచ్చు. అంతమాత్రాన మీపట్ల వారి ప్రేమ తగ్గిపోయిందని కాదు. అలాగే కొన్నిసార్లు కోపంతో వారు కోపంలో ఉన్న సమయంలో ఏదైనా మాటలతో మిమ్మల్ని బాధపెడతారు. ప్రేమ అన్నాక ఇలాంటివి చాలా సాధారణమే. కాబట్టి ప్రేమలో ఎప్పుడూ ఆనందాన్ని మాత్రమే ఆశించడం అనేది తప్పు అవుతుంది.

మీకే ప్రాధాన్యత ఇవ్వాలని..

మీకే ప్రాధాన్యత ఇవ్వాలని..

మీరు మీ భాగస్వామితో మాట్లాడదలచుకున్నప్పుడు ప్రేమ గురించి మాత్రమే కాకాకుండా, వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం ఎల్లప్పుడూ ముఖ్యమే. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు మరి. కొన్నిసార్లు వారి వ్యక్తిగత సమస్యల కారణంగా వారు తమ ఆలోచనలను వ్యక్తపరచలేకపోవచ్చు. వారు మీకు ఇచ్చే శ్రద్ధ వల్ల వారి సమస్య తగ్గిపోవచ్చు. కాబట్టి మీ భాగస్వామి మీకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతనివ్వాలని ఆశించకండి.

సంఘర్షణ లేని ప్రేమ సాధ్యం కాదు..

సంఘర్షణ లేని ప్రేమ సాధ్యం కాదు..

మీరు ప్రేమలో లేదా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మీ సంబంధం సజావుగా మరియు ఎలాంటి గొడవలు లేకుండా నడుస్తుందని మీరు ఆశించడంలో తప్పు లేదు. కానీ మీ ప్రేమలో ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా ఒకసారైనా గొడవలు జరిగే ఉంటాయి. ఇందుకు మీరు మరియు మీ భాగస్వామి వేర్వేరు నేపథ్యాలు, సంస్కృతులు, విభిన్న దృక్పథాలు మరియు పెంపకం నుండి వచ్చినందున ఇలాంటివి మీకు ఎదురుకావచ్చు. ఇది సంఘర్షణ మరియు ఘర్షణకు దారితీస్తుంది, కానీ మీరు ప్రశాంతంగా ఉండి పరిస్థితిని తెలివిగా నిర్వహించాలి. ఎందుకంటే సంఘర్షణ లేకుండా ప్రేమ సాధ్యం కాదు.

మీ భాగస్వామి ఆలోచనలు..

మీ భాగస్వామి ఆలోచనలు..

మీరు ప్రేమలో ఉంటే మీ భాగస్వామి మనస్సును ఎల్లప్పుడూ అంచనా వేస్తుంటారు. జ్యోతిష్యుల మాదిరిగా ముందుగానే మీ భాగస్వామి గురించి చెప్పాలని ఆశిస్తుంటారు. ఇదంతా మీ రిలేషన్ షిప్ ప్రారంభంలో, మీ భాగస్వామి మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఊహించవచ్చు. కానీ ప్రతిసారీ ఇలానే జరగాలంటే అది సాధ్యం కాదు.

English summary

Things You Should Not Expect In A Relationship

Here are the list of things you should not expect in a relationship. Read on.
Desktop Bottom Promotion