Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Valentines day:ఫిబ్రవరి 14నే వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా...
వాలెంటైన్స్ 2023 సందర్భంగా ప్రేమికుల చరిత్ర, సంప్రదాయాలు, వాలెంటైన్స్ డే అర్థాలేంటో మీరే చూడండి.
Valentines day Special:
నిజమైన ప్రేమలో ఉండే వారికి కేవలం వాలెంటైన్స్ డే రోజే కాకుండా ప్రతిరోజూ పండగలాగే సాగుతుందట. అయితే ప్రేమికుల దినోత్సవం(Valentine Day)రోజు మరింత స్పెషల్ గా ఉంటుందట.

వాలెంటైన్స్ డే రోజున తమ ప్రియురాలు లేదా ప్రియుడికి మరింత దగ్గరవ్వాలని.. తమ బంధం శాశ్వతంగా ఉండిపోవాలని చాలా మంది ప్రేమికులు కోరుకుంటారు. ఇదిలా ఉండగా.. నిజాయితీగా ఉండే ప్రేమ గురించి తెలియజేయడానికి ప్రత్యేకంగా ఒకరోజు అంటూ ఉండాల్సిన అవసరమేమీ లేదు.

ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు.. ఎవరి మనసులో పుడుతుందో ఎవ్వరికీ తెలీదు. అందుకే తమ లవ్ ను ఎలా అయినా తెలపొచ్చు. అయితే వాలెంటైన్స్ డే రోజునే లవ్ ప్రపోజ్ ఎందుకు చేస్తారు.. అసలు ఫిబ్రవరి 14వ తేదీనే వాలెంటైన్స్ డే రోజుఎందుకు జరుపుకుంటారు.. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

చరిత్రను పరిశీలిస్తే..
ప్రేమ గురించి ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో వర్ణిస్తూ ఉంటారు. ప్రేమలో పడిన ప్రతి ఒక్కరూ కవులుగా మారిపోతూ ఉంటారు.
తమ ప్రియుడిని లేదా ప్రియురాలిని ఊహించుకుంటూ అద్భుతమైన అక్షరమాలతో తమ ప్రేమికుల గురించి వర్ణిస్తూ ఉంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. వాలెంటైన్స్ డే గురించి అనేక కథలు వినిపిస్తున్నాయి. కానీ వాటన్నింట్లో వాలెంటైన్ స్టోరీనే బాగా హైలెట్ అయ్యింది.

ప్రేమ సిద్ధాంతం..
క్రీస్తు శకం 270లోనే ప్రేమ సిద్ధాంతాన్ని మత గురువు వాలెంటైన్ యువతకు బోధించేవాడట. హింస, స్వార్థం, ద్వేషం వంటి దుర్గుణాలపై పోరాడటానికి ప్రేమను మించిన ఆయుధం లేదని నమ్మాడు ఆనాటి క్రైస్తవ మత గురువు వాలెంటైన్. తను రోమ్ లో ఉంటూ నిత్యం యువతీ యువకుల మధ్య ప్రేమ పుట్టేందుకు తన వంతు ప్రయత్నం చేసేవాడట. అక్కడితో ఆగకుండా ప్రేమలో పడిన వారికి.. ప్రేమలో మునిగిపోయిన వారికి దగ్గరుండి మరీ వివాహం జరిపించేవాడట.

పెళ్లిళ్లపై నిషేధం..
ఆ కాలంలోనే రోమ్ నగరాన్ని పరిపాలిస్తున్న క్లాడియస్ అనే రాజు అప్పటికే పెళ్లిళ్లపై నిషేధం విధించారట. అతి క్రూరమైన ఆ రాజుకు పెళ్లిళ్లంటే ఏ మాత్రం ఇష్టం లేదు. తన ఎదుట పెళ్లి అనే పేరేత్తితే చాలు వారిని ఏ మాత్రం కనికరం లేకుండా కఠినమైన శిక్షలు వేసేవాడట. ఇదే సమయంలో ప్రేమ పెళ్లిళ్లను వాలెంటైన్స్ విపరీతంగా ప్రోత్సహిస్తున్నాడు.

వాలెంటైన్ పాఠాలు..
ఓ వైపు పెళ్లిళ్లు నిషేధం ఉన్నప్పటికీ.. తన రాజ్యంలో పెళ్లిళ్లు ఎలా పెరుగుతున్నాయని క్లాడియస్ అనే రాజు ఆరా తీశాడట. అసలు పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయని విచారిస్తే.. వాలెంటైన్ ప్రేమ పాఠాల గురించి తెలిసిందట. అప్పుడు తన రాజ్యంలో పెళ్లిళ్లకు, ప్రేమలకు వాలెంటైన్ కారణమని భావించి.. అతడిని కారాగారంలో బంధించాడు. రాజద్రోహం చేశాడన్న ఆరోపణలతో తనక ఉరి శిక్ష విధించాడు.

ఫిబ్రవరి 14న..
ఎందరో ప్రేమ పెళ్లిళ్ల కోసం కీలక పాత్ర పోషించిన వాలెంటైన్ కారాగారంలో ఉన్నప్పుడు జైలర్ కూతురితో ప్రేమలో పడిపోయాడట. అయితే వాలెంటైన్ ను పిబ్రవరి 14వ తేదీన ఉరి తీశారు. తను చనిపోయే ముందు కూడా తన ప్రియురాలి గురించే తలచుకుంటూ 'Your Valentine' అని తనకు ఓ లవ్ లెటర్ రాశాడు. అలా 'Your Valentine'ప్రేమకు నిర్వచనంగా మారిపోయింది.

ఆనాటి నుండి..
అలా పిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం( Valentine Day)గా జరుపుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే మన దేశంలో మాత్రం వాలెంటైన్స్ డేను 1990వ దశకంలో ప్రారంభమైంది. ఆర్థిక సరళీకరణ తర్వాత వాలెంటైన్స్ డే భారతదేశంలో బాగా పాపులర్ అయ్యింది. అయితే దీనిపై అనేక వివాదాలు కూడా ఉన్నాయి. ఈ ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకించేవారు కూడా చాలా మందే ఉన్నారు. వాస్తవం ఏంటంటే.. ప్రేమను తెలియజేయడానికి ప్రత్యేక సమయం.. ప్రత్యేక రోజంటూ ఏదీ లేదని గుర్తుంచుకోవాలి.
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం(వాలెంటైన్ డే) జరుపుకుంటారు. దీని కంటే ముందు ఏడు రోజుల ముందే వాలెంటైన్ వీక్ వేడుకలను కూడా జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications
