Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
అసలే చలికాలం.. సాయంకాలం వేళ చల్లని గాలిలో అందమైన అమ్మాయి కళ్లు ఆర్పకుండా తననే చూస్తుంటే..
ఆ తర్వాత రోజు కూడా ఆమెను ఫాలో అయ్యాడు. ఆ రోజు మాత్రం మరింత చొరవ తీసుకుని ఆమెను పలకరించబోయాడు. కానీ ఆరోజు కూడా తన వైపు కోపంగా చూసి ఆమె తిట్టుకుంటూ వెళ్లిపోయింది.
అసలే చలికాలం.. ఆపై అకస్మాత్తుగా అనారోగ్యం.. ఉదయం నుండి ఇంట్లోని తన గదిలోనే నిద్రపోయి విశ్రాంతి తీసుకున్న ఆ కుర్రాడు ఆరోజు సాయంత్రం కాస్త బయటి గాలి పీల్చుకుందామని బయటికి వచ్చాడు. అప్పుడు బయట ఏమో చల్ల గాలి వీస్తోంది. తనకు హాయిగా అనిపిస్తోంది. అంతే తను ఆ చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తూ అటూ ఇటూ చూస్తుంటే.. తన ఎదురింట్లో నుండి ఒక అందమైన అమ్మాయి వచ్చింది.

తలుపు దగ్గర నిలబడి తననే చూస్తోంది. ఆ అమ్మాయి కన్ను ఆర్పకుండా తననే చూస్తుండటంతో ఆశ్చర్యపోయాడు రవికుమార్. ఆమె అలాగే చూస్తు ఉంటే చూసి చూడనట్టు నటించాడు ఆ కుర్రాడు. ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి తనని అలాగే చూస్తుండటంతో తనలో ఏదో తెలియని ఉత్సాహం వచ్చింది. తన తనువంతా పులకరించినట్టయ్యింది. అయితే అంతలోపే ఆ అమ్మాయి లోపలికి వెళ్లిపోయింది...

మరుసటి రోజు ఉదయాన్నే..
ఆ తర్వాత రోజు ఉదయాన్నే ఆ ఎదురింటి వైపు చూస్తూ అటూ ఇటూ తిరిగాడు. ఆ సాయంత్రం వారి ఇంటి తలుపు దగ్గర నుండి చూసిన అందమైన అమ్మాయి బయటికి వచ్చింది. తనని చూస్తే బాగా మేకప్ వేసుకుని ఎక్కడికో వెళ్లడానికి సిద్ధం అయినట్టు గ్రహించాడు.

తన గదికి తాళం..
ఇక ఆరోజు కూడా తన కాలేజీకి బంక్ కొట్టి తన గదికి హడావుడిగా తాళం వేసి ఆ అమ్మాయిని ఫాలో అయ్యాడు. ఆమెకు తెలియకుండా అక్కడే వెనుకవైపు ఉన్న రోడ్డు నుండి వెళ్లి ఆమెకు ఎదురుగా వెళ్లాడు. ఇద్దరు దగ్గరపడ్డారు.

చిరునవ్వుతో ప్రయత్నించగా..
అంతలోనే ఆమెను చూస్తు చిన్న చిరునవ్వు నవ్వి పరిచయం చేసుకుందామనే ప్రయత్నం చేశాడు. అయితే ఆ అందమైన అమ్మాయి మాత్రం చిరాకుగా తన ఫేసును తిప్పుకుంటూ.. తనని తిట్టుకుంటూ వెళ్లిపోయింది.

ఆ రోజు సాయంత్రం..
అదే రోజు సాయంత్రం నేను మళ్లీ డాబా మీదకు వెళ్లాను. తన ఇంటి వైపే చూస్తున్నాను. నిన్న నన్ను అదే పనిగా చూసిన ఆ అమ్మాయి ఉదయం మాత్రం ఎందుకు అలా ఫేసు తిప్పుకోపోయిందా అని ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు.

కాసేపటికే మళ్లీ..
అయితే ఆరోజు సాయంత్రం కూడా తను తలుపు దగ్గరికి వచ్చింది. మళ్లీ తన వైపే చూస్తోంది. తనకు మళ్లీ అనుమానం వచ్చింది. నన్నేనా చూస్తోంది లేక ఇంకా ఎవరినైనా చూస్తుందా అని అటు ఇటు చూశాడు. అయితే ఆ చుట్టు పక్కల ఎవ్వరు లేరని నిర్ధారించుకున్నాడు.తననే చూస్తుందని డిసైడ్ అయ్యాడు. మళ్లీ తను కూడా ఆ అమ్మాయి వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు.

మరుసటి రోజు..
ఆ తర్వాత రోజు కూడా ఆమెను ఫాలో అయ్యాడు. ఆ రోజు మాత్రం మరింత చొరవ తీసుకుని ఆమెను పలకరించబోయాడు. కానీ ఆరోజు కూడా తన వైపు కోపంగా చూసి ఆమె తిట్టుకుంటూ వెళ్లిపోయింది. దీంతో అతనికి ఎక్కడ లేని భయం వేసింది. పైగా ఆ అమ్మాయి ప్రవర్తన ఏ మాత్రం అర్థం కావటం లేదని మదనపడిపోయాడు.

మళ్లీ సేమ్ సీన్ రిపీటయ్యేసరికి..
ఆరోజు సాయంత్రం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యేసరికి ఆ అమ్మాయి బయటికి వచ్చింది. మళ్లీ తనను అలాగే చూస్తు నిల్చుంది. అయితే అతనికి ఒక అనుమానం వచ్చింది. ఈ అమ్మాయి తనను ఆట పట్టించడానికి ఇలా ప్రవర్తిస్తుంది అనుకున్నాడు.

మరుసటి రోజు నిలదీత..
తర్వాత రోజు తను కాలేజీ నుండి వచ్చే దారిలో ఆ అమ్మాయిని అడ్డుకున్నాడు. ఆ అమ్మాయికి కోపం వచ్చింది. ‘‘ఏంటి మిస్టర్ రెండురోజుల నుండి చూస్తున్నాను. ఏమనుకుంటున్నావు నా గురించి.. ఎలా కనిపిస్తున్నాను నేను... ఏంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావు‘‘ అని కోపంగా అడిగింది.

దిమ్మ తిరిగిపోయింది..
అంతే ఆ కుర్రాడికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. అంతే వెంటనే ఒక్కసారిగా తేరుకొని ‘‘నేను కూడా అదే అడుగుతున్నాను. సాయంత్రం చీకటి పడితే చాలు అదే పనిగా నన్ను కన్ను ఆర్పకుండా చూస్తున్నారు. అది మీరే కదా‘‘ అని అడుగుతాడు.

అది నేనే..
అందుకు ఆ అమ్మాయి ఇలా సమాధానమిస్తుంది. ‘‘అది నేనే. మా ఇంటి తలుపు దగ్గర నిలబడి చూస్తున్న మాట వాస్తవమే. కానీ నేను నిన్ను చూడలేదు. నిన్నే కాదు నేను కాస్త చీకటి పడితే చాలు దేన్నీ చూడలేను. నాకు రేచీకటి. చీకటి వేళ నాకు ఏది కనిపించదు‘‘ అని చెప్పి నా వెంట ఇంకెప్పుడూ పడకండి అని కోపంగా వెళ్లిపోతుంది.

ఆవాక్కైన కుర్రాడు..
ఆ మాటలు విన్న ఆ కుర్రాడు అంతే షాక్ తిన్న కాకిలా అక్కడే ఉండిపోయాడు. అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని తనను తాను తిట్టుకుంటూ.. తర్వాతి రోజు నుండి తను యధావిధిగా కాలేజీకి వెళ్లి.. పార్ట్ టైమ్ జాబులో కంటిన్యూ అయిపోయాడు.
గమనిక : ఇది కేవలం కల్పిత కథ మాత్రమే. ఈ స్టోరీ మీకు నచ్చితే మీ స్నేహితులకు, కుటుంబసభ్యులకు, బంధువులకు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications











