Latest Updates
-
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే! -
పెళ్లిళ్ల సీజన్ రద్దీ.. మీ వేడుకను పాడుచేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి! -
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి! -
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్! -
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది!
పిల్లలు పుట్టాక దంపతుల మధ్య గొడవలకు కారణం ఇదే..ఇలా చేస్తే లవర్స్ లా కరుసుకొని ఉంటారు!
పెళ్లి..ఇద్దరు మనసులు ఒకటయ్యే మధుర ఘట్టం. కొత్త బంధంలో అడుగుపెట్టిన ఆ జంట ఒకరినొకరు తెలుసుకోవడానికి ఆరాటపడతారు. ఈ సమయంలో వారి మధ్య అనురాగం వెల్లివిరుస్తుంది. ఒకరిపై ఒకరికి ప్రేమ, అభిమానం పెరుగుతాయి. అయితే వీరికి బిడ్డ పుట్టాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. అన్యోన్యంగా ఉన్న ఆ జంట మధ్య దూరం పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే కలహాలు రావడం, ఒకరిపై ఒకరికి చిరాకు కలగడం వంటివి జరుగుతాయి. ఇది వారి బంధాన్ని బలహీనపరుస్తుంది. కానీ కొన్ని విషయాలపై దృష్టిసారిస్తే ఈ పరిస్థితిని నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.
సాన్నిహిత్యం తగ్గితే ప్రమాదమే
పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది జంటల మధ్య శారీరక సాన్నిహిత్యం తగ్గిపోతుంది. భర్త దగ్గరవ్వాలని ప్రయత్నించినా భార్య అందుకు సుముఖంగా ఉండకపోవచ్చు. ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు, బిడ్డను తాకినప్పుడు లేదా తల్లిపాలు ఇచ్చినప్పుడు ఆమె శరీరంలో ప్రేమను పంచే ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల అవుతుంది. దీని ప్రభావంతో కొత్త తల్లి తన ప్రేమంతా బిడ్డపైనే కురిపిస్తుంది. తెలియకుండానే తన భర్తను నిర్లక్ష్యం చేయడం మొదలుపెడుతుంది. సాన్నిహిత్యం లేకపోవడం వల్ల వారి మధ్య అగాధం ఏర్పడుతుంది..ఇది వారి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి బిడ్డ పుట్టిన తర్వాత కూడా భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లేదా కేవలం చేతులు పట్టుకోవడం వంటి చిన్న చిన్న స్పర్శల ద్వారా ప్రేమను పంచుకుంటూ ఉండాలి. ఇది వారి మధ్య అనుబంధాన్ని పదిలంగా ఉంచుతుంది.

బాధ్యత ఇద్దరిదీ
బిడ్డ పుట్టాక, ఆ బిడ్డ ఆలనాపాలనా చూడటం కేవలం తల్లి బాధ్యత మాత్రమే అని భావిస్తారు. కానీ నిజానికి బిడ్డను పెంచడం తల్లిదండ్రులిద్దరి ఉమ్మడి బాధ్యత. ఒక స్త్రీ తన జీవితాన్ని పూర్తిగా బిడ్డ చుట్టూనే కేంద్రీకరించినప్పుడు ఆమె తరచుగా ఒంటరిగా, నిస్సహాయంగా భావిస్తుంది. తన భర్త తనకు ఏమాత్రం సహకరించడం లేదని మనసులో బాధపడుతుంది. ఇది వారి బంధంలో చీలిక తెస్తుంది. కాబట్టి భార్య తన బిడ్డను ఎలా చూసుకుంటుందో భర్త కూడా తన వంతు బాధ్యతగా కొన్ని పనులు చేయాలి. బిడ్డకు సంబంధించిన పనుల్లో భార్యకు సహాయం చేయాలి. అలాగే భర్త తన భార్యను కూడా ప్రేమగా చూసుకోవాలి.
నిద్ర లేకపోతే చిరాకు
చాలామంది కొత్త దంపతులు బిడ్డ పుట్టిన తర్వాత తరచుగా చిరాకు పడుతుంటారు. దీనికి ప్రధాన కారణం నిద్రలేమి. రాత్రంతా బిడ్డ మేల్కొని ఉంటే తల్లిదండ్రులు కూడా మేల్కొని ఉండక తప్పదు. తగినంత నిద్ర లేకపోతే తలనొప్పి, చిరాకు వంటి సమస్యలు మొదలవుతాయి. ఇది వారి మధ్య సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి జంటలు తమ బాధ్యతలను పంచుకోవాలి. తగినంత నిద్ర ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, దాంతో జంటల మధ్య ఎటువంటి ఉద్రిక్తతలు ఉండవు.
సమయం కేటాయించకపోతే ఎలా?
బిడ్డ పుట్టారంటే మీ పర్శనల్ లైఫ్ ముగిసిపోయినట్లు కాదు. బిడ్డ వచ్చిన తర్వాత కూడా మీరు ఒకరితో ఒకరు సమయం గడపవచ్చు. అలాగే, కొన్నిసార్లు వైద్యుల సలహా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లవాడు నిద్రపోతున్న సమయంలో ఇద్దరూ కలిసి ఒక కప్పు టీ తాగండి, ఒక మంచి సినిమా చూడండి, కలిసి భోజనం చేయండి. సాధ్యమైతే బిడ్డకు అవసరమైన మందులన్నీ మీ దగ్గర ఉంచుకుని ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేయండి. ఇలా ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం వల్ల జంటలు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటారు..వారి బంధం మరింత బలపడుతుంది.



Click it and Unblock the Notifications











