Latest Updates
-
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనక నుంచి పిలిస్తే అపశకునమా? -
నీరసాన్ని తరిమికొట్టే పవర్ స్నాక్..పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
మేక పాలలోని ఈ రహస్యం మీకు తెలుసా? ఆ సమస్యకు ఇదే బెస్ట్! -
బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ప్రోటీన్,ఐరన్ పుష్కలంగా ఉండే ఈ దోసె బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్! -
కర్కాటకంలో గురు సంచారం.. అక్టోబర్ వరకు స్టడీస్, కెరీర్లో ఈ రాశుల వారికి ఎనలేని భాగ్యం.! -
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.? -
మహిళల్లో పీరియడ్స్, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి
ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుందా? ఈ ఐదు సిగ్నల్స్ ఇస్తే ఆమె పడిపోయినట్లే!
ప్రేమలో ఉన్నప్పుడు లేదా ఒక అమ్మాయిని గాఢంగా ఇష్టపడుతున్నప్పుడు అబ్బాయిల మదిలో మెదిలే మొదటి ప్రశ్న..ఆమెకు కూడా నాపై ఇష్టం ఉందా? లేదా నన్ను కేవలం సాధారణ స్నేహితుడిగానే చూస్తోందా? ఈ గందరగోళం వల్ల చాలామంది అబ్బాయిలు తమ మనసులోని మాటను చెప్పలేక, అవకాశం కోల్పోతామేమో అన్న భయంతో సతమతమవుతుంటారు.
ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపుతూ, ప్రముఖ డేటింగ్ కోచ్ బ్లెయిన్ ఆండర్సన్..తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో..ఒక అమ్మాయికి మీరు నిజంగా నచ్చితే, ఆమె ప్రవర్తనలో వెంటనే కనిపించే 5 తక్షణ సంకేతాలను ఆమె వివరించారు. మీరు ఇష్టపడే అమ్మాయి మనసులో ఏముందో కనిపెట్టే ఆ ఐదు అద్భుతమైన సీక్రెట్స్ ఏంటో ఇక్కడ చూడండి.

మీరు మెసేజ్ చేయగానే రిప్లై
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. మీరు ఆమెకు టెక్స్ట్ మెసేజ్ చేసినప్పుడు, ఆమె దానికి స్పందించే తీరును బట్టి ఆమె మనసును ఇట్టే పసిగట్టవచ్చు. ఆమెకు మీపై నిజంగా ఆసక్తి ఉంటే, మీరు మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇస్తుంది. కావాలని గంటల కొద్దీ మిమ్మల్ని ఎదురుచూసేలా చేయడం, లేదా కేవలం హ్మ్, ఓకే లాంటి చిన్న పదాలతో చాటింగ్ ముగించడం చేయదు. మీతో మాట్లాడటానికి ఎంతో ఉత్సాహం చూపుతుంది.
హగ్ చేసుకున్నప్పుడు, మరింత గట్టిగా హత్తుకుంటుంది
ఒక చిన్న స్పర్శ వంద మాటలతో సమానం. స్నేహితుల మధ్య ఇచ్చే హగ్ (కౌగిలింత) ఒక ఫార్మాలిటీలా, చాలా సాధారణంగా ఉంటుంది. కానీ, మీరు ఆమెను దగ్గరకు తీసుకున్నప్పుడు, ఆమె మిమ్మల్ని మరింత గట్టిగా, ఆత్మీయంగా హత్తుకుంటే..అందులో ప్రేమ దాగి ఉందని అర్థం. మీ చేతుల్లో ఆమె ఎంతో భద్రతను, ప్రశాంతతను ఫీల్ అవుతోందనడానికి ఆ కౌగిలింతే అతిపెద్ద నిదర్శనం.
మీరు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వింటుంది
మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు పట్టించుకోకపోతే బాధగా ఉంటుంది. కానీ మీరు ఇష్టపడే అమ్మాయి మీ మాటలను చాలా శ్రద్ధగా వింటోందంటే, ఆమె దృష్టిలో మీరు చాలా స్పెషల్ అని అర్థం. పక్కకు చూసుకుంటూనో, ఫోన్ వాడుకుంటూనో కాకుండా.. మీ కళ్లలోకి నేరుగా చూస్తూ, మీరు చెప్పే ప్రతి చిన్న విషయాన్ని ఆమె మనసుపెట్టి వింటుంది.
మీరు జోక్ వేసినప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతుంది
ప్రతి అబ్బాయీ గొప్ప కమెడియన్ కాదు. ఒక్కోసారి మీరు వేసే జోక్స్ అంతగా నవ్వించేలా ఉండకపోవచ్చు. కానీ ఆమెకు మీరంటే ఇష్టం ఉంటే, మీ సిల్లీ జోకులకు కూడా పగలబడి నవ్వుతుంది. ఇక్కడ ఆమె ఆనందిస్తున్నది మీ జోక్ ని కాదు, మీతో గడుపుతున్న సమయాన్ని. మీ ముఖంలో సంతోషం చూడటం కోసం ఆమె కూడా చిరునవ్వులు చిందిస్తుంది.
బయటకు వెళ్దామని అడిగితే వెంటనే యస్ చెబుతుంది
ఇది అన్నిటికంటే ముఖ్యమైన, ఫైనల్ టెస్ట్. మీరు కాఫీకో, సినిమాకో బయటకు వెళ్దామని అడిగినప్పుడు, ఆమె ఎలాంటి సాకులు చెప్పదు. నాకు టైం లేదు, బిజీగా ఉన్నాను లాంటి మాటలు దాటవేతలు ఆమె నుండి రావు. ఆనందంతో వెంటనే యస్ అని చెబుతుంది. ఒకవేళ ఆ సమయంలో నిజంగా బిజీగా ఉన్నా, మరొక రోజు వెళ్దామా? అని ప్రత్యామ్నాయం సూచిస్తుంది.



Click it and Unblock the Notifications