Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
Kissing Device: దూరంగా ఉన్న మీ గర్ల్‌ఫ్రెండ్‌కు ఇలా ముద్దు పెట్టొచ్చు, అదిరిపోయిన ఆలోచన
జీవిత భాగస్వామికి, గర్ల్ ఫ్రెండ్‌కు, బాయ్ ఫ్రెండ్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఆ సమయంలో వారితో గడిపిన క్షణాలు, వారితో గడిపిన అనుభూతి లాంటివి గుర్తొస్తుంటాయి. వారిని తాకాలని, కౌగిలించుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది.
అలాంటి విరహతాపంతో బాధపడే వారి కోసమే చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ డివైజ్ ను కనిపెట్టింది. గర్ల్ ఫ్రెండ్ లేదా భార్యాభర్తలు వేరే ప్రాంతంలో ఉండేవారు కేవలం ఫోన్‌లోనే మాటలు, కబురు చెప్పుకుంటారు. వారు శారీరక స్పర్శకు దూరం కావడంతో విరహతాపంతో ఇబ్బందిపడతారు. ముఖ్యంగా కరోనా కాలంలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొన్నారు.

(Image: Twitter)
లాక్ డౌన్‌లో చిక్కుకున్న వాళ్లు తమ ప్రియమైన వారికి దూరమై సతమతమయ్యారు. అలాంటి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వారి కోసం ఓ చైనీస్ స్టార్టప్ ఈ కిస్సింగ్ డివైజ్ ను తయారు చేసింది.
అలా వచ్చింది ఆలోచన:
బీజింగ్ ఫిల్మ్ అకాడమీలో చదివే ఓ విద్యార్థి కరోనా లాక్‌డౌన్ సమయంలో తన గర్ల్ ఫ్రెండ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఫోన్లు మాటలు, వీడియో కాల్స్ తప్ప శారీరక స్పర్శ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. తన గ్రాడ్యుయేషన్ పూర్తవగానే సివైఫుషే(Siweifushe) ని స్థాపించాడు. MUA అనే పేరుతో తన మొదటి కిస్సింగ్ డివైజ్ ను జనవరి 22న విడుదల చేశాడు.
2 వారాల్లో 3వేల డివైజ్‌ల విక్రయం:
ఈ కిస్సింగ్ డివైజ్ మార్కెట్‌లోకి వచ్చిన మొదటి రెండు వారాల్లోనే ఏకంగా 3 వేల కిస్సింగ్ డివైజ్ లు అమ్ముడయ్యాయి. అలాగే 20 వేల ఆర్డర్లు వచ్చాయి.
కిస్సింగ్ డివైజ్ ఎలా పని చేస్తుందంటే:
ఈ డిజిటల్ డివైజ్ ను పెదాల రూపంలో ఉండేలా సిలికాన్ లిప్స్ తయారు చేశారు. వీటికి ప్రెజర్ సెన్సార్లు అమర్చారు. హీట్ కలిగించే విధంగా సాంకేతికత అభివృద్ధి చేశారు.
ఒక స్టాండ్ లాంటి దానికి కింద రెండు సిలికాన్ లిప్స్ ఉంటాయి. ఈ డివైజ్ ను స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి లిప్స్ పై కిస్ పెట్టాలి.
ఈ లిప్స్ లోని సెన్సార్లు ముద్దు యొక్క తీరును, ముద్దులోని వేడిని సంగ్రహిస్తుంది. సౌండ్‌కు సంబంధించిన డేటాను అవతలి వ్యక్తి యాప్ కు పంపిస్తుంది. ఆ సిలికాన్ లిప్స్ అచ్చంగా అదే తీరుతో పెదాలను కదిలిస్తాయి. అలా ప్రియమైన వ్యక్తిని ముద్దు పెట్టుకున్న అనుభూతిని పొందవచ్చు.
కిస్సింగ్ డివైజ్‌పై మిశ్రమ స్పందన:
అయితే ఈ డివైజ్ పై రకరకాల స్పందనలు వస్తున్నాయి. కొందరు ఈ డివైజ్ తో దూరంగా ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్‌ను ముద్దు పెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఈ కిస్సింగ్ డివైజ్ చాలా ఆర్ఠిపిషియల్ గా ఉందని, ముద్దు పెట్టుకున్న ఫీల్ ను ఇవ్వలేకపోతోందని అంటున్నారు.
ఈ కిస్సింగ్ డివైజ్‌ను శృంగార సాధనంగా వాడే అవకాశాలు ఉన్నాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కిస్సింగ్ డివైజ్ ను తయారు చేసిన కంపెనీ మాత్రం తమ మెషీన్ పూర్తిగా నిబంధనలకు లోబడే ఉందని, ఒకసారి డివైజ్ కొన్న తర్వాత దానిని ఎలా ఉపయోగిస్తారనేది ఎవరి చేతుల్లోనూ లేని అంశమని పేర్కొంది.



Click it and Unblock the Notifications
