Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Relationship Tips: నిద్రలో ఈ కలలు తరచూ వస్తున్నాయా? మీ సంబంధంలో సమస్యలు ఉన్నాయేమో!
ప్రతి ఒక్కరికి నిద్రలో కలలు వస్తుంటాయి. అయితే వాటిని చాలా మంది గుర్తుంచుకోలేరు. నిద్రలో వచ్చిన చాలా కలలను నిద్ర నుండి మేల్కోగానే మర్చిపోతుంటారు. అలాగే వాటి గురించి కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే కొన్ని రకాల కలలు పదే పదే వస్తుంటే మాత్రం వాటిని గమనించి జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.

నిద్రపోతున్నప్పుడు వచ్చే కొన్ని కలలు సంబంధంలోని సమస్యల గురించి చెబుతాయని అంటున్నారు. ముఖ్యంగా మీ హ్యాపీ లైఫ్ లో ఏదో మిస్ అవుతుందనడానికి ఇది ముఖ్య సంకేతం అని తెలుస్తోంది. ఎలాంటి కలలు వస్తే మీ జీవితంలో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారనే దాని గురించి నిపుణులు ప్రత్యేకంగా వివరించారు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఎవరో మోసం చేస్తున్నట్లు..!
తరచుగా మిమ్మల్ని ఎవరో మోసం చేస్తున్నట్లుగా కలలు వస్తుంటే.. మిమ్మల్ని ఎవరో వదిలేస్తారనే భావనతో మీరు బతుకుతున్నట్లు అర్థం. అలాగే తరచుగా మీరు ఆందోళన, అపరాధ, అభద్రతా భావాలతో మానసికను వేధనను అనుభవిస్తుంటారు. కాబట్టి తరచుగా మీకు ఇలాంటి కలలు వస్తుంటే మిమ్మల్ని ఎవరో వదిలేస్తారనే భావనతో ఉన్నారని గుర్తించి సమస్యను పరిష్కరించుకోండి.
2. ఎక్స్ కలలో వస్తుంటే..!
మీరు తరచుగా మీ మాజీ గురించి కలలు కంటుంటే.. మీరు ఇప్పటికీ ఆ బంధానికి సంబంధించిన విషయాలను మర్చిపోలేదని అర్థం. మళ్లీ మీ జీవితంలో అలాగే జరుగుతుందని మీరు పదే పదే ఆందోళన చెందుతున్నారని అర్థం. సాధారణంగా మనకు వచ్చే కలలు గతంలో జరిగిన సంఘటనలకు సంబంధం ఉంటాయి కాబట్టి... ప్రస్తుతాన్ని, గతంతో పోలుస్తుంటాం. ఇలా కలలు వస్తుంటే మీ మాజీకి మీరు ఫోన్ లు, మెసేజ్ లు, కలవడం వంటివి చేయమని అర్థం కాదు. ఈ సమస్యను వీలయినంత త్వరగా పరిష్కరించుకోవాలి.
3. భాగస్వామితో కలసి కార్లో వెళ్తున్నట్లు కలల వస్తుంటే..!
మీరు మీ భాగస్వామి కలిసి కారులో ఉన్నట్లు కలలు వస్తుంటే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆయన నడిపే విధానాన్ని చూస్తూ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. ఏదైనా ప్రమాదం జరిగిందంటే.. మీ బంధం కూడా ప్రమాదంలో పడినట్లే అర్థం. అలాగే మీ కారు స్టార్ట్ కాకపోతే లేదా నిలిచిపోయినట్లయితే.. మీ సంబంధం కూడా నిలిచిపోవచ్చు.
4. ఇరువురికి ప్రత్యేకమైన వస్తువులు దొంగలించినట్లు కలలు వస్తే..!
భార్యాభర్తలు లేదా లవర్స్ కు ఇద్దరికీ విలువైన వస్తువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవచ్చు. వాటిని ఇద్దరూ చాలా ప్రత్యేకంగా చూస్తుంటారు. అలాంటి వస్తువులు పోయినట్లు, దొంగలించబడినట్లు కలలు వస్తే మీరు మీ సంబంధం గురించి పడుతున్న ఆందోళనను తెలియజెబుతుంది.
5. పిల్లులు కలలో కనిపిస్తుంటే..!
కలల్లో పిల్లులు లైంగిక శక్తిని సూచిస్తాయి. మీ కలలో కనిపించిన పిల్లి అనారోగ్యంతో, గాయపడి, చనిపోయి లేదా చనిపోతున్నట్లు కనిపిస్తే.. మీ సంబంధంలో లైంగిక శక్తి చనిపోయిందని సంకేతం. అదే పిల్లి దాడి చేసినట్లు, భయపెడుతున్నట్లు కనిపిస్తే లైంగికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎదుర్కోబోతున్నారని అర్థం. అలాగే లైంగిక విషయంలో మీరు మీ భాగస్వామిపై కోపంగా ఉన్నట్లు కూడా సంకేతం.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications