Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దంపతుల మధ్య కమ్యూనికేషన్ లేకపోతే కష్టమే, మాట్లాడితేనే బంధం బలోపేతమవుతుంది
దాంపత్య బంధంలో కమ్యూనికేషన్ ఎంత ముఖ్యం, అసలు కమ్యూనికేషన్ లోపం ఎందుకు వస్తోంది, దానిని అధిగమించాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సంబంధంలో సమస్యలు వస్తాయి. గొడవలు జరగకపోతే అది అసలు దాంపత్యమే అనిపించుకోదు. వేర్వేరు మనస్తత్వం కలిగిన వ్యక్తులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటై జీవితాంతం కలిసి ఉండాలనుకున్నప్పుడు సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి. అపార్థాలు, అభిప్రాయభేదాలు, ఆలోచనల్లో వైరుధ్యాలు, ఆరోగ్య సమస్యలు ఇలా చాలా అంశాల్లో సమస్యలు వస్తాయి. ఈ సమస్యల వల్ల దంపతుల మధ్య కొంత దూరం పెరుగుతుంది. అయితే ఆ దూరాన్ని చెరిపేసే దివ్యౌషధమే మాట. ఇద్దరు దంతులు మనసులో ఏముందో ఎదుటి వారికి అర్థమయ్యేలా కమ్యూనికేట్ చేయగలిగితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. కానీ సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో చాలా మంది దంపతులు ఒకరినొకరు అపార్థం చేసుకుని విడిపోతున్నారు.

దాంపత్య బంధంలో కమ్యూనికేషన్ ఎంత ముఖ్యం, అసలు కమ్యూనికేషన్ లోపం ఎందుకు వస్తోంది, దానిని అధిగమించాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దాంపత్య బంధంలో కమ్యూనికేషన్ ప్రాముఖ్యత ఏంటి:
ఏ సంబంధంలో అయినా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ అంటే కేవలం మాటల ద్వారా మాత్రమే జరిగేది కాదు. సైగలు, ముఖకవలికలు, బాడీ లాంగ్వేజీ ఇలా చాలా రకాలుగా మన ఫీలింగ్స్ ఎదుటివారికి కమ్యూనికేట్ చేయవచ్చు. దాంపత్య బంధంలో ఇద్దరు భాగస్వాముల మధ్య ఏదో ఒక రకంగా కమ్యూనికేషన్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటుందనే దానిపై దంపతుల మధ్య సాన్నిహిత్యం వెల్లడవుతుంది.
సరిగ్గా కమ్యూనికేట్ చేయడం నేర్చుకోని జంటలు సాన్నిహిత్యం, సంఘర్షణ, బంధుత్వ పెరుగుదల విషయంలో సమస్యలను ఎదుర్కొంటారు. మీ భాగస్వామి యొక్క అంతర్గత ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, వారు మీ గురించి అర్థం చేసుకోవడం నిజమైన కనెక్షన్‌కి కీలకం. మీరు మీ సంబంధాన్ని అభివృద్ధి చేసే విధంగా కమ్యూనికేట్ చేయడానికి కష్టపడితే, కాలక్రమేణా మీరు విడిపోతున్నారని అర్థం.

దాంపత్య బంధంలో కమ్యూనికేషన్ లేకపోతే వచ్చే సమస్యలు:
* గొడవలు జరుగుతాయి
* భాగస్వామి యొక్క ప్రతికూల దృక్పథం
* ఒకరికొకరు కనెక్ట్ కావడానికి చేసే ప్రయత్నాలు విఫలం అవడం
* ఏదో తెలియని అనుభూతి
* ఒంటరితనం
* సాన్నిహిత్యం లేకపోవడం
* లక్ష్యాలను చేరుకోవడం కష్టంగా మారడం

దాంపత్య బంధంలో చెడు కమ్యూనికేషన్‌కు సంకేతాలు:
* ఒకరినొకరు విమర్శించుకోవడం
* ఒకరినొకరు తక్కువ చేసుకోవడం
* అగ్రెసివ్‌గా ప్రవర్తించడం
* పరిష్కారం కాని వాదనలు
* రాజీ పడకపోవడం
* సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించకపోవడం
* ఎదుటివారిని అపార్థం చేసుకోవడం

దాంపత్య బంధంలో మంచి కమ్యూనికేషన్ కోసం చిట్కాలు:
* ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినాలి. మనం మాట్లాడేది ఎదుటివారు వినాలని మనం ఎలా కోరుకుంటామో, వారు కూడా అలాగే కోరుకుంటారు. కాబట్టి వారు చెప్పేది పూర్తిగా వినాలి.
* దంపతుల మధ్య మాటల దూరం పెరగడానికి నమ్మకం కోల్పోవడం మొదటి కారణం. కాబట్టి మొదట నమ్మకాన్ని తిరిగి పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. మంచి కమ్యూనికేషన్ వల్లే నమ్మకం పెరుగుతుంది. కాబట్టి మనసు విప్పి మాట్లాడటానికి ప్రయత్నించాలి.
* ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గ్యాడ్జెట్‌లు పక్కన పెట్టి కాసేపు భాగస్వామితో సమయం గడపాలి.
* లైఫ్ పార్ట్‌నర్‌కు ఏం నచ్చుతాయనేది కొన్నైనా తెలిసి ఉంటుంది. వారికి నచ్చే పనులు చేయండి. ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి, వారికి నచ్చే ఫుడ్ తయారు చేయండి లేదా ఆర్డర్ చేయండి.
* రొమాంటిక్‌గా ఉండేందుకు ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications