Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ప్రియుడితో పత్తాపారం..భర్తకు 'టీ' లో ఎలకల మందు కలిపి ఇచ్చింది..బిగ్ ట్విస్ట్ ఏంటంటే..
అక్రమ సంబంధాలు పెట్టుకొని హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చాలామంది మహిళలు కూడా ఈ మధ్యకాలంలో దారుణంగా హత్యలకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారన్న కారణంతో కట్టుకున్నే భర్తనే కాకుండా కన్న పిల్లలను కూడా హత్య చేయడానికి క్షణం ఆలోచించట్లేదు. కామంతో రగిలిపోతూ తన మన చూడకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఓ మహిళ తన వివాహేతర సంబంధానికి అడొస్తున్నాడన్న కారణంతో తన భర్తకు టీలో ఎలకల మందు కలిపి ఇచ్చింది. అది తాగి చనిపోయిన భర్త శవాన్ని ఫ్యాన్ కి ఉరితీసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రేఖా(25),ఖేహర్ సింగ్ భార్యాభర్తలు. రేఖాకి పింటు అనే యువకుడితో ఎఫైర్ ఉంది. భర్తతో సంసారం చేస్తూనే..ప్రియుడితో చాటుమాటు వ్యవహారం నడిపేది. అయితే తన వివిహేతర సంబంధానికి ఎక్కడ అడ్డుపడతాడో అని భర్తను ఎలాగోలా వదిలించుకోవాలనుకుంది. దానికోసం ఓ మాస్టర్ స్కెచ్ వేసింది. భర్తను చంపి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాలని పథకం వేసింది. తన పథకంలో భాగంగా గత ఆదివారం భర్తకు టీలో చక్కెర బదులు ఎలకల మందు కలిపి ఇచ్చింది. భార్య ప్రేమతో ఇచ్చిన టీ తాగిన ఆ అమాయకపు భర్త కళ్ల ముందే గిలగిలా కొట్టుకుంటూ అపస్మాకర స్థితిలోకి పోతుంటే రేఖ హమ్మయ్యా ఇక ప్రియుడితో కులకచ్చు అని భావించినట్లు ఉంది..అందుకే ఏ మాత్రం భయం లేకుండా తన పథకంలో భాగంగా దానిని సూసైడ్ గా చిత్రీకరించే ప్రయత్నం స్టార్ట్ చేసింది.
వెంటనే తన లవర్ పింటూకి ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. పింటూ, రేఖ ఇద్దరూ కలిసి ఖేహర్ సింగ్ మెడకి తాడు కట్టి ఆయన బాడీని ఫ్యాన్ కి వేలాడదీసి, ఇంటి లోపల డోర్ లాక్ చేసి హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అసలు నిజం బయటకు వచ్చింది. ఎలకలమందు కలిపిన టీ తాగి భర్త అపస్మాకర స్థితిలోకి పోయిన తర్వాత రేఖ తన ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిమేసి అదే తాడుతో సీలింగ్ కి వేలాడదీశారని పోలీసులు నమోదుచేసిన ఎఫైఆర్ లో ఉంది.
ఖేహర్ సింగ్ సోదరుడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫతేగంజ్ పాచ్మి పోలీస్ స్టేషన్ లో రేఖా,పింటుపై మర్డర్ కేసు నమోదైంది. రేఖ,పింటూ అక్రమసంబంధం గురించి తన సోదరుడికి తెలిసిపోయిందని..అందుకే తన సోదరుడిని చంపేశారని అశోక్ తన కంప్లెయింట్ లో తెలిపారు. పోలీసులు రేఖా,పింటుని అరెస్ట్ చేశారు.



Click it and Unblock the Notifications