Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్!
Father's Day Special: నాన్నతో అనుబంధం.. గతానికి, వర్తమానానికి మధ్య దూరం ఎంత?..దివ్య రెడ్డి మాటల్లో..
ఫాదర్స్ డే.. కుటుంబానికి ఆధారంగా నిలిచే తండ్రుల అంకితభావం, త్యాగం, నిస్వార్థ ప్రేమను గుర్తించి, వారికి కృతజ్ఞతలు తెలియజేసే ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున పిల్లలు తమ తండ్రులకు బహుమతులు, కార్డులు ఇవ్వడం లేదా వారితో నాణ్యమైన సమయం గడపడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఇది తండ్రులు తమ పిల్లలతో మరింత లోతైన బంధాన్ని ఏర్పరచుకోవడానికి కూడా ఒక గొప్ప సందర్భం. ఫాదర్స్ డే చరిత్ర 20వ శతాబ్దం ప్రారంభంలో అమెరికాలో మొదలైంది. సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ తన తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ జ్ఞాపకార్థం ఈ రోజును ప్రారంభించింది.
సోనోరా తల్లి చిన్నప్పుడే మరణించగా ఆమె తండ్రి ఆరుగురు పిల్లలను ఒంటరిగా, ఎంతో కష్టపడి పెంచారు. తన తండ్రి పడిన కష్టం, చూపిన ప్రేమకు గుర్తింపుగా, తల్లికి మదర్స్ డే ఉన్నట్లే తండ్రులకు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని సోనోరా భావించింది. ఆమె కృషి ఫలితంగా 1910లో జూన్ 19న వాషింగ్టన్ లోని స్పోకేన్ లో మొదటిసారిగా ఫాదర్స్ డే జరుపుకున్నారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల పోరాటం, గుర్తింపు ప్రక్రియల అనంతరం, 1972లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ జూన్ మూడవ ఆదివారాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగా హైదరాబాద్ లో నివసించే దివ్య రెడ్డి అనే మహిళ తన తండ్రితో తన అనుభవాన్ని సహా ఇప్పటి జనరేషన్ లో తండ్రికి పిల్లల మధ్య ఉండే సంబంధం ఎలా ఉంది వంటి అనేక విషయాలను బోల్డ్ స్కై తెలుగుతో పంచుకున్నారు.

ఈ రోజుల్లో తండ్రులు తమ పిల్లలతో స్నేహితులుగా మారడానికి ప్రధాన కారణం ఏమిటని మీరు భావిస్తున్నారు?
పూర్వకాలం మాదిరి ఇప్పుడు పిల్లలు ఉండట్లేదు. ఏ విషయాన్నైనా ఫ్రెండ్స్ కు తమ వ్యక్తిగత విషయాలను చెప్పడానికి ఇష్టపడుతుంటారు. అందుకే తండ్రులు కూడా పిల్లలకు ఫ్రెండ్ గా మారుతున్నారు. పిల్లల మానసిక వికాసానికి, వాళ్ల భావాల వ్యక్తీకరణకు ఫ్రెండ్ గా ఉంటేనే ప్రయోజనమని దివ్య రెడ్డి తెలిపారు.
మీరు పెరిగేటప్పుడు మీ తండ్రితో మీ సంబంధం ఎలా ఉండేది? ఇప్పుడున్న తండ్రి పిల్లల సంబంధాలకు అది ఎంత భిన్నంగా ఉంది?
ఒకప్పుడు తన తండ్రి పని ముగించుకొని ఇంటికి రాగానే తనతో కలిసి కొద్దిసేపు ఆడుకునేవాడని, అది తమ మధ్య ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరిచిందని..అయితే ఇప్పటి జనరేషన్ లో పెద్దలు ఎవరు పనుల్లో వారు బిజీగా ఉంటున్నారని.. పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లోనే ఆడుకుంటున్నారని..ఫలితంగా తండ్రితో ఇప్పుడున్న పిల్లలకు ఎటాచ్ మెంట్ పోతుందని దివ్య రెడ్డి చెప్పారు.
ఒక తండ్రి తన పిల్లలతో సరదాగా ఉండటం వల్ల వారి బంధం ఎలా బలపడుతుంది?
ఇలా ఉండటం తన తండ్రకి తమ ఆలోచనలు, తమకు సంబంధించిన విషయాలను చెప్పడంలో భయపడనవసరం లేదని పిల్లలు భావిస్తారు. చదువులో అయినా కెరీర్ లో లేదా వ్యక్తిగత విషయాల్లో అయినా తన తండ్రి తిడతాడు, కొడతాడు అనే భయం లేకుండా తమ ఆలోచనలు పిల్లలు చెప్తారు. దీనివల్ల పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గి బ్రెయిన్ డెవలప్ మెంట్ కూడా ఉంటుంది. ఏ విషయాన్నైనా మా నాన్నకు చెప్పొచ్చు అని పిల్లలు ఫీల్ అవుతారు..ఈ క్రమంలో వారి మధ్య మానసికంగా కూడా బంధం మరింత బలపడుతుందని దివ్య రెడ్డి చెబుతున్నారు.
తండ్రులు తమ పిల్లల భావాలను గౌరవించడం, వారిని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యం?
పిల్లల భావాలను,ఐడియాలను గౌరవిస్తే వాళ్లు కూడా తండ్రుల ఆలోచలనకు విలువ ఇస్తారు. తండ్రి ఎలా బిహేవ్ చేస్తే తర్వాత పిల్లలు కూడా అలాగే ఉంటారు. పిల్లలను గౌవరించడం,అర్థం చేసేుకోవడం ప్రారంభిస్తే ఆ తండ్రిని ఎప్పటికీ మర్చిపోరు. అంతేకాకుండా పిల్లలో మానసిక స్థైర్యం, ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుందని దివ్య రెడ్డి చెప్పారు.

ఒక తండ్రి తన పిల్లలతో మరీ స్నేహపూర్వకంగా ఉండటం వల్ల కలిగే ప్రతికూలతలు ఏమైనా ఉన్నాయా?
ప్రతి బంధానికి కొన్ని సరిహద్దులు అవసరమని దివ్య రెడ్డి తెలిపారు. తండ్రి తన వ్యక్తిగత సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను, బలహీనతలను స్నేహితుడితో పంచుకున్నట్టు పిల్లలతో పంచుకోవడం మొదలుపెడితే, అది వారి లేత మనసులపై భారాన్ని మోపుతుంది. వారికి అవసరం లేని ఆందోళనను కలిగిస్తుంది. అదేవిధంగా పిల్లలు కూడా తమ తండ్రితో ఏది పంచుకోవాలో ఏది పంచుకోకూడదో తెలుసుకోలేకపోతారని ఆమె తెలిపారు.
పిల్లలు తమ తండ్రులను ఒక రోల్ మోడల్ గా చూడటం కంటే స్నేహితుడిగా చూడటం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?
తండ్రిని ఒక స్నేహితుడిగా చూడటం వల్ల పిల్లల ఎదుగుదలకు, వారి వ్యక్తిత్వ వికాసానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని దివ్య రెడ్డి చెప్పారు. తండ్రి-పిల్లల బంధాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా పిల్లలకు స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని ఇది అందిస్తుందన్నారు. ఒక రోల్ మోడల్ ముందు తప్పులు చేయడానికి సంకోచించే పిల్లలు, స్నేహితుడి ముందు తమ తప్పులను ఒప్పుకోవడానికి, వాటి నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారన్నారు. తండ్రిని స్నేహితుడిగా చూసే పిల్లలకు,తమ తండ్రి ఎప్పుడూ తమ పక్కన ఉంటాడనే నమ్మకం బలంగా ఏర్పడుతుంది. ఈ మద్దతు పిల్లలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుందని దివ్య రెడ్డి తెలిపారు.
సాంకేతికత, సోషల్ మీడియా ఈ సంబంధంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి?
సోషల్ మీడియాకు అతుక్కుపోవడం, నిజ జీవిత సంబంధాలపై తగిన శ్రద్ధ చూపకపోవడం వల్ల దూరం పెరిగే అవకాశం ఉంది. సాంకేతికత,సోషల్ మీడియా సంబంధాలను మెరుగుపరచగలవు, సవాలు చేయగలవు. వాటిని ఎలా వాడుకుంటాం అన్నదే కీలకం అని దివ్య రెడ్డి చెప్పారు.
ఆధునిక తండ్రులు తమ పితృత్వ పాత్రను మరింత అర్థవంతంగా ఎలా నిర్వహిస్తున్నారు?
ఆధునిక తండ్రులు కేవలం పోషకులుగా కాకుండా, పిల్లల లైఫ్ లో పాల్గొంటూ భావోద్వేగంగా కనెక్ట్ అవుతూ వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆటపాటలు, విద్య, ఇంటి పనులు పంచుకుంటూ పితృత్వాన్ని మరింత అర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

తండ్రులు తమ పిల్లలకు అందించగల అత్యంత విలువైన బహుమతి ఏమిటి?
తండ్రులు తమ పిల్లలకు అందించగల అత్యంత విలువైన బహుమతి సమయం, శ్రద్ధ,మద్దతు. వారికి బలం, భద్రత, షరతులు లేని ప్రేమను అందించడం ద్వారా పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి మార్గం సుగమం చేస్తారు. ఇది కేవలం భౌతిక ఉనికి కాకుండా వారి జీవితంలో భావోద్వేగ భాగస్వామ్యం అని దివ్య రెడ్డి తెలిపారు.
తండ్రులు తమ పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవచ్చు?
పిల్లల వయసు, ఆసక్తులకు తగిన ఆటలు, స్పోర్ట్స్, సైకిల్ రైడ్స్ లేదా బోర్డు గేమ్స్ ఆడాలి. చిన్న ట్రిప్పులు ప్లాన్ చేయండి. హోంవర్క్‌లో సహాయపడటం, భోజనం తయారుచేయడం, లేదా ఇంటి పనుల్లో కలిసి పాల్గొనడం వంటివి చేయండి. ప్రతిరోజు పడుకునే ముందు కథలు చెప్పడం లేదా వారి రోజు గురించి అడగడం ద్వారా సంభాషణను ప్రోత్సహించండి. కలిసి పుస్తకాలు చదవడం, మొక్కలు నాటడం లేదా కొత్త నైపుణ్యం నేర్చుకోవడం వంటి ప్రణాళికలు పిల్లలతో బలమైన, ప్రేమపూర్వకమైన బంధాన్ని ఏర్పరచడానికి సహాయపడతాయని దివ్య రెడ్డి సూచించారు.

తండ్రి-పిల్లల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ప్రభుత్వం లేదా సంస్థలు ఎలాంటి సహాయం అందించగలవు?
తండ్రి-పిల్లల బంధాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం, సంస్థలు పిల్లల సంరక్షణకు సంబంధించి సెలవులు పెంచడం, తండ్రులకు పేరెంటింగ్ వర్క్ షాప్‌లు, కౌన్సిలింగ్ అందించడం వంటివి చేయాలి. అలాగే తండ్రి కేంద్రీకృత కార్యక్రమాలు రూపొందించి వాటిని ప్రోత్సహించడం ద్వారా పిల్లల ఎదుగుదలలో తండ్రుల చురుకైన భాగస్వామ్యాన్ని పెంచగలవు. కుటుంబ అనుకూల విధానాలను అమలు చేయాలని దివ్య రెడ్డి సూచించారు.



Click it and Unblock the Notifications











