Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సినిమాను మించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఒకేసారి ఇద్దరితో అలా చేస్తూ.. ప్రాణం తీసేశాడు! ట్విస్ట్ ఏంటంటే?
సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అప్పుడప్పుడు కలియుగం అంతానికి వచ్చేసిందేమో అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే మానవత్వం, ధర్మం అనేది ఏదీ పాటించకుండా వ్యక్తులు ప్రవర్తిస్తుండడం ఇందుకు నిదర్శనం. కొందరు సొంత సోదరులనే పెళ్లి చేసుకోవడం వారితో సంబంధం కలిగి ఉండడం కూడా ఇందుకు నిదర్శనమే. అలాగే వేరే ఒకరి మాయలో పడి భర్తను భార్య, భార్యను భర్త హతమార్చడం కూడా ఇందుకు నిదర్శనమే. ఇలాంటి ఘటనలు మన దేశంలో చాలానే జరుగుతున్నాయి. ఆ ఘటనలను వింటున్న లేదా చదువుతున్నా కొంచెం ఇబ్బందిగా, అనిపించినప్పటికీ.. కొన్ని ఘటనల గురించి వింటే మాత్రం ఒళ్ళు గగుర్లుపుట్టాల్సిందే. అలాంటి ఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ ఘటన ఏంటి? దానికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ
ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని విజయపురి చెందిన ఐశ్వర్య అనే యువతి MBA చదువుతుంది. అయితే ఐశ్వర్య అదే కాలేజీలో ఆకాష్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఆకాష్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ ఆకాష్ వేరే అమ్మాయితో ప్రేమను మెయింటైన్ చేస్తున్నాడు. ఐశ్వర్యతో చెట్టాపట్టాలు వేసుకుంటూనే మరొక అమ్మాయితో ప్రేమను నడుపుతున్న వ్యవహారం ఐశ్వర్యకు తెలిసిపోయింది. వాళ్ళిద్దరినీ కళ్లారా చూసి ఆమె గుండె తట్టుకోలేకపోయింది. దీంతో ఐశ్వర్య తీవ్రంగా కుంగిపోయింది. తాను మోసపోయానని భావించింది. ఇష్టపడ్డ వ్యక్తి దక్కలేదనే భావనతో ఆకాష్.. ఆమె స్నేహితురాలికి తాను చనిపోతున్నానని మెసేజ్ చేసి చనిపోయింది.

ఈ మెసేజ్ రాగానే ఆకాష్ తెలివితో పరుగు పరుగున ఐశ్వర్య ఉండే ఇంటికి వెళ్ళాడు. వెళ్లి ఆమె ఫోన్‌లోని ఆధారాలన్నిటినీ డిలీట్ చేశాడు. అలాగే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో పోలిసులు విచారణ జరిపించి అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆకాష్ ప్రేమిస్తున్న అమ్మాయి కోసం గాలిస్తున్నారు. అలాగే ఐశ్వర్య ఫోన్ ను విచారణ నిమిత్తం ఫోరెన్సిక్‌కు పంపించారు.
ప్రేమలో మోసపోతున్నామని ఎలా గుర్తించాలి..
ఈ మధ్య కాలంలో మోసాలు చాలా ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. తెలిసో తెలియకో చాలా మంది తమను తాము మోసం చేసుకుంటూనే ఇతరులను కూడా మోసానికి గురి చేస్తున్నారు. దీని కారణంగా ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రేమలో మోసపోయిన తరువాత బాధపడే ముందు.. మోసపోతున్నామని ముందే గ్రహించడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. మనం ప్రేమించే వ్యక్తి మనకు అకారణంగా సమయం ఇవ్వనప్పుడు.. వారికోసం మానం అంతా చేస్తున్నా.. వారు ఏమీ పట్టనట్టు ఉంటే.. వారి జీవితంలో ఎవరో వచ్చారని అర్ధం చేసుకోవాలి. ముందుగా వారు అలా ప్రవర్తించడానికి కారణం తెలుసుకోవాలి. అసలు ఎలాంటి కారణాలు లేకపోతే వేరే వ్యక్తి వారి జీవితంలో వచేశారని గుర్తుంచుకోవాలి.
మరణం కాదు..
ప్రేమలో మోసపోతే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కానీ ఆత్మహత్య శాశ్వతం కాదు. ఎవరో వ్యక్తికి మీ ప్రేమ విలువ తెలియక వేరే వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటే దానికి మీరెందుకు చావడం. దేవుడు ఇచ్చిన ఒక జన్మలో అతను.. కాకపోతే ఇంకొకరు, అతనికి లేని ఆ బాధ నీకెందుకుండాలి. ముందు అతడిని మర్చిపోవడానికి ప్రయత్నించాలి. ఎదో ఒక పనిలో బిజీ అవ్వాలి. తల్లిదండ్రులు, స్నేహితులతో మాట్లాడాలి. మనో ధైర్యంతో జీవితంలో ముందు సాగాలి, అంతే కానీ మరణం శాశ్వత నిర్ణయం కాదు.



Click it and Unblock the Notifications