Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా జరుపుకునే ఒకఒక్క వేడుక పుట్టినరోజు. మన జీవితంలో ఆరోజు లేకపోతే ప్రపంచంలో మనం భాగం కూడా అయ్యుండేవారము కాదు. ఈ భూమిపైక వచ్చింది కూడా పుట్టిన రోజునే. చిన్న వయసులో పుట్టిన రోజంటే అదో పెద్ద పండగ. కేకు, చాక్లెట్ష్, కొత్త బట్టలు, గిఫ్ట్స్‌తో బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ వయసు పెరిగే కొద్దీ పుట్టిన రోజు వేడుకలు జరిపే స్టైల్ మారుతూ ఉంటుుంది. అయినప్పటికీ స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయ్.

పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీరు కూడా అలాంటి శుభాకాంక్షలను మీశ్రేయోభిలాషులకు తెలపడానికి మీ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన పుట్టిన రోజు శుభాకాంక్షల సందేశాలను ఇక్కడ ఇస్తున్నాం.
బహుమతి కంటే అది ఇచ్చినవారిని ఎక్కువగా ప్రేమించు, అప్పుడు ప్రతి బంధం ఎంతో అండగా కనిపిస్తుంది పుట్టినరోజు శుభాకాంక్షలు.
బహుమతులు కాదు, బంధాలు ముఖ్యం. నా ఆత్మీయ బంధువుకు జన్మదిన శుభాకాంక్షలు.
మీకెంతో ప్రియమైన వారితో ఈ రోజు ఆనందగా ఆహ్లాదకరంగా గడపాలని, ఈ రోజు మీ జీవితంలో మరువలేని అత్యుత్తమ జ్ఞాపకంగా నిలవాలని ఆశిస్తూ .. పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఫ్రతీ క్షణం నీ చిరు నవ్వుల స్నేహన్ని ఆశీస్తూ... పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఎదుటవారిని నవ్వించడం కంటే ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏముంటుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా జీవించు. పుట్టినరోజు శుభాకాంక్షలు.
నీవు ఎప్పుడైనా అధైర్య పడితే మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను సిద్దమే అని తెలియచేస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
దేవుని దీవెనలతో.. అమ్మ నాన్న ఆశీస్సులతో.. కుటుంబ సభ్యుల ఆప్యాయత అనురాగాలతో.. మీ కళలు, కోరికలు నెరవేరాలని.. మీ సంతోషాలు పండాలని కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు..
ఈ నీ పుట్టిన రోజున ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీ పుట్టిన రోజుతో పాటు, మిగిలిన 365 రోజులు కూడా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు
గతాన్ని మరిచిపోయి, మీరు భవిష్యత్తు బంగారంలా మారాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు
మీరు అందరికీ పంచిన సంతోషం తిరిగి మీ దరికి చేరాలని కోరుకుంటూ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీరు కన్న కలలన్నీ నిజం కవావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మీకు జన్మదిన శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications