Latest Updates
-
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా?
మీ ప్రియురాలిని ఎవరైనా బ్లాక్ క్యాట్ అని పిలిస్తే మీకు కోపం వస్తుందా? సాధారణంగా నల్ల పిల్లి అనగానే మనకు అపశకునం, మూఢనమ్మకాలు లేదా నెగెటివ్ ఆలోచనలు వస్తాయి. కానీ, రిలేషన్ షిప్ సైకాలజీ పరంగా చూస్తే దీని అర్థం వేరు. మోడ్రన్ సైకాలజీ ప్రకారం, ఒక అమ్మాయిని బ్లాక్ క్యాట్ అనడం నెగెటివ్ కాదు, అదొక ప్రత్యేకమైన వ్యక్తిత్వానికి నిదర్శనం.

సైకాలజిస్టులు ఈ బ్లాక్ క్యాట్ వ్యక్తిత్వాన్ని చాలా ఆసక్తికరంగా విశ్లేషించారు. అంతర్ముఖంగా (Introvert) ఉండే అమ్మాయిలను ఆమె నల్ల పిల్లులుగా అభివర్ణించారు. వీరి ప్రధాన లక్షణాలు ఏమిటంటే.. వీరు చాలా సైలెంట్ గా, కాస్త రహస్యంగా ఉంటారు. పైకి చూడటానికి చాలా కఠినంగా, గంభీరంగా, ఉన్నత వర్గానికి చెందిన వారిలా ఎవరికీ అంతుచిక్కని వారానిపిస్తారు. వీరు సంప్రదాయాలను గౌరవిస్తారు. అవతలి వారు చెప్పేది చాలా శ్రద్ధగా వింటారు. అయితే, వీరు ఎవరినీ అంత సులభంగా నమ్మలేరు. తమ భాగస్వామిపై నమ్మకం పెంచుకోవడానికి వీరికి చాలా సమయం పడుతుంది.
కానీ ఒక్కసారి నమ్మకం కుదిరి, ప్రేమ చిగురిస్తే... ఆ సైలెంట్ అమ్మాయి కాస్తా తన భాగస్వామితో చాలా ఓపెన్ గా, సరదాగా మారిపోతుంది. అప్పుడు ఆమె మనసు గెలుచుకోవడం ఎంతో సులభం అవుతుంది.
బ్లాక్ క్యాట్ అమ్మాయిలకు ఎలాంటి అబ్బాయిలు సెట్ అవుతారు?
గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్(ఒక రకమైన కుక్క బ్రీడ్) లక్షణాలు ఉన్న అబ్బాయిలు ఈ బ్లాక్ క్యాట్ అమ్మాయిలకు సెట్ అవుతారంట. వీరి లక్షణాలు అచ్చం బ్లాక్ క్యాట్స్ కి పూర్తి వ్యతిరేకం. వీరు చాలా ఎక్స్ ట్రావర్ట్స్ (బహిర్ముఖులు). ఎప్పుడూ నవ్వుతూ, ఉల్లాసంగా, అందరితో కలుపుగోలుగా ఉంటారు. నిజాయితీగా, దయతో మెలుగుతారు. ఇతరులను సంతోషపెట్టడానికి ఎప్పుడూ ముందుంటారు. రిలేషన్ కి నూటికి నూరు శాతం కట్టుబడి ఉంటారు. ఎవరినైనా ఇట్టే నమ్మేస్తారు, మనసులోని మాటను దాచుకోకుండా వాచాలంగా మాట్లాడేస్తారు.
ఒకరు సైలెంట్, మరొకరు వయోలెంట్ అన్నట్లు.. ఈ రెండు విరుద్ధమైన వ్యక్తిత్వాలు కలిస్తే సంబంధంలో కాస్త ఉద్రిక్తత రావడం సహజం. ఒకరు దగ్గరవ్వాలని చూస్తే, మరొకరు కొంత స్పేస్ కావాలని కోరుకుంటారు. అయినప్పటికీ ఈ వైరుధ్యమే వారి బంధానికి ఒక బలమైన పునాదిగా మారుతుంది. చైనీస్ ఫిలాసఫీ యిన్ అండ్ యాంగ్ (Yin and Yang) సిద్ధాంతం లాగా... ఈ రెండు వ్యతిరేక లక్షణాలు ఒకదానికొకటి అద్భుతంగా పూరకంగా మారతాయి. అబ్బాయిలోని ఉల్లాసం అమ్మాయిలోని బిడియాన్ని పోగొడితే, అమ్మాయిలోని గంభీరత అబ్బాయికి ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది.
ఒకరిలోని ఉత్తమ లక్షణాలను మరొకరు బయటకు తీసుకువస్తారు. అయితే ఈ బంధంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. తమకు ఏం కావాలి, తమ అవసరాలు ఏమిటి అనేది ఇద్దరూ ఒకరికొకరు స్పష్టంగా కమ్యూనికేట్ చేసుకోలేకపోతే అపార్థాలు తలెత్తే ప్రమాదం ఉందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
అయితే మనుషులకు పెట్టిన ఈ పేర్లు లేదా ట్యాగ్ లు వారి సంబంధం నిజ స్వరూపాన్ని పూర్తిగా నిర్ణయించలేవు. ఎందుకంటే అప్పుడప్పుడు సైలెంట్ గా ఉండే బ్లాక్ క్యాట్ అమ్మాయి కూడా పార్టీలకు వెళ్లి హంగామా చేయాలనుకోవచ్చు. అలాగే ఎప్పుడూ బయట తిరిగే గోల్డెన్ రిట్రీవర్ స్వభావం ఉండే అబ్బాయి కూడా ప్రశాంతంగా ఇంట్లో గడపాలని కోరుకోవచ్చు. ఏదేమైనా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఇద్దరి భిన్నమైన వ్యక్తిత్వ లక్షణాలను గౌరవించుకుంటూ సాగే ఏ బంధమైనా విజయవంతం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.



Click it and Unblock the Notifications
