Latest Updates
-
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
రిలేషన్‌షిప్‌లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.!
ప్రేమలో పడిన తర్వాత ఎవరి జీవితమైనా చాలా మారిపోతుంది. ఎప్పుడూ ఆ వ్యక్తి గురించే ఆలోచించడం, వారితోనే మాట్లాడాలని అనిపించడం, మీ జీవితంలో, మీ నిర్ణయాల్లో ప్రత్యేక స్థానం ఇవ్వడం ఇలా చాలా విధాలుగా మీ జీవితం మారిపోతుంది. అయితే అది ప్రేమా లేక వ్యామోహమా ఎలా తెలుసుకోవాలి.. దీని గురించి భగవద్గీత బోధనలు కొన్ని లోతైన విషయాలను తెలియజేస్తున్నాయి. అవేంటో చూద్దాం..

కొన్ని బంధాలు ఆరంభంలో బాగానే ఉన్నా తర్వాతర్వాత ఆ బంధంలోని అసలు స్వరూపం బయటపడటం ఫలితంగా బాధపడటం, చేదు జ్ఞాపకాలను మిగుల్చుకోవడం జరుగుతుంది. ప్రేమ పేరుతో వ్యామోహం పెంచుకోవడం, అవసరం తీరాక వదిలేయడంతో ఎన్నో బంధాలు విచ్ఛిన్నమై, చివరికి మోసం పోవడం లేదా ప్రాణాలు తీసుకోవడానికి దారితీస్తుంది. మరి రిలేషన్‌షిప్ మొదలవ్వగానే అది ప్రేమా లేక ఆకర్షణా తెలుసుకోవాలనుకుంటే గీతలో శ్రీకృష్ణుడు బోధించిన కొన్ని విషయాలను గమనిస్తే మీ ప్రేమ జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఉండవు..
ప్రేమలో స్వేచ్ఛ..
మీరు నిజంగా ప్రేమలో ఉంటే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని తన కోరికలకు అనుగుణంగా మార్చుకోవడానికి యత్నించరు. మీ ఇష్టాయిష్టాలు, భావాలు, స్వేచ్ఛకి గౌరవం ఇస్తారు. కానీ దీనికి విరుద్ధంగా వారి ఇష్టాలకు అనుగుణంగా మార్చుకోవాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా.. లేదా మీరు ఇబ్బంది పెట్టినా అది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ కాదు.. ప్రేమలో నిజాయతీగా ఉండాలి.. కానీ ఎదుటి వ్యక్తిలోనూ అదానిని బలవంతంగా ఆశించకూడదు.
నమ్మకం- భయం..
మీ రిలేషన్‌షిప్‌లో నిజమైన ప్రేమ ఉన్నట్లయితే.. మీరు వారికి ఎంత దూరంగా ఉన్నా, బిజీగా ఉన్న మీపై వారికి నమ్మకం అనేది పోదు. మీపైన స్థిరమైన అభిప్రాయం వారికి ఉంటే నమ్మకం మరింత బలపడుతుంది. మిమ్మల్ని విడిచిపోతారేమోనని ఆందోళన కలగడం, ఆలస్యంగా ఫోన్ కాల్స్ చేయడం, చాలా తక్కువగా మాట్లాడటం, ఒంటరిగా సమయం గడపడం వంటివి మీతో ఆందోళనకి దారితీసి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఈ సందర్భంలోనే మీపై ఎదుటి వ్యక్తికి ఏ మాత్రం నమ్మకం ఉందనేది బయటపడుతుంది.
సాన్నిహిత్యం- అనుబంధం
ప్రేమలో పడ్డాక ఆ వ్యక్తిని మీరు సొంతవారిగా భావించడం అనేది సహజం. ఈ సందర్భంలోనే అది భయంగా మారి సమస్య మొదలవుతుంది. ఆ వ్యక్తి లేకుండా మీ జీవితం అసంపూర్ణంగా ఉందని భావిచడం, వారిపైన ఎక్కువగా ఆధారపడటం, నిరంతరం వారి గురించే ఆలోచించడం, వంటివి ప్రేమ పరిధిని దాటిపోతాయి. అయితే ఎదుటి వ్యక్తి కూడా మీ గురించే ఆలోచించాలనుకోవడం, వారి నుంచి ప్రతిసారీ స్పందన కోరుకోవడం, అంచనాలు పెంచుకోవడం రిలేషన్‌షిప్‌లో ఉద్రిక్తతకు దారితీస్తుంది.
ప్రేమికుల మధ్య ఒకరిపై ఒకరికి అంచనాలు పెరిగిపోయినప్పుడు తనకోసం ఇది చేయాలి అది చేయాలని ఆరాటపడుతుంటారు. కానీ అవతలి వ్యక్తి ప్రతి కోరికను తీర్చాలనుకోవడం ప్రేమకి అర్థం కాదు. ఆరోగ్యకరమైన సంభాషణ, అవగాహన, గౌరవం ఏ ప్రేమలో అయినా ముఖ్యం. సంతోషకరమైన, బాధాకరమైన సందర్భాల్లో రిలేషన్‌షిప్ మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటున్నామనేది ముఖ్యం.

ప్రేమ కోసం గుర్తింపు కోల్పోవద్దు..
ఎదుటి వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పుడు వారి కోసం మీ ఇష్టాయిష్టాలు, ఆత్మగౌరవం, వ్యక్తిత్వాన్ని పూర్తిగా త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మీ సంతోషం వారి ప్రవర్తనపై ఆధారపడి ఉండకూడదు. దీనిపై మీరు ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరం. మీ ఐడెండిటీని కాపాడుకుంటూ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు నిలబడగలగాలి.
ప్రేమలో ఇవే ముఖ్యం
ప్రేమలో ఎప్పుడైనా ఒకరి సంతోషం ముఖ్యం. ప్రేమలో శ్రద్ధ ఉంటుంది.. కానీ స్వాధీనపరుచుకోవడం ఉండదు. దీని ఆధారంగానే మీ బంధంలో మీకు మనశ్శాంతి లభిస్తుందా.. లేక కోల్పోతున్నామన్న భయం వెంటాడుతుందా.. ఆ ప్రేమ మిమ్మల్ని ఎలా నిలబెడుతుంది.. మీకు ఎలాంటి నమ్మకాన్ని ఇస్తుంది.. అనేది తప్పనిసరిగా గమనించుకోవాలి. బంధాలతో అనుబంధం పెంచుకోవడం, వాటిని పూర్తి నిజాయితీతో నిలబెట్టుకోవడమే గీత బోధనల సారాంశం. మీ మానసిక ప్రశాంతతను ఎప్పుడూ ఇతరులకి అప్పగించకూడదు. అధికారం స్థానంలో గౌరవం, భయం స్థానంలో నమ్మకం, అంచనాల స్థానంలో అవగాహన ఉన్నచోట ప్రేమ మరింత సహజంగా, అందంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
