Latest Updates
-
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.!
మొగుడిని వదిలి 25 ఏళ్ల కుర్రాడితో లేచిపోయిన ఆంటీ..చివరికి ఊహించని ట్విస్ట్..
ఆమెకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు డిగ్రీ చదువుతోంది. తల్లి మాత్రం ఈ మధ్యలో
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం స్టార్ట్ చేసింది. రోజూ ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుండేది. ఈ క్రమంలో ఓ కుర్రాడితో పరిచయం ఏర్పడింది. కట్ చేస్తే ఆమె జీవితం అర్థాంతంగా ముగిసిపోయింది. ఆ కుర్రాడి జీవితం కూడా నాశమైపోయింది. అసలేం జరిగిందో ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంకు చెందిన పద్మ అనే 40 ఏళ్ల మహిళ భర్త, పిల్లలలో ఆనందంగా జీవిస్తుండేది. అయితే ఈ మధ్యకాలంలో పద్మ సోషల్ మీడియాకి బాగా ఎడిక్ట్ అయ్యింది. అన్నం తినకుండా ఉంటదేమో గానీ రీల్స్ చేయకుండా మాత్రం పడుకునేది కాదు. ఈ క్రమంలో ఇన్ స్టాగ్రామ్ లో తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తికి చెందిన 25 ఏళ్ల సురేష్ తో పరిచయం ఏర్పడింది. మొదట్లో ఇద్దరూ మెసేజ్ లె చేసుకునేవాళ్లు. క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్త ముదరి ప్రేమగా మారింది. ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుకునేటోళ్లు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఉన్నట్లుండి పద్మ ఓ రోజు కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు.

ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో చివరికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు ఫైల్ చేసిన పోలీసులు ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె కాళహస్తిలో ఉన్నట్లు కనిపెట్టారు. కాళహస్తిలో ఆమె సురేష్ తో ఉన్నట్లు గుర్తించి వెంటనే అక్కడికి వెళ్లి పద్మకు నచ్చజెప్పి విశాఖపట్నం తీసుకొచ్చారు. అయినప్పటికీ పద్మ మనసు మార్చుకోలేదు. తన మనసు సురేష్ నే కోరుకుంటుందని, తాను సురేష్ తోనే జీవిస్తానని ఓ లెటర్ రాసి మళ్లీ ఇంట్లో నుంచి సురేష్ దగ్గరికి వెళ్లిపోయింది.
కుటుంబసభ్యులు పద్మ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారు. కాళహస్తికి వెళ్లిన పద్మ సురేష్ ని రెండో పెళ్లి చేసుకుంది. ఇద్దరూ కలిసి 9 నెలలుగా ఓ గది అద్దెకు తీసుకొని జీవించడం మొదలుపెట్టారు. సురేష్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తుండేవాడు. అయితే గత వారం వీరిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ తర్వాత పద్మ టిఫిన్, భోజనం వృద్ధా చేస్తుందంటూ సురేష్ ఆమెను మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన పద్మ ఉరివేసుకొని ఆత్మహత్మ చేసుకుంది. ఇంటికొచ్చిన సురేష్ తలుపుతీసేసరికి పద్మ ఉరిసేకోని ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే పద్మ డెడ్ బాడీని కిందికి దించాడు..అయితే తనను పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడిన సురేష్ వెంటనే పురుగుల మందు తాగాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అయితే రూమ్ లోనుంచి 3 రోజుల తర్వాత దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి కిటికీలో నుంచి తొంగి చూడగా..సురేష్, పద్మ విగతజీవులుగా పడి ఉండటం చూసి షాక్ అయ్యి వెంటనే పోలీసులకు కాల్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా సురేష్ కొనఊపిరితో ఉన్నట్లు గుర్తించి హాస్పిటల్ కు తరలించారు. అయితే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ సురేష్ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాగా,సోషల్ మీడియాలో మొదలైన పరిచయం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. సోషల్ మీడియా వల్ల లాభాలు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా కారణంగానే చాలా కాపురాలు కూలిపోవడం, కొందరి జీవితాలు ఆగమైపోవడం ఎక్కువగా జరుగుతుంది. సోషల్ మీడియా అధిక వాడకం కూడా పెద్ద ముప్పే అని చాలామంది రిలేషన్ షిప్ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.



Click it and Unblock the Notifications