Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Relationship Tips: మీ పార్ట్‌నర్‌తో ఎమోషనల్ గ్యాప్ వచ్చిందా? తిరిగి ఇలా దగ్గరైపోండి
ఎవరి దాంపత్య జీవితం కూడా 100 శాతం పర్ఫెక్ట్‌గా ఉండదు. ప్రతి జంట మధ్య గొడవలు, కలహాలు జరుగుతూనే ఉంటాయి. ఎడమొహం పెడ మొహం వేస్తూనే ఉంటారు. అలకలు కూడా ఉంటాయి.

జీవిత భాగస్వామితో గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి. అయితే గొడవలు నిత్యం జరుగుతున్నా, వారాల కొద్దీ మాట్లాడుకోకపోయినా అది ఏమాత్రం మంచిది కాదని అంటారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్.
మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఎమోషనల్ గ్యాప్ వస్తే అది చాలా సమస్యలకు దారి తీస్తుంది. మానసికంగా కలిసిలేని దంపతులు శారీరకంగా కూడా కలిసి ఉండలేరు. దంపతులు దూరం దూరంగా ఉంటే అది దాంపత్య బంధమే అనిపించుకోదు. ఒకవేళ మీకు మీ భార్యకు లేదా భర్తకు మధ్య ఎమోషనల్ గ్యాప్ వచ్చినట్లయితే తిరిగి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేందుకు ఈ చిట్కాలు పాటించండి.
ఎదుటివారు చెప్పేది వినడం నేర్చుకోవాలి:
జీవిత భాగస్వామి మాట్లాడినప్పుడు శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. ఎదుటివారు మాట్లాడే సమయంలో పరధ్యానంగా ఉండొద్దు. వారు చెప్పేదానిపై శ్రద్ధ పెట్టాలి. అలాగే వారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అంతరాయం కలిగించకూడదు.
జీవిత భాగస్వామి మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు వారిని స్వేచ్ఛగా మాట్లాడనివ్వాలి. వారు చెప్పేది పూర్తిగా వినాలి. ఆ తర్వాతే మీ ఆలోచనలు ఏంటో చెప్పాలి. ఎదుటి వారు చెప్పేది సరిగ్గా విన్నప్పుడు వారు ఏమనుకుంటున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. అపార్థాలు ఉండవు.
సానుభూతి చూపాలి:
ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ప్రేమ, నమ్మకం ఉన్నట్లుగానే సానుభూతి ఉండాలంటారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. దాంపత్య బంధంలో భావోద్వేగం చాలా ముఖ్యం. భాగస్వామితో ఏదైనా పంచుకున్నప్పుడు వారు ఎలా భావిస్తారో, ఎలా అనుకుంటారో ఊహించగలగాలి. వారు ఎలాంటి అనుభూతి చెందుతున్నారో మీరు అలాంటి అనుభూతిని ఫీలవ్వాలి.
బలహీనతలూ పంచుకోవాలి:
సొంత భావాలను భాగస్వామితో పంచుకోవడానికి సంకోచించకూడదు. మీ బలహీనతలను భాగస్వామితో పంచుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉండాలి. ఇది సంబంధంలో లోతైన సాన్నిహిత్యాన్ని, నమ్మకాన్ని సృష్టిస్తుంది. నిజాయితీకి, దాపరికం లేకుండా మనసులోని భావాలను పంచుకోవడానికి ఎప్పుడూ మంచి ప్రతిఫలం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలి:
జీవిత భాగస్వామితో కలిసి తగినంత సమయం గడపడం దాంపత్య బంధంలో చాలా కీలకం. ఒకరితో ఒకరు కలిసి ఉన్నప్పుడు వేరే విషయాల గురించి మాట్లాడటం, ఆలోచించడాన్ని నివారించాలి. ఆ సమయంలో కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించాలి, మాట్లాడుకోవాలి. సమయం గడపడం ఎంత ముఖ్యమో, అది నాణ్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి
కృతజ్ఞత చూపాలి:
మీ జీవిత భాగస్వామికి ఎప్పుడూ కృతజ్ఞతా పూర్వకంగా ఉండాలి. వారి జీవితాన్ని మీకు అందించినందుకు, మీ జీవితంలో వారు కలకాలం తోడు ఉంటున్నందుకు వారికి ఎప్పటికీ కృతజ్ఞత పూర్వకంగా మెలగాలి. వారితో భాగోద్వేగంగా కనెక్ట్ కావడానికి ప్రయత్నించాలి. వారు చేసే చిన్న చిన్న పనులకు అభినందించాలి. ఇలా చేయడం ద్వారా వారిపై మీకు ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. దీని వల్ల ఇద్దరి మధ్య బంధం బలోపేతం అవుతుంది.



Click it and Unblock the Notifications