Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
Love Tips : ఇలా ప్రపోజ్ చేస్తే.. ఎవ్వరైనా పడిపోవాల్సిందే..!
ప్రేయసికి లేదా ప్రేమికుడికి మన ప్రేమను ఎలా చెప్పాలని చాలా రకాలుగా ఆలోచిస్తాం. జీవితంలో చాలా మంది తమ ప్రేమను తమకు నచ్చినట్టుగా లేదా సాదాసీదాగా చెప్పేసి ఉంటారు. వారిలో కొందరి ప్రేమను అంగీకరించి ఉండవచ్చు కొన్ని తిరస్కరణకు గురై ఉండవచ్చు. కానీ ప్రేమను తెలయజేయడం గొప్ప విషయం. ఆ లవ్ ప్రపోజల్‌ను అద్భుతంగా బయటపెట్టాలి. ప్రపోజల్ తీసుకున్న వారు తీమ జీవితంలో మరిచిపోలేనంత అనుభూతిని మీరు వారికి కలగజేయాలి. అలాంటి లవ్ ప్రపోజల్ ఐడియాస్‌ను మేము మీ కోసం అందిస్తున్నాం.
ఇలా మీ ప్రేమసికి లేదా ప్రేమికుడికి ప్రపోజ్ చేయండి
కుటుంబ సభ్యుల ముందు
కుటుంబం సభ్యుల ముందు మీ ప్రేమని బయటపెడితే పెద్దవారి ప్రశంసలను ఎందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అమ్మాయి కూడా చాలా సంతోషంగా సురక్షితంగా ఫీల్ అవుతుంది. అబ్బాయి చాలా సంప్రదాయకమైన వ్యక్తి, సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాడని భావిస్తారు.

ఇష్టమైన ప్రదేశం
తనకు ఇష్టమైన ప్రదేశాన్ని కనుక్కొని అక్కడికి తీసుకువెళ్లి ప్రపోస్ చేయండి. ఇష్టమైన ప్రదేశంలోకి వెళితే మనసు మొత్తం ఆహ్లాధకరంగా ఉంటుంది. ఆమె సంతోషానికి ఇష్టానికి మీరు ప్రాధాన్యతనిస్తారని భావించి మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.
పర్వతాలు, ఎత్తైన ప్రదేశం
ప్రేమ అనేది జీవితంలో ఒక థ్రిల్లింగ్ అనుభవం కూడా. మీ పార్ట్‌నర్‌కు ఇలా ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటే మీకు దగ్గరలో ఎత్తైన ప్రదేశానికి , కొండలు, పర్వతాలు లేదా ఎత్తైన వాటర్‌ఫాల్స్ లాంటి ప్రదేశాలకు తీసుకొని వెళ్లండి. అక్కడ కనిపించే వ్యూ అద్భుతంగా ఉంటుంది. అక్కడికి వెళ్లగానే ఇద్దరూ కొత్త అనుభవానికి గురౌతారు. సంతోషంగా థ్రిలింగ్‌తో ఉంటారు. ఇలాంటి ప్రదేశంలో గనక ప్రపోజ్ చేస్తే మీ ప్రపోజల్ తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ప్రైవేట్ డిన్నర్
మీ ఇంటల్లో లేదా అద్భుతమైన ప్రదేశం, ప్రకృతి చూసి ఎక్కడికో వెళ్లిపోయామనే చోటు ఉంటే అక్కడ ఓ డిన్నర్‌ను లేదా లంచ్‌ను ప్లాన్ చేయండి. మంచి లోకేషన్, అద్భుతమైన సెట్టింగ్, ఇంటీరియర్‌తో ఏదైనా రెస్టారెంట్ లేదా హోటల్ ఉంటే అక్కడైనామీ లవ్‌ను ప్రపోజ్ చేయవచ్చు. ఇలాంటి లొకేషన్స్‌లో లవ్ ప్రపోజ్ చేయడం అద్భుతమైన ఫీలింగ్. జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోయే తీపి సంఘటన.
పజిల్ ప్రపోజల్స్
ప్రేమిస్తున్నాని నేరుగా చెప్పకుండా పజిల్స్ రూపంలో చెప్పడం ప్రత్యేకంగా ఉంటుంది. వారు తాగే కాఫీ కప్‌పై రాయడం, లేదా వారికి లెటర్ రాసి పంపించడం, ఇలా ఓ క్లిష్ట ప్రశ్నను వారికి సంధిస్తూ అందులో మీ ప్రేమను దాచి చెప్పడం అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి పజిల్స్ మీకు ఇంటర్నెట్‌లో చాలా అందుబాటులో ఉన్నాయ్.
న్యూ ఇయర్ ప్రపోజ్
కొత్త సంవత్సరమంటే చాలా మందికి కొత్త జీవితం లాంటిది. నూతన సంవత్సరం ప్రారంభంలో ఎన్నో సంకల్పాలను తీసుకుంటారు. మీ ప్రేమ కూడా ఓ సంకల్పంగా భావించి నూతన సంవత్సరం రోజు మీ ప్రేమను తెలియజేయండి.
సర్‌ప్రైజ్ ట్రిప్
ప్రపోజ్ చేయడానికి ఓ సర్‌ప్రైజ్ ట్రిప్‌ను మీ పార్ట్‌నర్‌తో ప్లాన్ చేయండి. ఇద్దరూ కలిసి సరదాగా ఏదైనా అద్భుతమైన టూర్‌కి వెళ్లండి. అక్కడున్న అందమైన లొకేషన్స్ చూస్తున్న సమయంలోనే మీరు మీ ప్రేమను వ్యక్తపరచండి. ట్రిప్‌ను రెండు మూడు రోజులు కొనసాగించి ట్రిప్ చివరిలో ప్రజోజ్ చేస్తే థ్రిల్లింగ్ వుంటుంది.
ఫ్లాష్ మాబ్ ప్రపోజల్
షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లల్లో ఫ్లాష్‌మాబ్‌లను మనం చూస్తూనే ఉంటాం. అలాంటి ఫ్లాష్‌మాబ్‌లను మీరు హైర్ చేసుకోవచ్చు. ఫ్లాష్ మాబ్‌వాళ్లని హైర్ చేసుకొని మీ పార్ట్‌నర్‌కు ఇష్టమైన మ్యూజిక్‌పై వాళ్లతో డ్యాన్స్ చేయించండి. ఫ్లాష్‌మాబ్ చివరిలో వారితోనే మీ ప్రేమను సైన్ బోర్డులతో తెలిసేట్టుగా సెటప్ చేయండి. ఇది అన్నంటికంటే లేటెస్ట్ ట్రెండ్ ప్రపోజల్ అనుకోవచ్చు.



Click it and Unblock the Notifications