Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
దంపతుల మధ్య ఈ సమస్యలే అక్రమ సంబంధాలకు కారణం, మొక్కలోనే తుంచేయాలి
వివాహం అనేది కేవలం ఆస్తులు, కట్నాలు తీసుకోవడం, పిల్లల కనడానికి చేసుకునే ఒప్పందం కాదు. ఇది ఒక పురుషుడు, స్త్రీ మధ్య మనస్సు మరియు శారీరక సంబందం యొక్క జీవితకాల సహకారం. జీవిత భాగస్వాములు మానసికంగా కనెక్ట్ అయినప్పుడు వారి శారీరక బంధం సహజంగా బలపడుతుంది. అయితే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం లేకపోతే అది వారి వివాహ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
ఇది భార్యాభర్తలిద్దరినీ ప్రభావితం చేస్తుంది. ఇద్దరిలో మధ్య శారీరక సంబంధం లేకపోతే అది అక్రమ సంబంధాలకు దారితీసే అవకాశం ఉంది. అక్రమ సంబంధాలకు దారితీస్తే వారి జీవితాలు నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అక్రమ సంబంధాలు ముదిరిపోతే అవి హత్యలు చేసే వరకు వెళ్లే అవకావం ఉందని మనం చూస్తూనే ఉన్నాము. శారీరక మరియు మానసిక సాన్నిహిత్యం లేని వివాహంలో జంటలు ఎదుర్కొనే సమస్యలు ఇలా ఉంటాయి.

* కోపం కట్రోల్ చేసుకోలేకపోవడం
భార్యాభర్తల మధ్య వైవాహిక సాన్నిహిత్యం లోపించడం వల్ల మానసిక సామరస్యం తగ్గుతుంది, ఇది భాగస్వాములిద్దరిలో కోపాన్ని పెంచుతుంది.
వ్యక్తులు మానసికంగా కనెక్ట్ కానప్పుడు, వారు అనవసరమైన వాదనలు, వివాదాలలో చిక్కుకుని లేనిపోని వాటి గురించి ఎక్కువగా గొడవలు పడుతూవుంటారు.
* పెరుగుతున్న ఒత్తిడి
భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం లోపిస్తే, దంపతుల మానసిక ఆరోగ్యం గణనీయంగా ప్రభావితమవుతుంది. దంపతుల మధ్య సానిహిత్యం లోపిస్తే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* కమ్యూనికేషన్ లేకపోవడం
భార్యాభర్తల మధ్య ప్రేమ అనే పదం బలంగా లేకపోతే, వారు తమ సంతోషాన్ని లేదా బాధలను వారి లోపలే ఉంచుకుని తమ నిజమైన భావాలను ఒకరికొకరు వ్యక్తం చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఇద్దరి మధ్య సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇద్దరి మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్ దెబ్బతిని వారి మధ్య ఇంకా ఎక్కువ ఆటంకాలు కలిగిస్తాయి.
* ఆత్మవిశ్వాసానికి దెబ్బ
మీ జీవితం భాగస్వామి మిమ్మల్ని చులకగా చూడటం, మీ ఎదుగుదలను తట్టుకోలేకపోవడం వల మీ ఆత్మ విశ్వాసాన్ని ఛిద్రం చేస్తుంది, అది ఆడ అయినా కావచ్చు, మగవాడు అయినా కావచ్చు. ఇలా జరిగితే మీ మనోభావాలను దెబ్బ తియ్యడమే కాకుండా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసం మీద ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
* నిద్రలేమి
వైవాహిక సాన్నిహిత్యం లోపిస్తే, నిద్రలేమి సమస్యలు ఎదురు కావచ్చు. తరువాత సోషల్ మీడియాలో కాలం గడపడం ఎక్కవ అలవాటు చేసుకునే అవకాశం ఉంటుంది. నెరవేరని లైంగిక అవసరాల వల్ల విసుగు చెందడానికి అవకాశం ఉంటంది,
* వివాహేతర సంబంధం
దంపతుల మధ్య వైవాహిక సాన్నిహిత్యం లేకపోవడంతో కొంతమంది వ్యక్తులు అపరిచితులతో సన్నిహితంగా ఉండటానికి సోషల్ మీడియాను ఆశ్రయిస్తారు. కానీ ఇతరులు ఒక అడుగు ముందుకు వేసి డేటింగ్ యాప్‌ల ద్వారా నేరుగా డేటింగ్‌ను కొనసాగించవచ్చు. చివరికి ఇలాంటి వారి మధ్య వివాహేతర సంబంధాలు మొదలవుతాయి. ఇలాంటి సమస్యలు ఎక్కువ అయితే అవి చివరికి అక్రమ సంబంధాలకు దారితీసి దంపతుల మధ్య ఇంకా దూరం పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వివాహం జరిగిన తరువాతలో వారి శారీరక కోరికలు నెరవేరకపోతే వారు వైవాహిక జీవితం వెలుపల సంతృప్తిని పొందడానికి ఆసక్తి చూపిస్తారు. వివాహం తరువాత ఇద్దరి మద్య లైంగిక సాన్నిహిత్యం ఎంత ముఖ్యమైనదో భావోద్వేగం, ప్రేమను పంచుకోవడం అంతే ముఖ్యమైనది.
వైవాహిక జీవితంలో రోజువారీ సవాళ్ల మధ్య విసిగిపోయే జంటలు తమ లైంగిక సంబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
శారీరక, మానసిక స్నేహాన్ని సమానంగా కొనసాగించాలి.
అయితే, భాగస్వాముల మధ్య లైంగిక కోరికల్లో తేడాలు వస్తే వారి సాన్నిహిత్యం సమస్యలకు దారితీస్తాయి. ఒక భాగస్వామి లైంగిక కార్యకలాపాలపై ఆసక్తిని కోల్పోయినప్పుడు అది వారి వివాహ బంధంపై గణనీయమైన నిరాశతో పాటు తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఇలాంటి సమస్యలకు దంపతులు దూరంగా ఉంటే వారి జీవితం సంతోషంగా సాగిపోతుంది. లేదంటే అక్రమ సంబంధాలకు దారితీసి లేనిపోని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



Click it and Unblock the Notifications