Latest Updates
-
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా
నిజమైన ప్రేమనా ? లేక ఎమోషనల్ అటాచ్‌మెంటా? ఈ ఒక్క ప్రశ్నతో తేలిపోతుంది!
సాధారణంగా ఎవ్వరైనా మన రెగ్యులర్ లైఫ్ లో భాగం అయినప్పుడు వాళ్లు గురించి ఆలోచించడం, వాళ్లు దూరంగా ఉన్నప్పుడు మనస్సు విలవిలలాడటం, వాళ్లు ఎప్పుడూ పక్కనే ఉండాలని కోరుకోవడం చాలా సహజం. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది, అదేంటంటే..మీరు నిజంగా వాళ్లని ప్రేమిస్తున్నారా? లేక జస్ట్ వాళ్ల సాన్నిహిత్యానికి, వాళ్లు ఇచ్చే భద్రతకు అతుక్కుపోయారా? పైకి ఒకేలా అనిపించినప్పటికీ..లవ్ కి, ఎమోషనల్ అటాచ్ మెంట్(భావోద్వేగ అనుబంధం)మధ్య చాలా తేడా ఉంది.

ప్రేమ అనేది స్వేచ్ఛనిచ్చే ఒక బ్యూటిఫుల్ జర్నీ
నిజమైన ప్రేమ లేదా స్వచ్ఛమైన ప్రేమ అనేది నమ్మకం, గౌరవం, ఎలాంటి కండీషన్లు లేకుండా ఉంటుంది. ప్రేమలో స్వార్థం ఉండదు. ఎదుటి వ్యక్తి మీకు ఏమి ఇస్తున్నాడు, వారి వల్ల మీకు ఎలాంటి లాభం కలుగుతుంది అన్నదాని కంటే.. వాళ్లు లైఫ్ లో హ్యాపీగా, విజయవంతంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ప్రేమ ఎప్పుడూ భాగస్వామి ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. వారిలోని లోపాలను, బలహీనతలను అర్థం చేసుకుంటూనే, వారిని వాస్తవికంగా ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడమే అసలైన ప్రేమ. ప్రేమ మిమ్మల్ని బంధించదు, మీ వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది.
అనుబంధం అనేది భద్రత కోసం పడే ఆరాటం
మరోవైపు కేవలం అనుబంధం లేదా అతుక్కుపోవడం అనేది అభద్రతా భావం నుంచి పుడుతుంది. ఎవరైనా మన మానసిక సౌకర్యానికి లేదా స్థిరత్వానికి అవసరం అయినప్పుడు ఇది ఏర్పడుతుంది. అనుబంధం పూర్తిగా చెడ్డదేమీ కాదు. కానీ ఒంటరిగా ఉంటామేమో అన్న భయం, ఎప్పుడూ వాళ్లు మనతోనే ఉండాలన్న పట్టింపు, వాళ్లు లేకపోతే మనకు గుర్తింపు లేదు అన్న ఆందోళన ఈ అనుబంధానికి సంకేతాలు. ఇందులో అవతలి వ్యక్తి కంటే, వారు మనకు ఇచ్చే ఓదార్పుకే మనం ఎక్కువగా ఆధారపడతాము.
ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధానమైన తేడాలు
స్వేచ్ఛ vs నియంత్రణ: ప్రేమ ఎదుటి వ్యక్తికి స్వేచ్ఛను ఇస్తుంది. ఇద్దరికీ వేర్వేరు లక్ష్యాలు, ఆసక్తులు ఉండొచ్చని అర్థం చేసుకుంటుంది. నువ్వు ఎదగాలి అని కోరుకుంటుంది. కానీ అనుబంధం..నాకు భద్రతగా అనిపించాలంటే నువ్వు నా దగ్గరే ఉండాలి అంటూ నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది.
వాస్తవం vs ఆదర్శం: ప్రేమ వారిలోని లోపాలతో సహా వారిని పూర్తిగా అంగీకరిస్తుంది. కానీ అనుబంధం అనేది మన అవసరాలకు తగ్గట్టుగా వారి గురించి ఒక ఆదర్శవంతమైన చిత్రాన్ని ఊహించుకుంటుంది. అది నిజం కానప్పుడు తీవ్రంగా నిరాశపడుతుంది.
గొడవల సమయంలో: ప్రేమలో మనస్పర్థలు వస్తే, వాదన గెలవడం కంటే ఇద్దరూ కలిసి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ అనుబంధంలో అవతలి వ్యక్తి ఎక్కడ వదిలేసి వెళ్తాడో అన్న భయంతో మితిమీరిన ఆత్మరక్షణలో పడిపోతారు లేదా భావోద్వేగాలను అదుపు చేసుకోలేరు.

మిమ్మల్ని మీరు అడగవలసిన ఒక ముఖ్యమైన ప్రశ్న
మీరు ఇష్టపడే వ్యక్తి మీకు దూరంగా వెళ్లి, వారి జీవితంలో సంతోషంగా ఉన్నారని ఒకసారి ఊహించుకోండి. ఆ జీవితంలో మీరు లేకపోయినా, వారు సంతోషంగా ఉండాలని మీరు ఇప్పటికీ కోరుకుంటారా? ఈ ప్రశ్నకు మీ సమాధానం అవును అయితే అది నిజమైన ప్రేమ. అలా కాకుండా, వారు లేకపోవడం వల్ల మీరు కోల్పోయే ఓదార్పు, భద్రత, సాంగత్యం గురించి మాత్రమే ఆందోళన చెందితే అందులో కేవలం అనుబంధం పాలు ఎక్కువగా ఉన్నట్లు లెక్క.
ప్రేమ, అనుబంధం రెండూ బద్ధ శత్రువులు కావు. నిజానికి ఆరోగ్యకరమైన సంబంధాలలో ఈ రెండూ కలిసే ఉంటాయి. అనుబంధం ఇద్దరినీ దగ్గర చేస్తే, ప్రేమ ఆ బంధానికి గౌరవాన్ని, అవగాహనను ఇస్తుంది. అయితే ఆ బంధాన్ని నడిపించేది మాత్రం ఎప్పుడూ ప్రేమే అయి ఉండాలి, ఒంటరితనం అనే భయం కాకూడదు.



Click it and Unblock the Notifications
