Latest Updates
-
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్కార్న్తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు
పెద్దలు కుదిర్చిన పెళ్లి: మీ కాబోయే భాగస్వామి ఒత్తిడితో పెళ్లికి ఒప్పుకున్నారా? ఇలా కనిపెట్టండి!
భారతీయ సంప్రదాయంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లకు (అరేంజ్డ్ మ్యారేజెస్) ఎంతో ప్రాముఖ్యత ఉంది. రెండు మనసులతో పాటు రెండు కుటుంబాలు ఏకమయ్యే అద్భుతమైన వేడుక ఇది. అయితే కొన్నిసార్లు ఈ బంధం ఇష్టంతో కాకుండా కుటుంబ సభ్యుల ఒత్తిడి, లేదా బలవంతం కారణంగా ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందడుగు వేయడం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. మీ కాబోయే జీవిత భాగస్వామి కూడా ఏదైనా ఒత్తిడితో ఈ పెళ్లికి అంగీకరించారా? వారి మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా? ఐదు ముఖ్యమైన సంకేతాలను గమనిస్తే అసలు నిజం మీకే అర్థమవుతుంది.

పెళ్లి పట్ల ఏమాత్రం ఉత్సాహం లేకపోవడం
పెళ్లి అనగానే ఎవరికైనా ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. షాపింగ్, పెళ్లి ఏర్పాట్లు, హనీమూన్ ప్లాన్స్, భవిష్యత్తు గురించి ఎన్నో అందమైన కలలు కంటారు. కానీ, మీ కాబోయే భాగస్వామికి వీటిపై ఏమాత్రం ఆసక్తి లేకపోయినా, పెళ్లి సన్నాహాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నా అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఇష్టం లేని బంధంలో ఇరుక్కున్నామనే తీవ్రమైన ఒత్తిడి వారిలో ఉత్సాహాన్ని చంపేస్తుందని గ్రహించాలి.
ప్రతి చిన్న పనినీ వాయిదా వేయడం
తర్వాత చూద్దాంలే, ఇప్పుడేం తొందర.. మీ భాగస్వామి నోటి నుంచి ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయా? అయిష్టంగా పెళ్లికి సిద్ధపడిన వారు ప్రతి విషయాన్నీ వాయిదా వేస్తుంటారు. పెళ్లి తేదీలు ఖరారు చేయడం దగ్గరి నుంచి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే వరకు ప్రతి దాంట్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. దీని అర్థం వారు ఈ బంధానికి మానసికంగా ఇంకా సిద్ధం కాలేదని లేదా ఎలాగైనా సమయం దాటవేసి పెళ్లిని తప్పించుకోవాలని చూస్తున్నారని అర్థం.
భావోద్వేగ అనుబంధం (ఎమోషనల్ కనెక్ట్) కరువవడం
ఏ బంధానికైనా పునాది భావోద్వేగ అనుబంధమే. పెళ్లికి రోజులు దగ్గరపడుతున్నా.. మీ ఇద్దరి మధ్య ఒక ఆత్మీయత, ఎమోషనల్ బాండింగ్ ఏర్పడటం లేదని మీకు అనిపిస్తోందా? మీ కష్టసుఖాలను పంచుకోవడానికి వారు ఆసక్తి చూపకపోవడం, మీ పట్ల కనీస శ్రద్ధ వహించకపోవడం ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్. ఆరంభంలోనే ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతే భవిష్యత్తులో ఆ బంధం నిలబడటం చాలా కష్టం. ఈ దూరం వారి అయిష్టతకు నిదర్శనం.
మాటలు కరువు.. కమ్యూనికేషన్ గ్యాప్
సాధారణంగా సంబంధం ఖరారైన తర్వాత కాబోయే వధూవరులు ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకుంటారు. ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, ఒత్తిడితో కుదిరిన పెళ్లిళ్లలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. మీ భాగస్వామి మీకు అసలు కాల్ చేయకపోయినా, మీరు చేసినా బిజీ అని దాటవేస్తున్నా లేదా ముక్తసరిగా సమాధానాలు ఇస్తూ సంభాషణను త్వరగా ముగించేస్తున్నా.. వారు ఈ సంబంధం పట్ల ఏమాత్రం సంతోషంగా లేరని స్పష్టంగా తెలుస్తోంది.
ప్రతి చిన్న విషయానికీ విమర్శలు, గొడవలు
కొత్త బంధంలో చిన్న చిన్న అపార్థాలు రావడం సహజమే. కానీ మీ కాబోయే భాగస్వామి ప్రతి చిన్న విషయాన్నీ రాద్ధాంతం చేస్తున్నారా? మిమ్మల్ని నిరంతరం విమర్శిస్తూ, తప్పులు పడుతున్నారా? మనకి సెట్ అవ్వదు, ఈ పెళ్లి ఆపేద్దాం అని పదే పదే అంటున్నారా? దీన్ని అస్సలు తేలికగా తీసుకోవద్దు. ఇది వారి అసహనానికి, మానసిక ఒత్తిడికి పరాకాష్ట.



Click it and Unblock the Notifications