Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వివాహేతర సంబంధాల్లో దేశంలోనే ఈ ఊరు టాప్!..సగం మందికి పైగా ఎపైర్లు
రోజు రోజుకి సమాజంలో, బంధాల్లో కొత్త కొత్త మార్పులు వచ్చేస్తున్నాయి. సామాజిక కట్టుబాట్లు, సంబంధాల స్వరూపం వేగంగా మారిపోతోంది. ఒకప్పుడు అమెరికా,బ్రిటన్,ఫ్రాన్స్, కెనడా,స్వీడన్,జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితం అనుకున్న డేటింగ్ కల్చర్..ఇప్పుడు భారతీయ యువతరాన్ని సైతం అమితంగా ఆకర్షిస్తోంది. అందుకే గత కొంతకాలంగా మనదేశంలో డేటింగ్ యాప్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మూరుమూల పల్లెటూర్లలో నివసించే వ్యక్తులు కూడా డేటింగ్స్ యాప్ లను వాడటం మొదలుపెట్టారు. అయితే ఈ మార్పు కేవలం యువతకే పరిమితం కాలేదు. పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నోళ్లు కూడా సరికొత్త సంబంధాల వైపు మొగ్గు చూపడం ఆందోళన కలిగిస్తోంది. వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నది కలవరపరిచే వాస్తవం.
వివాహేతర సంబంధాలు కోరుకునే వారి కోసమే ప్రత్యేకంగా రూపొందించిన గ్లోబల్ డేటింగ్ ప్లాట్ ఫామ్ ఆష్లే మాడిసన్ విడుదల చేసిన తాజా నివేదిక భారతీయ సమాజంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక ప్రకారం వివాహేతర సంబంధాల కోసం సైన్ అప్ అవుతున్న వారి సంఖ్యలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ నివేదికలో అత్యంత నివ్వెరపర్చే విషయం ఏంటంటే.. దేశంలోనే అత్యధికంగా వివాహేతర సంబంధాల కోసం సైన్ అప్ లు నమోదైన నగరంగా తమిళనాడులోని కాంచీపురం మొదటి స్థానంలో నిలవడం.

టైర్-2 నగరమైన కాంచీపురం..ఢిల్లీ,ముంబై వంటి మహానగరాలను వెనక్కి నెట్టడం పెద్ద ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ జాబితాలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం నుండి ఏకంగా తొమ్మిది నగరాలు టాప్ 20లో చోటు దక్కించుకోగా..దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కనీసం స్థానం కూడా లభించకపోవడం గమనార్హం. జైపూర్, రాయ్‌గఢ్, చండీగఢ్ వంటి నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
భారతదేశంలో వివాహ సంబంధిత సమస్యలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చెప్పడానికి ఏప్రిల్ లో ఆష్లే మాడిసన్ విడుదల చేసిన సర్వేనే నిదర్శనం. ఆ సర్వేలో పాల్గొన్న భారతీయులలో ఏకంగా 53శాతం మంది తాము వివాహేతర సంబంధం కలిగి ఉన్నామని అంగీకరించారు. భారత్ మాకు ప్రపంచంలో ఆరవ అతిపెద్ద మార్కెట్. ఈ ఏడాది చివరి నాటికి ఇది మరింత వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం అని ఆష్లే మాడిసన్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పాల్ కీబుల్ చెప్పడం ఈ ధోరణి తీవ్రతను తెలియజేస్తోంది.
ఈ వివాహేతర సంబంధాల పెరుగుదల కేవలం సామాజిక మార్పుగానే కాకుండా అనేక నేరాలకు కూడా దారితీస్తోంది. ఇటీవల కాలంలో ఇలాంటి సంబంధాల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు, దాడులు వంటి తీవ్రమైన నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ డిజిటల్ యుగంలో మానవ సంబంధాలు ఎంత వేగంగా బలహీనపడుతున్నాయో..వివాహ బంధం ఎంత వీక్ గా మారుతోందో ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.



Click it and Unblock the Notifications