Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
పెళ్లి చేసుకోకుండానే 70శాతం మంది సహజీవం..ఎక్కడో తెలుసా
వేగంగా సమాజంలో మార్పులు వస్తున్నాయి.. మానవ సంబంధాల స్వరూపం కూడా అనూహ్యమైన మార్పులకు లోనవుతోంది. ప్రపంచం ప్రారంభం నుండి స్త్రీ పురుషుల మధ్య బంధాన్ని నిర్వచించడానికి, దానిని పటిష్టంగా నిలబెట్టడానికి పెళ్లి అనే వ్యవస్థ వేల సంవత్సరాలుగా మానవ నాగరికతలో ఒక మూలస్తంభంలా నిలిచింది. ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యే జంటల కథలు మన సంస్కృతిలో భాగమయ్యాయి.
అయితే గత కొన్నేళ్లుగా ఈ సంప్రదాయానికి భిన్నంగా, ముఖ్యంగా యువతరం ఆలోచనా విధానంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అదే లివ్ ఇన్ రిలేషన్ షిప్. దీనిని తెలుగులో సహజీవనం అంటారు. ఒకప్పుడు దీన్ని నిషిద్ధంగా, సామాజిక కట్టుబాట్లను ఉల్లంఘించడంగా చూసేవారు. అయితే ప్రజెంట్ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇది నెమ్మదిగా ఆమోదం పొందుతూ, ఆధునిక జీవనశైలిలో ఒక భాగంగా మారుతోంది.

అసలు సహజీవనం అంటే ఏమిటి?
పెళ్లి అనే అధికారిక ముద్ర లేకుండా ఇద్దరు వ్యక్తులు ప్రేమ, పరస్పర నమ్మకం ప్రాతిపదికన ఒకే ఇంట్లో భార్యాభర్తల్లా కలిసి జీవించడమే సహజీవనం. దీనికి చట్టపరమైన సంకెళ్లు ఉండవు. కేవలం ఇద్దరి మధ్య ఉన్న అవగాహన, నమ్మకమే ఈ బంధానికి పునాది. యువతరం దృష్టిలో ఇది ప్రేమను, నమ్మకాన్ని నిరూపించుకునే నిజమైన మార్గం. ఎందుకంటే ఏ ఒత్తిడి లేకుండా, కేవలం ఇష్టంతోనే ఈ బంధం కొనసాగుతుంది. సహజీవనం చేస్తూ పిల్లల్ని కూడా కంటున్నారు.
ప్రపంచంలో సహజీవనం ట్రెండ్ ఎక్కడ ఎక్కువ?
సహజీవనం విషయంలో పాశ్చాత్య దేశాలు ముందున్నాయి. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా లివ్ ఇన్ జంటలు ఉన్న దేశం స్వీడన్. అక్కడ దాదాపు 70 శాతం మంది వివాహం చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ బంధం మరో కోణం కూడా ఉంది. ఈ జంటలలో దాదాపు 40 శాతం మంది కొంతకాలం తర్వాత విడిపోతుండగా, కేవలం 10 శాతం మంది మాత్రమే పెళ్లి చేసుకోకుండా జీవితాంతం కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నారు. స్వీడన్ తర్వాత నార్వే, డెన్మార్క్ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
భారతదేశంలో పరిస్థితి ఏంటి?
ఒకప్పుడు నిషిద్ధంగా భావించిన సహజీవనం, నేడు నెమ్మదిగా మన సమాజంలో ఒక భాగంగా మారుతోంది. భారతదేశంలో కూడా సహజీవనం వేగంగా విస్తరిస్తోంది. మహానగరాల్లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం అభివృద్ధి చెందిన నగరాల్లో ప్రతి 10 జంటలలో ఒక జంట సహజీవనంలో ఉన్నారని అంచనా. ఈ మార్పును గుర్తిస్తూ భారతీయ చట్టవ్యవస్థ కూడా స్పందిస్తోంది. ఇటీవల ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమలు చేసిన యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ఈ విషయంలో ఒక చారిత్రాత్మక ముందడుగు వేసింది. ఈ ఏడాది జనవరిలో దేశంలోనే మొదటిసారిగా సహజీవనంలో ఉన్న జంటలకు చట్టపరమైన గుర్తింపునిస్తూ, వారి రిజిస్ట్రేషన్‌కు ఒక ఫ్రేమ్ వర్క్ ను రూపొందించింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ బంధంలో ఉన్నవారికి, ప్రత్యేకించి మహిళలకు, హింస, మోసాల నుండి రక్షణ కల్పించడం. మారుతున్న బంధాల స్వరూపం భవిష్యత్తులో మన కుటుంబ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో కాలమే నిర్ణయించాలి మరి.



Click it and Unblock the Notifications
