సంబంధంలో మరింత చక్కగా వినడానికి మార్గాలు

By Mallikajuna

ఒక మంచి వినేవారుగా ఉండటం , ముఖ్యంగా ఒక సంబంధంలో అలాంటి వారు చాలా ముఖ్యం, కానీ, అది అంత సులభం కాదు. మీరు మంచిగా వినేవారు అని చూచించే కొన్ని లక్షణాలు స్పష్టంగా ఉన్నాయి. మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మంచిగా వినేవారుగా ఉండమని మనకు ఒత్తిడి తీసుకొస్తుంది. జీవితంలో కొన్ని మంచి మాటలు వినకపోతే ఏదో భయంకర పరిస్థితుల్లో ఉంటుంది.

అటువంటి సందర్భాల్లో సంబందంలో మరింత ఉత్తమం వినేవారుగా ఎలా ఉండాలని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ అర్ధచేసుకోకపోవడంలో లేదా సరిగా వినిపించుకోకపోవడంతోనే చాలా సంబందాల్లో తగాదాలకు దారితీస్తుంటుంది. కాబట్టి, ఇది అవకాశంగా తీసుకోవడం మానేయండి. మీకు అంత ఆసక్తికరమైన విషయం కాకపోయిన, ఆసక్తికరంగా లేకపోయినా మీ పార్ట్నర్ మాట్లాడేటప్పుడు శ్రద్దగా వినాలి . అది మీ ఇద్దరిలో పరస్పర మద్దతుగా పరిగణించాలి . ఒక సంబందంలో మీ జీవితం మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళాలంటే వినడంలో మరింత ఉత్తమంగా ఉండాలి. మరి ఒక రిలేషన్ షిప్ లో వినడంలో మీరు మరింత బెటర్ గా ఉండాలనుకుంటే ఇక్కడ మీరు అనుసరించాల్సిన కొన్ని చిట్కాలున్నాయి.

 శ్రద్ద చూపించు :

శ్రద్ద చూపించు :

మీరు ఆసక్తి చూపించడం చాలా ముఖ్యం . మీ వైపు నుండి కొన్ని పనులు మీ పార్ట్నర్ కు చాలా సులభంగా చేయవచ్చు. అందువల్ల, మీ పార్ట్నర్ మీతో మాట్లాడేటప్పుడు, మీ ఫోన్ ను పక్కనపెట్టండి , అదే పనిగా వాచ్ చూడటం ఆపండి, ఇటు అటు దిక్కులు చూడటం ఆపండి.

స్పందించండి :

స్పందించండి :

'స్పందన ఇవ్వండి ' ఒక సంబంధం మరింత బలంగా ఉండాలంటే, మంచిగా వినేవారుగా ఉండాలి. మీరు ఎలా మీ పార్ట్నర్ నుండి అనుకూల మద్దతును ఆశిస్తారో, అదే విధంగామీ పాట్నర్ కూడా మీ నుండి అుకూల మద్దతును ఆశించవచ్చు. కాబట్టి, ఒకరు మాట్లాడేప్పుడు మరకొరు శ్రద్దగా వినడం వెంటనే స్పందించడం వల్ల మీ పార్ట్నర్ మీరు మంచి గ్రాహకులు అని భావిస్తారు.

ప్రశ్నలు అడగండి :

ప్రశ్నలు అడగండి :

మీరు వింటున్న ఆ అంశంపై సంబంధించి ఏదైనా ప్రశ్నలు అడుగడం వల్ల పార్ట్నర్ మీరు వింటున్నారని గ్రహిస్తుంది లేదా గుర్తిస్తుంది. వారు మాట్లాడే వాటిమీద మరేదైనా అడిగి తెలుసుకోవడం కూడా ఉత్తమం. ఇది మీ సంబందంలో మీరు ఎంత మంచి గ్రాహకులు అని గుర్తించేలా చేస్తుంది .

ముందు సంభాషణలు గుర్తుచేయండి :

ముందు సంభాషణలు గుర్తుచేయండి :

మీ సంభాషణలో ఇంతకు మందుటి సంభాషణలు గుర్తు చేయండి ఒక మంచి మార్గం . ఇద్దరి మద్యా ఇది ఉండాలి. మీరు గతంలో చెప్పిన విషయాలను గుర్తించుకొన్నందువల్ల వారు సంతోషపడుతారు . ఒక సంబందలో ఎంత మంచి వినదగిన వారు అని తెలియజేస్తుంది ఈ లక్షణం.

ఎవరైన మాట్లాడేటప్పుడు మద్యలో మాట్లాడకూడదు:

ఎవరైన మాట్లాడేటప్పుడు మద్యలో మాట్లాడకూడదు:

మీ పాట్నర్ మీతో మాట్లాడేటప్పుడు మద్యలో మాట్లాడకుండా ఉండటం మంచిది . ఇక వేళ మీరు చెప్పాల్సిందే ఏమైనా ఉంటే వారు చెప్పేది పూర్తిగా ఉన్నతర్వాత మాట్లాడటం వల్ల , మీరు సంబంధంల ఎంత బెటర్ గా వినగలుగరు అన్న విషయాన్ని తెలియజేస్తుంది.

బాడీ లాంగ్వేజిని ఉపయోగించాలి:

బాడీ లాంగ్వేజిని ఉపయోగించాలి:

మీరు మీ సంబంధంలో మరింత ఉత్తమంగా వినగలిగే వారిగా గుర్తంచడానికి సహాయపడేది శారీరక ప్రవర్థన. బాడీ లాంగ్వేజిని ఉపయోగించడం చాలా సున్నితమైన అంశం. ఇది మీ పార్ట్నర్ మీతో మరింత ఎక్కుంగా ఇన్వాల్వ్ అవ్వడానికి సహాయపడుతుంది.

ప్రోత్సహించండి :

ప్రోత్సహించండి :

మీ పాట్నర్ మీతో ఏదైనా మాట్లాడేప్పు, వారిని ప్రోత్సహించాడనికి చొరవ తీసుకోండి . వారితో మాట్లాడేటప్పుడు వారి మాటలను గుర్తించి, వారి బావాలను గుర్తించాలి.

Desktop Bottom Promotion