For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అఫైర్స్ కంటే స్థిరమైన రిలేషన్ ఫిప్ ఉత్తమమైనది?

|

సంబంధాలు ముఖ్యంగా స్థిరంగా ఉండే రిలేషన్ షిప్స్ కొద్ది రోజులకు బోర్ కొట్టవచ్చు. కానీ ఇవి అఫైర్స్ కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. ఎవరైనా సరే సీక్రెట్ గా పెళ్లైనవారితో లేదా పెళ్లి కాని వారితో అఫైర్(అక్రమసంబంధం)కోరుకుంటున్నట్లైతే ముందు ముందు దారితీసే పరిణామాల గురించి ముందుగానే హెచ్చరించుకోవడం ఉత్తమం.

నిజానికి, అఫైర్స్ దీర్ఘకాలం పాటు నిలిచి ఉండవు. ప్రేమకు బదులు కామం కోరికలు తీర్చుకోవడానికి ఇటువంటి అఫైర్స్ ప్రధానంగా పెట్టుకోవడం జరుగుతుంది. కానీ అది ప్రేమ కాదు, కామం కోసమే అని తెలుసుకొన్నప్పడు ప్రశ్చాతప పడి ప్రయోజనం ఉండదు. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలో కూడా అర్థం కాక అనారోగ్య పాలవుతారు లేదా మానసికంగా మరియు శారీరకంగా క్రుంగిపోతారు.

READ MORE:వివాహేతర సంబంధాల వల్ల దుష్ప్రభావాలు

ఒక మంచి సంబంధానికి మరియు అఫైర్స్ కు మధ్య తేడా : ప్రేమ మాత్రమే. నమ్మకం, స్థిరత్వం మరియు భద్రత ఇవన్నీ ఒక బలమైన ప్రేమకు నిదర్శనాలు. ఒక సంబంధంలో కేవలం లైంగిక వాంఛ మరియు ఆనందం మాత్రే ఉన్నప్పుడు ఆ రిలేషన్ షిప్ దీర్ఘకాలం నిలబడదు. అందుకే ఎఫైర్స్ కంటే రిలేషన్ షిప్ మెరుగైనది చెబుతారు. అదెలాగో చూద్దాం...

నేరం కాదు:

నేరం కాదు:

రిలేషన్ షిప్ లో, మీరు అపరాధంగా లేదా నేరంగా భావించాల్సిన పనిలేదు. కానీ అక్రమ సంబంధాల వ్యవహారంలో ఉన్నట్లైతే లేదా ఒక సాధరణ వ్యవహారం నడుపుతున్నా ఎక్కడో, మీరు నేరంగా భావించాల్సి ఉంటుంది.

సెక్యురిటి:

సెక్యురిటి:

ఎప్పుడైతే మీరు రిలేషన్ షిప్ లో ఉంటారో అప్పుడు మీరు భద్రతగా భావిస్తారు . అదే మీరు అఫైర్ నడుపుతున్నప్పుడు, మీరు అసురక్షితంగా భావిస్తుంటారు. ఎందుకంటే అక్రమ సంబంధాలు చాలా త్వరగా ముగిసిపోతాయి. లేదా తర్వాత అవసరం లేకుండా పోవచ్చు.

భద్రత:

భద్రత:

వివిధ రకాలుగా ఆలోచిస్తే అఫైర్స్ కంటే, బలమైన సంబంధాలే సురక్షితమైనవిగా ఉంటాయి. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మీ పార్ట్నర్ తో జీవించడానికి లేదా సన్నిహింతగా ఉండటానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పనిలేదు. అదే మీకు సరిగా తెలియని వ్యక్తితో సన్నిహితంగా ఉండాలంటే వందసార్లు ఆలోచించాల్సి వస్తుంది.

ఒత్తిడి ఉండదు:

ఒత్తిడి ఉండదు:

ముఖ్యంగా అఫైర్స్ లో, సీక్రెట్ గా వ్యవహారాలు నడుపుతున్నప్పుడు ఎవరికైనా తెలుస్తుందేమో, ముందు ముందు ఏం జరగుతుందో అన్న ఒత్తిడి కలిగిస్తుంది. ప్రారంభ దశలో ఆనందంగా మజిలీ చేసినా తర్వాత పట్టుబడుతామోనన్న భయం చుట్టుముడుతుంది.

మర్యాద:

మర్యాద:

ఒక సుస్థిరమైన సంబంధాలకు సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది. రిలేషన్ షిప్ ను పెళ్ళి బందంగా మార్చుకోవడం ఉత్తమం. అదే అఫెయిర్స్ లో అధికారికంగా ఏలాంటి హోదా పొందలేరు.

ఏలాంటి వివాధాలు ఉండవు:

ఏలాంటి వివాధాలు ఉండవు:

అఫైర్స్ బయటపడినప్పుడు తీవ్రమైన వివాధాలకు దారితీస్తుంది. అదే స్థిరమైన సంబంధాల్లో ఎలాంటి వివాధాలకు చోటు ఉండదు.

English summary

Are Relationships Better Than Affairs?

Are Relationships Better Than Affairs?, Stable relationships seem boring but they are a lot better than affairs. If you are planing to get into a secret affair, either with a married person or a single one, it is better to be warned about the consequences.
Story first published: Wednesday, August 19, 2015, 15:57 [IST]
Desktop Bottom Promotion