Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
మోడ్రన్ కపుల్స్ కోసం ఇండియన్ డేటింగ్ రూల్స్
ఫ్యాషన్ రంగంలో రోజులు గడిచే కొద్ది పాత ఫ్యాషన్ కొత్తగా చూపిస్తున్నట్లు, రిలేషన్ షింప్ లో కూడా సంబందాలు కూడా మెరుగుపడుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత మోడ్రన్ యుగంలో ఇద్దరు వ్యక్తుల మద్య
సంబందం ఏర్పరుచుకోవడానికి పాతకాలపు డేటింగ్ రూల్స్ నే ఫాలో అవుతున్నారు .
ఈ మోడ్రన్ యుగంలో ఇండియన్ గర్ల్స్ లేదా పురుషులను గమనించినట్లైతే, ఖచ్చింతగా డేటింగ్ రూల్స్ మార్చేసుకుంటారు . అందుకు మొదటగా ఆమె లేదా అతడికి ఏది ఇష్టం, ఏమి కావాలి అని గుర్తుంచాలి.
ముఖ్యంగా ఇతర వ్యక్తుల నుండి ప్రశంసలకు నోచుకోకుండా ఉన్నవారు, ఈ విషయంలో చాలా తర్వాగా పడిపోతుంటారు.
ఈ మోడ్రన్ ఇండియన్ రిలేషన్ షిప్ లో డేటింగ్ చేయడానికి ముఖ్యంగా కొన్ని నియమాలున్నాయి. వీటిని అనుసరించడం కూడా సులభమే. మీరు చాలా విశాలమైన హృదయం కలిగినవారైతే ఈ నియమాలను
గుర్తుంచుకొన్నట్లైతే మీ రిలేషన్ షిప్ మరింత ప్రశాంతంగా ఉంటుంది.
ఉదాహరణకు, రిలేషన్ షిప్ లో ఉన్న మహిళలు కొన్ని విషయాలు తెలియక ఇబ్బందులు పడుతూ బాధపడుతుంటారు. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు వ్యక్తి మీతో కలిసి జీవించాలని కోరుకుంటాడు. కానీ మహిళ
అందుకు అంగీకరించకపోవచ్చు. కాబట్టి, మీ ఆలోచనలు పక్కన పెట్టి, మీకు ఇష్టమైన వ్యక్తితో డేటింగ్ చేయడానికి ఈ మోడ్రన్ ఇండియన్ రూల్స్ ను ఫాలో అయిపోవండి .
ఈ మోడ్రన్ ఇండియన్ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల మీ జీవితంలో ముఖ్యంగా మీరు ఇష్టపడే వ్యక్తితో నిజమైన ప్రేమను పొందుతారు లేదా కనుగొంటారు...

నియమం1 : ఒక రిలేషన్ షిప్ బలంగా ఉండాలని కోరుకుంటున్నట్లైతే అతడు లేదా ఆమెకు ఇష్టం లేని పనులను చేయమని ఒత్తిడి చేయడం మంచిది కాదు . మీరు చేయమన్న పనులు వారికి చేయడానికి
ఇష్టం లేనప్పుడు అది వారిలో ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఆందోళనకు, ఇతర ఆలోచనలకు మీ మీద అనుమానంకు దారి తీస్తుంది. కాబట్టి, సులభమైన మార్గంలో వెళ్ళాలి . మీ సంబందాన్ని అర్ధం చేసుకొని,
ఇష్టంలేని పనుల్లో కూడా ఒక్కోక్కో సందర్భంలో రాజీ పడితే మంచిది.
నియమం 2: కమ్యూనికేషన్. పార్టర్స్ తో కమ్యూనికేషన్ బాగుండాలి. ఎంతటి పనిలో, ఒత్తిడిలో ఉన్నా, మీకోసమంటూ ఒక పాట్నర్ ఉన్నారని గుర్తించాలి. వారితో మాట్లాడాలి. వారితో గడపాలి. వారి అవసరాలను
తీర్చాలి. ఇది మీ ప్రేమ, సంబందం పదికాలాల పాటు నిలబెట్టే ఒక గోల్డెన్ రూల్ . . డేటింగ్ చేసేవారికి ఇది రెండవ మోడ్రన్ ఇండియన్ రూల్.
నియమం 3: చాలా మంది అభిప్రాయం ప్రకారం డేటింగ్ లో ఉన్న ఇద్ధర వ్యక్తులు, వక్తిగత విషయాల పట్ల, అంటే గడిచిన విషయాలు కానీ, ఎక్స్ గర్ల్ లేదా బాయ్ ఫ్రెండ్ గురించి కానీ మాట్లాడకూదని అంటారు.
కానీ, నిపుణుల ప్రకారం, మీ గత జీవితం గురించి మాట్లాడుకోవడం వల్ల ముందు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా జీవించగలుగుతారు. పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకొనే వారు, పార్ట్నర్ వద్ద
ఎలాంటి విషయాలను దాచకూడదు. అలా దాచినట్లైతే ఏదో ఒక రోజు రహస్యం భయటపడి, మీరు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది .
నియమం 4: స్నేహితులుగా ఉండాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీ పార్ట్నర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. పార్ట్నర్ కన్నా మీ స్నేహితులకు లేదా ఎక్స్ గర్ల్ లేదా బాయ్ ఫ్రెండ్ కు ఇస్తున్నట్లు
గమనించినట్లైతే, రిలేషన్ షిప్ లో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి, పార్ట్నర్స్ మద్య స్నేహభావం కలిగి ఉండటం వల్ల ఎలాంటి సమస్యలుండవు.



Click it and Unblock the Notifications
