Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
మీ అమ్మాయి ప్రేమలో పడితే ఆమె లక్షణాలు ఎలా ఉంటాయి...
ప్రస్తుత హైటెక్ సమాజంలో యువతీ యువకుల మధ్య ప్రేమ సర్వసాధారణంగా మారింది. ఇలాంటి ప్రేమికుల్లో నిజమైన ప్రేమను చూపించే వారు ఎంతమంది ఉంటారు. నిజమైన ప్రేమకు కొలబద్ధ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడి నవారు చాలా మందే ఉంటారు.
అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏటంటే ?పాట్నర్ తో డేటింగ్ లో ఉన్నప్పుడు నిజంగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారా? అమ్మాయి ప్రేమలో ఉన్నప్పుడు అది పెద్దలు అంగీకరిస్తే ఎలాంటి సమస్య ఉండదు.
ప్రస్తుత కాలంలో అబ్బాయిల తల్లిదండ్రుల కంటే అమ్మాయిల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ అమ్మాయిలు తెలిసి తెలియని తనం వల్ల అబ్బాయిల ఆకర్షణ వల్ల ప్రేమలో పడిపోతుంటారు. ప్రేమ, ప్రేమ పెళ్లిళ్ళు ఇష్టం లేని వారు, అమ్మాయిలు ప్రేమలో పడినప్పుడు తెలుసుకోవడానికి కొన్ని విషయాలను గుర్తించాలి. అమ్మాయి ప్రేలో ఆమెలో కలిగే కొన్ని మార్పలు...

ఏకాంతం :
నలుగురితో కలిసి ఆడిపాడుతుండే పిల్ల, అల్లరి చేస్తుండే పిల్ల అకస్మాత్తుగా ఆటలు, పాటలు ఆపి, ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతుంటే మనం ఆలోచించాలి. ప్రేమలో ఉన్నందు వల్లనే ఆమె ఆ ఏకాంతాన్ని కోరుకుంటుంటే కనుక అది ప్రమాదకరం. ఏకాంతం కాస్తా కొన్నాళ్లకి ఒంటరితనం అవుతుంది.

తనలో తను నవ్వుకోవడం :
దీనికి కూడా ప్రేమే కారణం అనుకోనవసరం లేదు. తనకేవో ఫ్రెండ్స్ జోక్స్ గుర్తుకురావచ్చు. ఆవే ళ జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్‌ని తను తలుచుకుని ఉండొచ్చు. అయితే ఈ నవ్వుకోవడం పరధ్యానంలోకి మారితే కనుక అమ్మాయిని బయట ఏదో శక్తి ఆకట్టుకుంటోందని, ఆకర్షిస్తోందనీ.

ముస్తాబుకు ఎక్కువ సమయం :
మామూలు గానే ఆడపిల్లలు ముస్తాబుకు కాస్త టైమ్ తీసుకుంటారు. ఆ కాస్త మరికాస్తై అది ఇంకాస్తై మాత్రం ఎవరి దృష్టిలోనో తను ప్రత్యేకంగా కనిపించాలని తాపత్రయపడుతున్నట్లు. ప్రేమలో ఉన్న అమ్మాయి తనో రాజకుమారిలా ఫీల్ అవుతుంది. వీలున్నంత వరకు అలా తయారయ్యేందుకు ప్రయత్నిస్తుంది.

ఫోన్ వస్తే పక్కకు వెళ్లిపోవడం :
అవతలి నుంచి ఫోన్ రాగానే అమ్మాయి కళ్లల్లో మెరుపు కనిపిస్తుంది. వెంటనే ఉన్నచోటు నుంచి లేచి వెళుతుంది. అమ్మానాన్నలు వినకూడని మాటలు టీనేజర్‌కి ఏం ఉంటాయి! డెఫినెట్‌గా అది స్పెషల్ కాల్ అయ్యుంటుంది. అందుకే అంత గోప్యత.

రోజంతా టెక్స్ట్ మెసేజింగ్ :
వేళ్లు నిరంతరం మొబైల్ లోని ఏబీసీడీ మీటల్ని నొక్కుతూనే ఉంటాయి. అటు నుంచి, ఇటు నుంచి ఎస్సెమ్మెస్‌లు పాస్ అవుతూనే ఉంటాయి. ప్రేమలో ఉన్నవాళ్లు మాటల కంటే కూడా మెజేస్‌లను ఎక్కువ ఇష్టపడతారని ఎన్ని అధ్యయనాల్లో వెల్లడి కాలేదూ?!

అన్యమనస్కం :
ఏం చెబుతున్నా విననట్లే ఉంటారు. ఏదో ఆలోచిస్తుంటారు. ‘ఏం చెప్పావ్' అని అడుగుతుంటారు. చెప్పిందీ సగం సగం వింటారు. తాము చెప్పదలచుకున్నదాన్నీ స్పష్టంగా చెప్పరు. వేరే మూడ్‌లోకి వెళ్లిపోతారు. కుటుంబ సభ్యులంతా ఒక టాపిక్‌పై మాట్లాడుతుంటే వీరు అందులోకి వెళ్లరు. తమ లోకంలో తాము ఉన్నట్లుంటారు.

ఇల్లు కదలరు :
కుటుంబ సభ్యులు ఫంక్షన్‌లకు, పరామర్శలకు వెళ్తుంటే వీళ్లు వెళ్లరు. రమ్మని అడిగినా, ‘నాకు ఒంట్లో బాగోలేదు మీరు వెళ్లండి' అనో, ‘నేను చదువుకోవాలి' అనో తప్పించుకుంటారు. ఇంట్లోనే ఉండిపోడానికి ట్రై చేస్తారు. అలాంటి ఏకాంతాన్ని ఇష్టపడతారు.

ఫ్రెండ్.. ఫ్రెండ్.. ఫ్రెండ్ :
ఏం మాట్లాడినా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటుంటారు. ఫ్రెండ్‌కి వస్తానని చెప్పాను, ఫ్రెండ్స్‌తో కలిసి వెళుతున్నాను, కంబైన్డ్ స్టడీ కోసం ఫ్రెండ్ నన్ను రమ్మంది, షాపింగ్‌కు తోడుగా వెళ్లాలట.. ఇలా చెబుతుంటారు.

పాకెట్ మనీ :
ఇది రెండు రకాలుగా జరుగుతుంది. రోజూ పాకెట్ మనీ అడిగే అమ్మాయి క్రమంగా అడగడం తగ్గించేస్తుంటుంది. లేదా మనీ సరిపోవడం లేదు ఎక్కువగా ఇమ్మని అడుగుతుంటుంది. అంటే పాకెట్ మనీ కోసం పట్టు పట్టరు. లేదా పట్టుపట్టి మరీ ఎక్కువ అమౌంట్ డిమాండ్ చే స్తుంటారు. ఇదీ ప్రేమ మహత్యమే.

ఆరాలు, అబద్ధాలు :
ఇంట్లో ఉన్న అమ్మను, ఆఫీసుకు వెళ్లొచ్చే నాన్నను, బయట తిరుగుతుంటే అన్నదమ్ముల్ని టైమ్ టు టైమ్ వారి వేర్ అబౌట్స్ గురించి ఆరా తీస్తుంటారు. దాని ప్రకారం తమ టైమ్‌ని ప్లాన్ చేసుకుంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... ఇంట్లో తమకు సంబంధించిన వస్తువుల దగ్గరికి, పుస్తకాల దగ్గరికి, బట్టల దగ్గరికీ ఎవర్నీ రానివ్వరు. వీటికి తోడు అబద్ధాలు. ప్రతి విషయాన్నీ దాచేస్తుంటారు. అది బయటపడుతుందేమోనని అబద్ధాలు ఆడుతుంటారు.



Click it and Unblock the Notifications
