Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మీ జీవితంలో ఎలాంటి ప్రేమ.? ఎన్ని రకాల ప్రేమను కలిగి ఉంటారు.
ప్రేమకు భాష లేదు. పరిధులు లేవు. మనం ప్రేమ అనే పదాన్ని ఎపుడు విన్నప్పటికి, అది జంటలు లేదా భార్యా భర్తలు పంచుకునే రొమాన్స్ అని మాత్రమే భావిస్తాము. ప్రేమకు మరో అర్ధంగా రొమాన్స్ అనేదానికంటే కూడా ఈ పదానికి ఎంతో ప్రాధాన్యత వుంది.

అయిదు రకాల ప్రేమ సంబంధాలు
తల్లితండ్రుల ప్రేమ - ప్రేమ కధలన్నికూడా జంటలకు సంబంధించినవే కావు. మీ తల్లితండ్రులతో కల బలమైన సంబంధం కూడా ప్రేమ సంబంధమే. మీరు నేడు ఈ ప్రపంచంలో వున్నారనటానికి వారి ప్రేమ కారణం. లోకంలో ప్రతి వారూ వారి తల్లితండ్రులను ప్రేమించటానికి ఎంతో ఇష్టపడతారు. ఆ ప్రేమ అధికంగా లేదా ఒక మాదిరిగా కూడా వుండవచ్చు. ఉదాహరణకు ఒక కుమార్తె తన తండ్రిని అధికంగా ప్రేమిస్తుంది. అట్లే, ఒక కుమారుడు తన తల్లిని అధికంగా ప్రేమిస్తాడు. ఇది ఎన్నో యుగాలనుండి వచ్చే ప్రేమ. అది పెరిగి పెద్దదవుతూ మనం మరణించేవరకు ఉంటుంది.

దైవ ప్రేమ - మీరు దేముడు లేడు...అనే వారు కాకుంటే, దేముడంటే మీకు ఎంతో ప్రేమ వుంటుంది. దేముడు అన్ని చోట్లా ఉన్నాడనే భక్తుల భావన లేదా నమ్మకం వారికి ఎంతో ప్రేమ చూపేలా చేస్తుంది. వయసు, మతం, లింగ భేధం వంటివాటితో సంబంధం లేకుండా, మనమంతా దేముడిని ప్రార్ధించటం, అతడు మనపట్ల వున్నాడని భావించటం చేస్తాము.

వస్తువుపట్ల ప్రేమ - నేను ఈ ఆహారాన్ని ప్రేమిస్తాను లేదా ఈ దుస్తులను ప్రేమిస్తాను అనేది కూడా ఒక ప్రేమ. ఈ ప్రేమలో సాన్నిహిత్యం కూడా ఉంటుంది. ప్రేమించటం లేదా ఆ వస్తువును కలిగి వుండటం అనేది ఒక వ్యక్తి ప్రాధమిక గుణం.
పెంపుడు జంతువుల ప్రేమ - ప్రేమ మానవాళికే పరిమితం కాలేదు. ఒక కుక్క, పిల్లి, పక్షి, కుందేటు మొదలైన మూగ జీవాలు కూడా ప్రేమలు చూపుతాయి. మీరు దగ్గరలేకుంటే మీ పెంపుడు జంతువు, ఎంతో బాధపడుతుంది. అది అలవాటనండి లేదా ప్రేమ అనండి...అదే మిమ్మల్ని మీ పెంపుడు జంతువుకు లేదా జంతువును మీకు దగ్గర చేస్తోంది.

ఇవి ఒక వ్యక్తి జీవితంలో ఉండే కొన్ని రకాల ప్రేమలు. ఇలా చెప్పాలంటే ప్రేమలో ఎన్నో రకాలున్నాయి. అంతేకాని మన పార్టనర్ లేదా జీవిత భాగస్వామి ప్రేమకు మాత్రమే ప్రేమ అనేది పరిమితం కాదు. మీకు తెలిసిన మరింత ప్రేమ సమాచారం మాకు వ్రాసి పంచుకోండి.



Click it and Unblock the Notifications
