Latest Updates
-
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు!
ఇద్దరి మగవారిలో ఎవరిని భాగస్వామిగా ఎంచుకోవాలి??
ఇద్దరు మగవారు మనతో సంబంధానికి ఆసక్తి చూపిస్తోంటే కనుక మనలో చాలా మందికి ఈ ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది ఇద్దరు మగవారిలో ఎవరిని ఎంచుకోవాలి అని.
సరే, ఇద్దరూ మనకి బాగా దగ్గరివారే, బాగా మాట్లాడుతారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మరి కొద్దిరోజుల్లో మీకు ప్రపోజ్ కూడా చేసే అవకాశమున్నప్పుడు మీరు వారిద్దరిలో ఎవరిని ఎంచుకోవాలో అని నిర్ణయించుకోవాల్సిన సమయం కూడా దగ్గర్లోనే ఉంది.
మీ హృదయమే మీకు సరైన జవాబు ఇస్తుంది ఈ ప్రశ్నకి.ఒకవేళ ఇంకా మీరు సంధిగ్ధావస్తలో ఉంటే కనుక మీ మైండ్ మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవాలి.
ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సొచ్చినప్పుడు క్రింద చెప్పిన విషయాలని గుర్తు పెట్టుకోవాలి.

వారి గురించి తెలుసుకోండి:
మీకు తెలీని వ్యక్తితో సంబంధం మొదలుపెట్టేముందు కనుక అతని గురించి తెలుసుకోకపోతే అది ఒక జూదంగా పరిణమించే అవకాశం ఉంది.అందువల్ల వారి గురించి మరింత లోతుగా త్రవ్వి అన్ని విషయాలూ తెలుసుకోండి. వీలయితే వారి బ్యాక్‌గ్రౌండ్ కూడా ఒకసారి తెలుసుకోండి.

వారి భవిష్యత్ ప్రణాలికలు తెలుసుకోండి:
మీరు వారితో మాట్లాడేటప్పుడు వారి భవిష్యత్తు ప్రణాలికలు తెలుసుకోండి.ఆ ప్రణాలికలో మీరు ఇమడగలరేమో చూడండి.ఉదాహరణకి ఒక వ్యక్తి తనకి షిప్పులో పని చెయ్యాలనుందంటే సంవత్సరానికి ఆరునెల్లపాటు మీకు దూరంగా ఉండాల్సొస్తుందని మీకు నచ్చకపోవచ్చు.మీరు వాటికి తయారయితేనే ముందుకెళ్ళండి.

నిజాలు నిర్ధారించుకునేందుకు వెనుకాడకండి:
అతని పాత ప్రియురాళ్ళ గురించి మీరు తెలుసుకోక్కర్లేదు కానీ గత సంబంధాల నుండి పూర్తిగా బయటకొచ్చాడో లేదో కనుక్కోండి మీరు ఈ వ్యక్తిని పెళ్ళడేముందు.

ఏమైన ఆపద కనిపిస్తొందా మీ మనసుకి??
మంచి మనిషి ముసుగులో మీ ఎదుట ఒక సైకో లేడని నిర్ధారించుకోవడానికి ప్రయత్నించండి.ఎవరైనా కానీ మీతో మరీ మంచిగా ఉన్నట్లున్నా లేదా మంచి వ్యక్తిగా నటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నా అతన్ని అనుమానించాల్సిందే.అలా అని ఒక నిర్ణయానికి వచ్చెయ్యకండి వెంటనే.వారి గురించి మరింత అధ్యయనం చేయండి.

డేటింగులో ఉన్నప్పుడు వారిని అధ్యయనం చెయ్యండి:
మీరు అతనితో డేటింగుకి వెళ్ళినప్పుడూ వారిని గమనిస్తూ ఉండండి.ప్రతీ దానికీ అతను మీతో వాదిస్తున్నాడా??మిమ్మల్ని బాగా చూసుకుంటూనే హోటల్లో వెయిటర్ల మీద కేకలేస్తున్నాడా??ఇలాంటి చిన్న చిన్న క్లూలు పట్టుకుంటే అతను మంచివాడు కాదని తెలుస్తుంది.

మీ మీద మీకు నమ్మకం ఎవరు కలిగిస్తున్నారు:
వారిద్దరిలో మీరు ఎవరి సన్నిధిలో ప్రేమించబడుతున్నట్లు అనిపిస్తోంది??నేను అందంగా ఉన్నాను అనిపిస్తుంది??ఈ పాయింటుని కూడా మీరు పరిగణించాలి ఇద్దరిలో ఒకరిని ఎంచుకునే ముందు.

మాటల మధ్య నిశ్శబ్దంలో మీకు ఇబ్బందికరంగా ఉంటోందా??
మీరు అతన్ని కలిసినప్పుడు ఎప్పుడూ మీరే మాట్లాడక్కర్లేదు.మాటల మధ్యలో నిశ్శబ్దం రాజ్యమేలితే మీకు సౌకర్యవంతంగా ఉందా లేక ఇబ్బంది పడుతున్నారా??నిశ్శబ్దం లో కూడా మీరు ఎవరితో సౌకర్యవంతంగా ఉంటారో అతనితో జీవితం అందంగా సాగిపోతుంది.

జీవితంలో ఎవరు బాగా స్థిరపడ్డారు??
నిజం చెప్పాలంటే ఒకరిని ఎంచుకునే ముందు డబ్బు ఒక్కటే ప్రమాణం కాకపోయినా జీవితంలో బాగా స్థిరపడిన వ్యక్తితో మీ జీవితం భద్రంగా సాగిపోతుంది.



Click it and Unblock the Notifications