For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటి వారిని అస్సలు.. పెళ్ళి చేసుకోకపోవడమే మంచిది..!

|

సాధారణంగా అమ్మాయిలకు పెళ్లి కుదిరితే చాలు..అటు బంధువులంతా ఆమెను సరదాగా ఆటపట్టిస్తూ ఉంటారు. మూడుముళ్ల బంధంతో ఏడడుగుల ప్రయాణంతో మొదలయ్యే వైవాహిక జీవితం కడవరకూ సంతోసంగా సాగిపోవడానికి మనం ఎంపిక చేసుకునే భాగస్వామి సహకారం కూడా తప్పనిసరని గుర్తుంచుకోవాల. ఈ నేపథ్యంలో భాగస్వామిలో ఉండకూడని కొన్ని లక్షణాలు గురించి తెలుసుకుందాం...

ప్రతి అమ్మాయి తనకు కాబోయే వరుడు అందగాడు, గుణవంతుడు, రూపవంతుడు...అయి ఉండాలని కోరుకోవడం సహజం. అలాగే అబ్బాయిలు కూడా అందమైన, తెలివైన వ్యక్తిని భాగస్వామిగా రావాలని కోరుకుంటారు. అయితే వైవాహిక జీవితం జీవితాంతం సంతోషంగా సాగిపోవాలంటే భాగస్వామిలో కొన్ని లక్షణాలు ఎంత మాత్రం ఉండకూడదు..

How to know he's not perfect for you

1. అహంకారి:
కొంత మంది వ్యక్తులు అన్ని విషయాలు తమకే తెలుసని భావిస్తుంటారు. అటువంటి వ్యక్తులు అవతలి వారు కూడా తమ కనుసన్నుల్లోనే మెలగాలని భావిస్తారు. ఈ విషయంలో జీవిత భాగస్వామికి కూడా మినహాయింపు ఉండదు. ఇలాంటి వారు జీవితంలో ప్రతిదీ తమకు నచ్చినట్లే జరగాలని ఆశిస్తారు. భాగస్వామి సలహాలు, అభిప్రాయాలు, వారి లక్ష్యాలు..వంటి విషయాల పట్ల పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుంటారు. ఇటువంటి గుణం ఉన్న వ్యక్తి మీకు తారసపడితే ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించుకుని వారితో వివరంగా మాట్లాడి, అభిప్రాయాలు తెలుసుకున్ తర్వాతే వివాహం గురించి ఆలోచించడం మంచిది.

How to know he's not perfect for you

2. ఆధిపత్య ధోరణి:
అన్నీ నాకే తెలుసు అనుకునే వ్యక్తి అహంకారభావంతో ఆధిపత్య ధోరణి ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. కానీ మరికొందరు మాత్రం ఏమీ తెలియకపోయినా, భాగస్వాములిద్దరిలోనూ ప్రతి విషయంలోనూ తమదే పైచేయిగా నిలవాలని భావిస్తారు. ఈ తరహా వ్యక్తులకు మొండితనం, పట్టుదల..వంటివి ఎక్కువ. చేసేది తప్పని తెలిసినా, చేసి తీరాలని పంతం పట్టే రకం వీరు. ఇలాంటి తరహా వ్యక్తులను భాగస్వామిగా ఎంపిక చేసుకోకపోవడమే ఉత్తమం.

How to know he's not perfect for you

3. నియత్రణ లేకపోవడం:
సంతోషం, దు:ఖం, కోపం, బాధ..వంటి బావాలను నియంత్రించుకోవడం ప్రతి వ్యక్తికీ ఎంతో ముఖ్యం. ఒక వేళ మీకు ఎదురైన వ్యక్తిలో తమ భావోద్వేగాల పట్ల నియంత్రణ గుణం లేకపోతే మీ వైవాహిక జీవితం చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెళ్లైన తర్వాత మీ వ్యక్తిగత లేదా వివాహ జీవితంలో ఏవైనా చిక్కులు లేదా సమస్యలు ఎదురైతే వాటి పట్ల వారు స్పందించే విధానం సరిగ్గా ఉండకపోవచ్చు. అలాగే నియంత్రణ లేకపోవడం వల్ల చిన్న చిన్న తగాదాలు కూడా పెద్దవిగా చేసుకుని, చివరకు బంధాన్ని తెంచే వరకూ తీసుకెళ్లచ్చు. కాబట్టి, భావోద్వేగాల పట్ల నియంత్రణ కలిగి ఉండటం తప్పనిసరి.

How to know he's not perfect for you

4. నిర్లక్ష్య ధోరణి:
పెళ్లైన తర్వాత వ్యక్తిగత, ఆర్థిక, వైవాహిక జీవితం ఎలా ఉండనుందో ముందుగానే చర్చించుకోవడం ఈ రోజుల్లో సహజంగా మారిపోయింది. అలా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు చర్చించుకునేటప్పుడు అవతల వ్యక్తి డబ్బు, కెరీర్, పట్ల నిర్లక్ష్య ధోరణితో మాట్లాడితే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈ ధోరణి వల్ల పెళ్లైతన తర్వాత వారి భాగస్వామిగా మీరు కూడా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు లేకపోలేవు.

How to know he's not perfect for you

5. ఇవి కూడా:
ఎప్పటికప్పుడు చేయాల్సిన పనిని వాయిదా వేయడం, నిర్ధిష్ట నిర్ణయాలు తీసుకోకపోవడం, మంచి-చెడు విశ్లేషించలేకపోవడం, ప్రతి పనికీ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల మీద ఆధారపడటం...వంటి లక్షణాలు మీకు కాబోయే వక్తిలో గమనిస్తే అటువంటి వ్యక్తులను వివాహం చేసుకోకపోవడమే మంచిది. ఇలాంటి పనుల వల్ల వైవాహిక జీవితంలో సంతోషం ఉండదు సరికదా...వారిని భాగస్వామిగా ఎంపిక చేసుకుంటే మీరు కూడా భవిష్యత్తులో చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, పెళ్లికి ముందే ఒకటికి రెండు సార్లు భాగస్వామి గుణగణాలను పరిశీలించడం మంచిది.

English summary

How to know he's not perfect for you..!

We are all in search of that perfect relationship where we are perfectly compatible with our partner, have no fight and are perpetually happy. But does too much perfection actually mean that your relationship is fake? Sometimes you might end up with fake love in your quest for the perfect relationship.
Story first published:Tuesday, August 30, 2016, 17:00 [IST]
Desktop Bottom Promotion