Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీరు మీ భాగస్వామితో తప్పక చర్చించాల్సిన ఆర్ధిక విషయాలు
మీకు మీ భాగస్వామితో కొన్ని విషయాలలో సరైన అవగాహన అవసరం.ఇవి మీ పొదుపు ఖాతాలు లేదా కొన్ని విషయాలలో వేటిని మీరు తలకెత్తుకోవాలి లాంటి విషయాలు కావచ్చు.
ఈ విషయాల మీద ఒక అవగాహన ఉంటే అది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.ఈ విషయాలని కనుక నిర్లక్ష్యం చేస్తే మీ బంధం బీటలు వారే ప్రమాదం ఉంది. కనుక మీ బంధం ధృడంగా ఉండాలంటే ఆర్ధిక లావాదేవీల్లో ఇద్దరికీ ఒక అవగాహన అవసరం.
ఈరోజు ఆర్టికిల్‌లో ముఖ్యమైన ఆర్ధిక లావాదేవీల విషయాలు వాటి మీద మీ ఇద్దరికీ ఉండాల్సిన అవగాహన గురించి ఇచ్చాము చూడండి.వీటిని మీరు మీ భాగస్వామితో కనుక చర్చిస్తే అనవసర గొడవలు రావు.
సాధారణంగా దంపతుల మధ్య పోట్లాటలకి కారణం ఆర్ధిక లావాదేవీలే.వీటి గురించి చర్చించుకోకపోతే కనుక బంధం బీటలు వారే ప్రమాదం ఉంది.కనుక ఖర్చులు,ఆర్ధిక లావాదేవీల మీద కొన్ని నియమాలు పెట్టుకుంటే కనుక జీవితం సాఫీగా సాగిపోతుంది ఎటువంటి ఒడిదుడూకులు లేకుండా.
మీ భాగస్వామితో చర్చించాల్సిన ఆర్ధిక లావాదేవీల గురించి తెలుసుకోండి.

డేటింగుకి వెళ్ళినప్పుడు ఎవరు డబ్బు కడతారు:
మీరు డేట్‌కి వెళ్ళినప్పుడు అయిన ఖర్చుని ఎవరి ఖర్చు వారే పెట్టుకుంటారా లేదా చెరి సగం పంచుకుంటారా అన్నది ముందే నిర్ణయించుకోవాలి.మీరు కనుక ప్రతీసారీ అతన్నే బిల్లు కట్టమంటే కనుక ఎప్పుడూ తానే కడుతున్నాడని మీ భాగస్వామి భావించే ప్రమాదం ఉంది.

పొదుపు, ఖర్చుల వివరాలు:
మీ ఖర్చులు, పొదుపు వివరాలు మీ భాగస్వామితో తప్పక చర్చించాలి.దీని వల్ల మీ డబ్బు ఎక్కడకి పోతోందో మీకు అవగాహన వస్తుంది.దీని వల్ల అనవసర పోట్లాటలు చాలా తగ్గుతాయి.

మీకున్న అప్పుల వివరాలు:
మీకున్న అప్పు ఇతర లోన్ల వివరాలు మీరు మీ భాగస్వామితో బంధంలో స్థిరపడ్డాకా నిజాయితీగా చెప్పండి.అతను కూడా అతని వివరాలు మీతో పంచుకోవడానికి సౌకర్యవంతంగా ఉండేటట్లు చూడాలి.దీనివల్ల మీ ఖర్చులని అదుపు చేసుకునే మార్గం మీకు తెలుస్తుంది.

హాలిడే ఖర్చులు:
మీకు బడ్జెట్లో అయిపోయే హాలీడే ట్రిప్పు ఇష్టముంటే మీ భాగస్వామి అందుకు పూర్తి విరుద్ధం కావచ్చు.దీనిలో సమతుల్యం సాధించటానికి మీరిద్దరూ చెరొకసారీ మీ హాలిడేని ప్లాన్ చేసేటట్లు నిర్ణయించుకోండి.ఇందువల్ల మీ హాలిడేస్ ఎంజాయ్ చెయ్యడమే కాకుండా మీరు డబ్బు కూడా ఆదా చెయ్యగలుగుతారు.

ఇల్లు కొనుక్కోవాలనుకుంటే:
మీకు కనుక ఒక ఇంటివాళ్ళమవ్వాలని కల ఉంటే మీ భాగస్వామితో పంచుకోండి.అందువల్ల మీకు పొదుపు ఎలా చెయ్యాలో తెలుస్తుంది.ఇది మీరు మీ భాగస్వామితో తప్పక చర్చించాల్సిన విషయం.

పిల్లల ఖర్చులు:
పిల్లల ఖర్చులు భరించడం అంత సులభం కాదు. ఇది మీ బంధంలో అక్కర్లేని ఆకాంక్షలు,కలతలు రేపే అవకాశం ఉంది.అందువల్ల మీరు మీ భాగస్వామితో ఈ విషయంలో స్పష్టతతో ఉండాలి.



Click it and Unblock the Notifications