Latest Updates
-
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే..
మీరు ఆమెకు కేవలం ఫ్రెండ్ మాత్రమే అని తెలిపే సంకేతాలు..!!
అబ్బాయిలు తమని అమ్మాయిలు ఫ్రెండ్స్ గా ఫీలవరని, ఫ్రెండ్స్ క్యాటగిరీకి రామని భావిస్తారు. అమ్మాయిలకు అబ్బాయిలు చాలా ప్రత్యేకమని, బాయ్ ఫ్రెండ్ గానే ట్రీట్ చేస్తారని ఎక్కువగా నమ్ముతారు. కానీ.. జీవితంలో ఎప్పుడో ఒకసారి.. ఫ్రెండ్ జోన్ లోకి రాకతప్పదు.
ఒక అమ్మాయి క్లోజ్ గా ఉందంటే.. తనను ప్రేమిస్తోందనే అపోహ చాలామందికి ఉంటుంది. తనను ఖచ్చితంగా ప్రేమిస్తోందని అనుకోవడం వాళ్లు చేసే అతి పెద్ద పొరపాటు. అయితే అమ్మాయి కూడా మీ ఫ్రెండ్ షిప్ ని మాత్రమే ఇష్టపడే అవకాశం ఉంటుంది.
అయితే అమ్మాయిలు ఎంత క్లోజ్ గా ఉన్నా.. వాళ్లను బెస్ట్ ఫ్రెండ్ గానే భావిస్తారు. అది అర్థంకాక కొంతమంది అబ్బాయిలు తికమక పడుతుంటారు. ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా లేదా అన్న డైలమాలో ఉంటారు. అలాంటి అబ్బాయిల కోసమే ఈ ఆర్టికల్. మీరు కేవలం ఆమెకు ఫ్రెండ్ మాత్రమే అని తెలిపే సంకేతాలేంటో తెలుసుకోండి..

షాపింగ్ పార్ట్ నర్
ప్రతి సారి షాపింగ్ కి వెళ్లినప్పుడంతా మిమ్మల్ని తీసుకెళ్తుంది. అయితే ఆమెకు మీ మీద చాలా ఇస్టం ఉందని తెలుసు. కానీ.. ప్రేమికుడిగా భావిస్తోందా లేదా అని తెలియాలంటే ఒకటే మార్గం. బయట తిరగడం కంటే.. కేఫ్ లో ఎక్కువ సమయం మీతో గడపడానికి ఇష్టపడుతోందంటే.. తను మిమ్మల్ని కేవలం ఫ్రెండ్ గా భావిస్తోందని అర్థం.

బెస్ట్ ఫ్రెండ్ అని పిలవడం
తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడానికి ఆమె ఏమాత్రం సంకోచించడం లేదంటే.. మీరు ఖచ్చితంగా ఆమెకు కేవలం ఫ్రెండ్ అని అర్థం. బెస్ట్ ఫ్రెండ్ అనింది కదా అని సంతోషించకండి. ప్రేమ అనకుండా స్నేహం అంటోంది అంటే.. మీరు ఫ్రెండ్ మాత్రమే అని గమనించండి.

మ్యాచ్ మేకర్
అమ్మాయిల్లో ఎలాంటి లక్షణాలు మీకు ఇష్టమని అడగటం, సడెన్ గా.. తన ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేయడం వంటి సంకేతాలకు వెంటనే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే.. తన స్నేహితుల్లో ఎవరో ఒకరిని మీకు మ్యాచ్ చేయాలని భావిస్తోందని గుర్తించండి.

అన్నింటినీ షేర్ చేసుకోవడం
ఆమె మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటోందని మిమ్మల్ని మీరు స్పెషల్ అనుకోకండి. తన విషయాలన్నీ చెబుతోందంటే.. ఒకవేళ తన ఫ్రెండ్స్ లిస్ట్ లో మీరే ఫస్ట్ పర్సన్ అయి ఉండవచ్చని గమనించండి.

తనకు గైడ్ మీరే
ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నా.. మిమ్మల్నే సంప్రదిస్తోంది అంటే.. ఆమె మిమ్మల్ని నమ్ముతోందని అర్థం. అలాగే.. తనకు సరైన సలహా ఇస్తారని భావిస్తోందన్నమాట.

బాధకలిగినప్పుడు
ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి.. మీ ఓదార్పును కోరుకుంటుంది. ఒకవేళ మీరు ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసి ఉంటే.. మీరు ఖచ్చితంగా.. ఫ్రెండ్ జోన్ లోకే వస్తారు.

ఎవరినైనా ఇష్టపడిన విషయం
తాజాగా ఎవరినైనా చూసి ఇష్టపడినప్పుడు ఆ విషయం మీతో చెబుతోందంటే.. మీకు చాలా బాధగా ఉంటుంది. కానీ.. మిమ్మల్ని ఆమె కేవలం ఫ్రెండ్ గా భావిస్తున్నప్పుడే.. ఇలాంటివి షేర్ చేసుకుంటారు.



Click it and Unblock the Notifications
