Latest Updates
-
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.!
లైఫ్ పార్ట్నర్ తో రిలేషన్ షిప్ సరిగా లేనప్పుడు ఏం చేయాలి?ఎలా బయటపడాలి?
రిలేషన్ షిప్ (సంబంధం) ఎప్పుడూ సంతోషంగా ఉంటుందనుకోకూడదు. ఎప్పుడూ ఇది పూలపానుపు కాదు. ప్రతి రిలేషన్ షిప్ లో అప్పుడప్పుడు చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. ఇద్దరి మద్య మంచి రిలేషన్ షిప్ ఉన్నప్పుడు వేరే ఇతర విషయాలకు చోటు ఉండుదు. కానీ, రిలేషన్ షిప్ లో చిన్న చిన్న గొడవులుండంటం వల్ల ఇద్దరి మద్య సంబంధాలు మరింత బలపడుతాయి. ఇటువంటి చిలిపి గొడవల వల్ల ఫన్ క్రియేట్ అవుతుంది. సంబందం మరింత స్ట్రాంగ్ అవుతుంది.
ఇదంతా బాగానే ఉంటుంది! కానీ, కొన్ని సందర్బాల్లో కొన్ని విషయాలు మన చేయి దాటిపోతుంటుంది. అటువంటి సమయంలో సెడన్ గా ఏంజరిగిందని ఆలోచించుకుంటారు? ఇలా ఆలోచించినప్పుడు మీరు ఎలాంటి వారితో ఉన్నారన్న విషయం మీకు గుర్తుకు వస్తుంది. కొన్ని సెడన్ గా వచ్చే మార్పులు కానీ, విషయాల్లో కానీ ఇద్దరి మద్య దూరం పెంచుతుంది. అటువంటప్పుడు ఇద్దరి మద్య మంచి సంబంధాలు లేవని తెలుసుకుంటారు.
మీరు ఒక మంచి రిలేషన్ షిప్ లో లేరని, తెలుసుకోవడానికి కొన్ని విషయాలను ఇక్కడ మీకోసం అందిస్తున్నాము. ఇటువంటి అసంబద్దిత రిలేషన్ షిప్ వల్ల ఒక వ్యక్తి యొక్క లైఫ్ ను పూర్తిగా మార్చేస్తుంది., రిలేషన్ షిప్ లో సెడన్ గా వచ్చే మార్పులను జీర్ణించుకోలేక మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. ఇటువంటి పరిస్థితిలో ప్రతి విషయాన్ని నెగటివ్ గా చూస్తారు. ఏవ్వరేం చెప్పినా వినరు. ఆ వ్యక్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను కూడా కోల్పోతారు. వారు ప్రేమించే వ్యక్తులకు పూర్తిగా దూరంగా ఉంటారు.
ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒక రిలేషన్ షిప్ అసంబద్ధంగా సాగుతున్నప్పుడు అతని గురించి తీసుకోవల్సిన జాగ్రత్తలు, మీరు తీసుకునే నిర్ణయాలు వారికి ఏవిధంగా సహాయపడుతాయన్న విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

కుటుంబ సభ్యులకు ఫోన్ చేయాలి:
మీ పార్ట్న్ తో ఎటువంటి లైఫ్ ను పొందుతాన్నరాన్న విషయం పక్కన పెట్టి, మీకోసం, మీ బాగోగులు తెలుసుకునే వారు, చూసుకునే వారు కూడా ఉన్నారన్న విషయం గుర్తించాలి. ఈ విషయంలో ఏఒక్కరూ మీకు సలహాలివ్వాల్సి అవసరం లేదు. మీరు కష్టంలో ఉన్నప్పుడు, మీ ఫ్యామిలి మెంబర్స్ కు కాల్ చేయండి. వారికి ఫోన్ చేసి మాట్లాడటం వల్ల మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు.

ఫ్రెండ్స్ ను కలవండి:
రిలేషన్ షిప్ సరిగా లేనప్పుడు, మెంటల్ గా స్ట్రెస్ ఫుల్ గా మరియు డిప్రెషన్ గా మారడానికి మందు స్నేహితులను కలవండి. పాట్నర్ మీకు దూరంగా ఉండటం వల్ల స్ట్రెస్, డిప్రెషన్ పెరగవచ్చు. ఇటువంటి సమయంలో ఫ్రెండ్స్ తో కలవడం కొంత వరకూ మైండ్ రిలీఫ్ అవుతుంది. అనవసరమైన రిస్క్ లను తీసుకోవడం కంటే ఇలా చేయడం ఉత్తమం. ఫ్రెండ్స్ తో కలవడం వల్ల మీ బాధల కొంత వరకూ మర్చిపోయేలా చేయవచ్చు. మిమ్మల్ని నవ్వించేలా చేస్తారు.

జాబ్ లో బిజీగా :
రిలేషన్ షిప్ సరిగా లేనప్పుడు వెంటనే జాబ్ కు వెళ్ళండి. మీ రిలేషన్ షిప్ లో మొదలైన గొడవలు, ఆలోచనలు నుండి మీ అంతట మీరు బయటపడటానికి ఇది ఒక చక్కటి మార్గం. ఉద్యోగంలో బిజీగా గడపడం వల్ల మరింత ఇండిపెండెంట్ గా జీవించడానికి సహాయపడుతుంది. ఇంకా కాన్ఫిడెంట్ గా ఉంటారు.

కౌన్సిలింగ్ కు వెళ్ళండి:
పరిస్థితి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు, పాట్నర్ పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నప్పుడు , మానసిక నిపుణుల నుండి కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది . ఇలా చేయడం వల్ల అనవసరమైన డిప్రెషన్ ను నివారించుకోవచ్చు.

మీకు నచ్చిన పెట్స్ ను తెచ్చుకోండి:
ఇంట్లో ఉన్నప్పుడు, మీ అంతట మీరు బిజీగా గడపడానికి మీకు నచ్చిన పనిచేయడం, లేదా పెట్స్ తో గడపడం మంచిది. వాటితో ఆడుకోవడం మీఅంతట మీరు రిలాక్స్ గా ఫీలవుతారు. అనవసరపు ఫ్లాష్ బ్యాక్స్ ఆలోచించే టైమ్ ఉండదు.

వెకేషన్స్ కు వెళ్లండి:
అసంబద్ధ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు, లాంగ్ వెకేషన్ కు వెళ్లడం మంచిది. కొన్ని సందర్బాల్లో ఒంటరిగా వెళ్లడం కూడా మంచిదే . అనవసరపు టెన్షన్ ఉండవు. విశ్రాంతి తీసుకోగలుగుతారు. కొత్త ప్రదేశాలను సందర్శించడం మరియు కొత్త విషయాలను తెలుసుకోవడంలో నిమగ్నులవుతారు . ఈ సమయంలో మీ ఫీలింగ్స్ అన్నింటిని మర్చిపోతారు.



Click it and Unblock the Notifications