అతనికి నేనే సర్వస్వం అర్పించాలనుకున్నా.. కానీ నాకు తెలియకుండా మోసం చేశాడు - My Story #13

Written By:
Subscribe to Boldsky

నా ప్రపంచం వేరు. నా ఊహలు వేరు. నా కలల సౌధం వేరు. అలాంటి నా ప్రపంచంలోకి ఒకతను వచ్చాడు. అతను నన్ను నిలువునా మోసం చేశాడు. నేనే అతనికి అన్నీ సమర్పించాలనుకున్నా. కానీ అతను అలా చేయడం వల్ల నేనేమి చేయలేకపోతున్నాను. ఈ జీవితాన్ని కుదిపేసిన సంఘటన ఇదొక్కటే.

అలాంటి పని ఎప్పుడూ చేయను

అలాంటి పని ఎప్పుడూ చేయను

నాది కర్నూలు. మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయాడు. మా అమ్మ నేను మాత్రమే ఇంటి దగ్గర ఉంటాం. నేను ఒక్కదాన్నే కూతుర్ని. చిన్నప్పటి నుంచి నాకు ఏ కష్టం రాకుండా మా అమ్మ పెంచింది. మా కుటుంబం గౌరవానికి ఇబ్బంది తెచ్చే పని నేను ఏ రోజు చేయలేదు. చేయబోను. అలాంటి సందర్భమే వస్తే చావనైనా చస్తానుగానీ తప్పు దోవలో మాత్రం వెళ్లను. అది నేను పుట్టిన గడ్డ నేర్పించిన సంస్కారం.

కథలు రాస్తుంటా

కథలు రాస్తుంటా

ఎక్కువగా కథలు, కవితలు రాస్తుంటాను. వీలున్నప్పుడల్లా సినిమాలు చూస్తుంటాను. ఏదైనా క్రియేటివిటీగా ఆలోచించాలని పరితపిస్తుంటాను. అయితే ఇంటికొచ్చిన తర్వాత సోషల్ మీడియాకు అలవాటుపడ్డాను.

వందల రెక్వెస్ట్ లు

వందల రెక్వెస్ట్ లు

ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే కొన్ని వందల మంది నుంచి రెక్వెస్ట్ లు వచ్చాయి. అందులో చాలామందిని ఫ్రెండ్స్ గా యాక్సెప్ట్ చేశాను.

చాలామంది తెలియని వ్యక్తుల నుంచి ఫేస్ బుక్ లో అభ్యర్ధనలు వచ్చాయి.

అద్దాల అందాల రాశి

అద్దాల అందాల రాశి

సడెన్ గా ఒకరోజు ఒక వ్యక్తి నుంచి ఒక మెసేజ్ వచ్చింది.

ఓయ్.. అద్దాల అందాల రాశి ఏం చేస్తున్నావ్ అని మెసేజ్ వచ్చింది. నేను స్పెక్స్ (అద్దాలు) పెట్టుకునేదాన్ని. అయితే నాకు మెసేజ్ కాస్త చిరాకు తెప్పించిది. ఎవరు ఇతను.. నన్ను ఇలా అంటున్నాడనుకున్నాను. అయినా అతనికి మాత్ర రిప్లై ఇవ్వాలనుకోలేదు.

నువ్వు అద్దాల్లో చాలా అందంగా ఉన్నావ్

నువ్వు అద్దాల్లో చాలా అందంగా ఉన్నావ్

అయితే మళ్లీ ఇంకో మెసేజ్ వచ్చింది. మీరు అద్దాలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు. నేను మిమ్మల్ని కించపరచడం లేదు. మీరు చాలా బాగున్నారు అని మెసేజ్ పంపాడు. ఒక వేల నా మెసేజ్ లో ఏదైనా తప్పు ఉంటే క్షమించు అన్నాడు.

చాట్ కంటిన్యూ

చాట్ కంటిన్యూ

ఆ తర్వాత నేను కూడా అతని మెసేజ్ పంపాలనుకున్నాను. సరే.. అందులో తప్పు ఏమి లేదులే అని పంపాను. అతను తర్వాత చాట్ కంటిన్యూ చేయాలనుకున్నాడు. కానీ అతని ఫోన్ బ్యాటరీ అయిపోయింది.

ఫ్రెండ్స్

ఫ్రెండ్స్

దాంతో దానికి చార్జింగ్ పెట్టి ఇంకో నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. కొద్దిసేపు మాట్లాడుకున్నాం. నా గురించి అతడు అడిగాడు. కొన్ని విషయాలు చెప్పాను. అతని గురించి నేను అడిగాను. అతను కొన్ని విషయాలు చెప్పాడు. మొత్తానికి ఇద్దరం కాస్త ఫ్రెండ్స్ గా మారాం.

వందల మెసేజ్ లు

వందల మెసేజ్ లు

మరుసటి ఉదయం లేచి చూసేసరికి నా ఫోన్ కు చాలా మెసేజ్ లు వచ్చాయి. అవన్నీ అతనివే. గుడ్ మార్నింగ్ నుంచి అతని బయోడేటా మొత్తం అందులో పంపించాడు. మొత్తానికి ఆ మెసేజ్ లు మొత్తం చదివితే అతనిపై ఒక బయోపిక్ తీయొచ్చు. తన జీవితం గురించి మొత్తం మెసేజ్ లోనే పంపాడు.

అతను నచ్చాడు.. ఫోటోస్ పంపాడు

అతను నచ్చాడు.. ఫోటోస్ పంపాడు

అవన్నీ చదివాను. అతను గడిపిన జీవితం నాకు నచ్చింది. అతనిలో నాకు నచ్చే చాలా క్వాలీటీస్ ఉన్నాయి. ఇద్దరం రోజూ బాగా మాట్లాడుకునేవాళ్లం. తన చిన్నపటి నుంచి ఇప్పటి వరకు దిగిన ప్రతి ఫొటో నాకు పంపాడు. నేను కూడా తనకు ఫోటోస్ పంపాను. నా ఫొటోస్ తో ఒక అందమైన సాంగ్ తో వీడియో క్రియేట్ నాకు పంపాడు. అది నాకు బాగా నచ్చింది.

బయటపెట్టలేదు

బయటపెట్టలేదు

మొత్తానికి ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడడం మొదలుపెట్టాం. కానీ ఆ విషయాన్ని మాత్రం బహిర్గతం చేయలేదు. చాలా రోజులుగా మా ప్రేమ మా ఇద్దరి మనస్సుల్లోనే ఉండిపోయింది.

ప్రపోజ్

ప్రపోజ్

చివరకు నేను అతనికి ప్రపోజ్ చేశాను. అతను కూడా ఒకే అన్నాడు. అయితే రోజు మేము ఫోన్ కాల్స్ చేసుకునేవాళ్లం. గంటల తరబడి మాట్లాడుకునేవాళ్లం.

పెళ్లి

పెళ్లి

ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మీ ఇంటికొచ్చి మీ అమ్మతో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ మాటలకు నాకు చాలా సంతోషం వేసింది. అతను చాలా మంచి వాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మా మధ్య ఉన్న పరిచయం తక్కువగానీ ప్రేమ మాత్రం చాలా ఎక్కువ.

రిప్లై లేదు

రిప్లై లేదు

నాతో మాట్లాడుకుండా ఒక్కరోజు తను ఉండేవాడు కాదు. కొన్ని రోజులు తర్వాత నా మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం మానేశాడు. నన్ను బ్లాక్ చేశాడు. రోజూ ఆఫీసులో బిజీగా ఉన్నానని చెప్పేవాడు. నాకు చాలా బాధగా ఉండేది. అతను మాట్లాడనందుకు ఒక రోజు మొత్తం అన్నం తినలేదు. నేను ఏ తప్పు చేయలేదు. నన్నెందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. అందువల్ల నాకు బాధగా ఉండేది.

నన్ను మర్చిపో

నన్ను మర్చిపో

నేను అన్నం తినడం లేదు అని మెసేజ్ పంపాను. అప్పుడు అతని నుంచి రిప్లై వచ్చింది. అన్నం తినకుండా నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు. నన్ను మర్చిపో. నీ జీవితం నువ్వు బాగా బతుకు అన్నాడు.

సెక్స్ బొమ్మలాగా చూడలేదు

సెక్స్ బొమ్మలాగా చూడలేదు

ఈ కాలంలో ఇలాంటి వాడు ఉండడం చాలా గ్రేట్ అని అనుకునేదాన్ని. అతనే నా భర్తగా రావాలని చాలా సార్లు కోరుకున్నా. అమ్మాయిలు పరిచయం అయితేనే వారిని అనుభవించే మోసం చేసే అబ్బాయిలు చాలామందే ఉంటారు. అమ్మాయిలంటే కేవలం సెక్స్ బొమ్మలుగా చూసే మగాళ్లు కూడా చాలామందే ఉంటారు. కానీ అతను మాత్రం అలా కాదు. నా ప్రతి మాటలకు విలువిచ్చాడు.

ఎందుకు దూరం చేస్తున్నాడో!

ఎందుకు దూరం చేస్తున్నాడో!

నన్ను ఎందుకు దూరం చేస్తున్నాడో అర్థం కాలేదు. కానీ ఎప్పటికైనా అతను మళ్లీ నాతో మాట్లాడుతాడని.. అతనితోనే జీవితం మొత్తం నేను ఉంటానని ఆశిస్తున్నాను. నా సర్వస్వం అతనికే అర్పించాలని ఫిక్స్ అయిపోయాను. అతన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను.. కానీ చివరకు ఇలా మోసం చేశాడు.

స్వార్థం లేని ప్రేమ గెలుస్తుంది

స్వార్థం లేని ప్రేమ గెలుస్తుంది

మన ప్రేమలో స్వార్థం లేనప్పుడు.. మన ప్రేమ పవిత్రంగా ఉన్నప్పుడు ఆ పంచభూతలన్నీ ఏకమై కూడా ప్రేమ గెలిపిస్తాయి. ప్రేమను నిలబెడతాయి. అదే నేను నమ్మే సిద్దాంతం.

English summary

My story My Dream Boy Proposed To Me And Then Blocked Me Out Of His Life

My story My Dream Boy Proposed To Me And Then Blocked Me Out Of His Life