ఏంటి? మీది వన్ సైడ్ లవ్ నా?

By: Deepti
Subscribe to Boldsky

ప్రేమలో పడటం అదృష్టం అయినా, వన్ సైడ్ లవ్లో ఉండటం బాధాకరం! ప్రారంభదశలలో మాత్రమే ఈ రకం ప్రేమ ఆనందం కలిగిస్తుంది కానీ తర్వాత నిరాశను మిగులుస్తుంది.

మీరు అతనికి ఎంత దగ్గరవ్వటానికి ప్రయత్నిస్తే, అతను అంత అపరిచితుడిలా మిమ్మల్ని దూరం పెడుతుంటాడు. మీ కథ ఎంతకీ ముందుకు సాగక అక్కడే ఉండిపోతుంది.

ఏదో ఒకరోజు, ఎడారిలో బావి తవ్వుతున్నారని మీకు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడే తెలివిగా వ్యవహరించి, ఇదంతా మర్చిపోయి నిజమైన ప్రేమను జీవితంలో కనుగొంటారు.

అమ్మాయిలు పైకి చెప్పనివి,కానీ కోరుకునేవి ఏమిటి

ఇదిగో, ఒకవైపు ప్రేమను ఎలా తెలుసుకోవాలో, అర్థం చేసుకోవాలో తెలిపే కొన్ని సంకేతాలను ఇక్కడ మీకోసం అందించాం. ఇవి కన్పిస్తే మీరు త్వరగా ప్రేమను మరోచోట వెతుక్కోవటం మంచిది.

#1

#1

ఆన్ లైన్ అయినా, నిజజీవితంలో అయినా, మీరు అతన్ని లేదా ఆమెను వెంబడిస్తూనే ఉంటారు. అతని ఆన్ లైన్ ప్రొఫైల్, స్నేహితులు ఎవరెవరో అన్నీ తెలుసుకుంటూ ఉంటారు.

#2

#2

ప్రతి అర్థరాత్రి అతని ఆన్ లైన్ స్థితిని చూస్తూనే ఉంటారు. ఆ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోతూనే ఉంటారు! ఏడవాలనిపిస్తుంది! మీరు అతనిపై ప్రేమలో వున్నా, అతను మీగురించి ఆలోచించట్లేదని తెలపటానికి ఇదే పెద్ద సంకేతం.

#3

#3

ప్రతి రాత్రి దిండును హత్తుకుని దాన్నే అతనిలా ఊహించుకుంటూ గంటలు గంటలు నిద్రలేకుండా గడుపుతారు. రోజంతా పగటి కలలు!

మీ రాశి ప్రకారం ప్రేమలో పడినప్పుడు ఎలా నడుచుకుంటారో తెలుసుకోండి

#4

#4

అతని మిత్రులెవరైనా మీకు కన్పిస్తే అతని గురించి తప్పక అడుగుతూనే ఉంటారు. వారు చెప్పే అరకొర జవాబులతో మీకు మరింత ఆరాటం పెరిగిపోతుంది!

#5

#5

అతనికి మెసేజ్ చేస్తే అతను పట్టించుకోడు. ఇప్పుడే కాదు, అసలు మీ మెసేజ్ లు వేటికీ అతను జవాబులివ్వడు. మిగతావారితో మాట్లాడుతూ మీతో నిర్లక్ష్యంగా ఉండటంతో, మీకు బాధనిపిస్తుంది.

#6

#6

అతని తిరస్కారం తర్వాత కూడా, ఏదో ఒకరోజు అతను తిరిగొస్తాడని ఆశిస్తారు. అతనేదో మీ ఆస్తి అని మీ మనస్సులో మీరు నిర్ణయించేసుకుంటారు.

అమ్మాయిలూ గిటారు వాయించే అబ్బాయిలనే ఎందుకు ప్రేమిస్తారు?

#7

#7

అతను మీకు ఎన్నడూ కాల్ చేయడు. మీరు చేసినా, ఏవో సాకులు చెప్తాడు. అందువల్ల మీకు ఎప్పుడూ బాధ తప్పదు. మీరంత సంతోషాన్ని అతను ఎప్పటికీ మీతో పంచుకోడు. మీరు ఎందుకని ఆశ్చర్యపోతారు.

ఇదిగో ఇవే మీరంటే ఇష్టంలేని అబ్బాయిపై మీరు సమయం వృధా చేస్తున్నారనటానికి సంకేతాలు. ఇప్పుడైనా మీ వన్ సైడ్ లవ్ వదిలేసి సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టండి!

English summary

Signs You Are In One-Sided Love

Being in love is bliss but being in one-sided love is a pain! Here are some signs you are in one sided love.
Story first published: Saturday, July 1, 2017, 12:00 [IST]
Subscribe Newsletter