For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాటింగ్‌తో అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి సింపుల్ టిప్స్!

చాటింగ్‌తో అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి సింపుల్ టిప్స్! ఇప్పుడు తెలుసుకుందాం.

By Mallikarjuna
|

అబ్బాయిలకు ఏదైనా కష్టమైన పనంటే అది.. అమ్మాయిని ఇంప్రెస్ చేయడమే కదూ. గర్ల్స్‌ను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అమ్మాయిని ఎంతగా ప్రేమించినా.. తనతో పరిచయం ఎలా పెంచుకోవాలో తెలియక కొందరు తెగ ఇబ్బంది పడుతుంటారు. ఎలాగోలా కష్టపడి సోషల్ మీడియాలో ఫ్రెండ్ అయ్యాక లేదా ఫోన్ నంబర్ పట్టేశాక.. చాటింగ్ మొదలు పెట్టాలంటే కిందా మీద పడుతుంటారు.

కానీ నేరుగా మాట్లాడటం కంటే.. చాటింగ్ ద్వారానే తనకు దగ్గరవడం తేలిక. ఆన్‌లైన్‌లో పరిచయంతోనే ప్రేమ పట్టాలెక్కిన జంటలే దీనికి చక్కటి ఉదాహరణ. చాటింగ్‌తోనే అమ్మాయికి తనంటే సదాభిప్రాయం కలిగేలా చేస్తే.. తన మనసు గెలవడం పెద్ద కష్టమేం కాదు. మరి అమ్మాయిని ఇంప్రెస్ చేసేలా చాటింగ్ ఎలా చేయాలి? మెల్లగా తనకు ఎలా ప్రపోజ్ చేయాలంటే..

మీ ప్రొఫైల్ ఆసక్తికరంగా ఉండాలి:

మీ ప్రొఫైల్ ఆసక్తికరంగా ఉండాలి:

అమ్మాయిని ప్రేమలోకి దింపడానికి చాలా మంది ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ ద్వారా చాటింగ్ చేస్తుంటారు. ఇలా తనతో చాటింగ్ ప్రారంభించడానికి ముందు మీ ప్రొఫైల్ ఆసక్తికరంగా ఉండేలా చూసుకోండి. వాట్సాప్‌లో చాట్ చేస్తున్నట్లయితే చక్కటి ఫొటోను డీపీగా ఉంచండి. స్టాటస్ కూడా మీదైన స్టయిల్లో ప్రత్యేకంగా ఉండేలా చూస్కోండి. ఫేస్‌బుక్ ద్వారా చాటింగ్ చేయాలనుకుంటే.. తనకు నచ్చే సెలబ్రిటీల పోస్టులకు లైక్ కొట్టండి, షేర్ చేయండి. సామాజిక సమస్యలపై స్పందించండి.

తనెంటో అర్థం చేసుకోవాలి:

తనెంటో అర్థం చేసుకోవాలి:

చాటింగ్ మొదలెట్టడానికి ముందు.. తన ప్రొఫైల్, షేర్ చేసిన ఫొటోలు, డెయిలీ స్టేటస్‌ను పరిశీలించండి. తనను అర్థం చేసుకోవడానికి, తనకు ఏమేం ఇష్టమో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వాట్సాప్‌లో అయితే స్టాటస్ ద్వారా తనెలాంటి అమ్మాయో, తన ఇష్టాయిష్టాలేంటో ఓ అంచనాకు రావచ్చు.

ఆమె ఆన్ లైన్ ఉన్నప్పుడు మీరు కూడా ఆన్ లైన్ ఉండాలి:

ఆమె ఆన్ లైన్ ఉన్నప్పుడు మీరు కూడా ఆన్ లైన్ ఉండాలి:

జియో పుణ్యామని ఇప్పుడు అందరూ ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే ఉంటున్నారు కానీ.. కొందరు మాత్రం బయట కూడా బతికేస్తున్నారు. తను ఆన్‌లైన్లో ఉన్నప్పుడు మీరు కూడా ఆన్‌లైన్లో ఉండండి. కొద్ది రోజులు తన ప్రొఫైల్‌ను జాగ్రత్తగా గమనిస్తే.. ఏ టైంలో ఆన్‌లైన్లో ఉంటుందనే విషయంలో క్లారిటీ వస్తుంది. ఫేస్‌బుక్‌లో తను లైక్ చేసిన లేదా షేర్ చేసిన వాటికి మీరు కూడా లైక్ కొట్టండి. తనకు ఇష్టపడేలా.. వాట్సాప్ స్టేటస్‌లు మార్చుతుండండి. తద్వారా మీ ఇద్దరి మధ్య కొన్ని విషయాలు కామన్‌గా ఉన్నాయని తను భావిస్తుంది.

హాయ్‌తో కాకుండా వెరైటీగా మొదలు పెట్టండి..

హాయ్‌తో కాకుండా వెరైటీగా మొదలు పెట్టండి..

తొలిసారి తనను ఆన్‌లైన్లో పలకరించేటప్పుడు సాదాసీదాగా ‘హాయ్' అని మెసేజ్ పంపకండి.

"ఈప్రపంచంలో అత్యంత బిజీపర్సన్ అయిన మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా, జస్ట్ హాయ్ చెప్పడానికి..."

"హాలో..గార్జియస్, డిపిలో చాలా బ్యూటిఫుల్ గా కనబడుతున్నావు"

"హాయ్, నేను మీ గురించి కొంచెం మాట్లాడవచ్చా..." ఇలాంటి మెసేజ్‌లు పంపండి. ఇలా చేస్తే తను వెంటనే బదులిస్తుంది. మాటలు కలపడం కోసం.. ఆమె బదులిచ్చేలా ఏదైనా అడగండి.

ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్..

ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్..

ఆన్‌లైన్లో పలకరింతలు పూర్తయ్యాక.. తర్వాతి స్టెప్ వేయండి. మీ హాబీలేంటి, ఏమంటే ఇష్టం, నచ్చిన సినిమా, హీరో.. ఇలా తన గురించి మెల్లగా అడిగి తెలుసుకోండి. తన గురించి తాను చెబుతుంటే వినండి. తద్వారా తన గురించి మీరు మరింతగా తెలుసుకోవచ్చు.

అలా చేయొద్దు..చాటింగ్ మ్యానర్స్ తెలిసుండాలి:

అలా చేయొద్దు..చాటింగ్ మ్యానర్స్ తెలిసుండాలి:

చాటింగ్ చేస్తోంది కదా అని.. ఒక్కసారిగా మెసేజీలు గుమ్మరించొద్దు. మీరు ఒక మెసేజ్ పంపాక తను బదులివ్వకపోతే.. తను బిజీగా ఉందని అర్థం. ఆమె తిరిగి రిప్లై ఇచ్చే వరకూ కాస్త ఓపిక పట్టండి. అలా కాకుండా అదే పనిగా మెసేజ్‌లు పంపుతుంటే అమ్మాయిలకు ఇష్టం ఉండదు. మీ కోసం లాంగ్ మెసేజ్‌లను టైప్ చేస్తున్నప్పుడు.. ఆమె టైపింగ్ పూర్తయ్యే వరకూ ఓపిగ్గా ఉండండి. తనను నవ్వించేలా చాట్ చేయండి. స్మైలీ ఎమోజీలు వాడండి. చాటింగ్ బోర్‌గా ఫీలవకుండా.. అప్పుడప్పుడు జోకులు పేల్చండి.

చాటింగ్ చేశాక.. సడెన్‌గా..

చాటింగ్ చేశాక.. సడెన్‌గా..

నెల రోజులపాటు తనతో రెగ్యులర్‌గా చాట్ చేశాక.. ఒకట్రెండు రోజులు ఉద్దేశపూర్వకంగానే చాటింగ్ ఆపేయండి. తను మిమ్మల్ని మిస్ అవుతుందో లేదో తెలుసుకోవచ్చు. మీ ఇద్దరి మధ్యా బంధం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. మీరు చాటింగ్ చేయని టైంలోనూ.. తను మీకు మెసేజ్‌లు పంపిస్తుందంటే మీరు సరైన ట్రాక్‌లోనే వెళ్తున్నట్లు. లేదంటే తనను ఇంప్రెస్ చేయడానికి ఇంకా కష్టపడాలి.

వీడియో చాట్ మొదలుపెట్టండి:

వీడియో చాట్ మొదలుపెట్టండి:

మీతో చాటింగ్ చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని భావిస్తే.. మీకు తనను చూడాలని ఉందని చెప్పండి. వీడియో చాటింగ్‌కు ఇన్వైట్ చేయండి. తనకు మీరంటే నిజంగానే ఇష్టమే లేదా టైంపాస్ కోసం చాటింగ్ చేస్తుందా అనే విషయం తెలిసిపోతుంది. రోజంతా పని చేసి తను డల్‌గా ఉందనిపిస్తే.. కేరింగ్‌గా ఉండండి.

ఫస్ట్ డేట్:

ఫస్ట్ డేట్:

తనను నేరుగా కలిసి మాట్లాడటానికి ప్రయత్నించండి. ఖరీదైన రెస్టారెంట్‌కే వెళ్లాల్సిన పని లేదు.. బయటకెళ్లి కాఫీ తాగండి లేదా లంచ్ చేయండి. తనకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేయొచ్చు. కాకపోతే అది మరీ ఖరీదైంది కాకుండా చూసుకోండి. వారానికి ఓసారి లేదా రెండు వారాలకు ఓసారి ఇలా కలిసేందుకు ప్రయత్నించండి.

ప్రపోజ్ చేయండి:

ప్రపోజ్ చేయండి:

మూడు నాలుగు సార్లు కలిశాక.. తనకు మీరంటే ఇష్టమో లేదో ఓ అంచనాకు రావడం పెద్ద కష్టమేం కాదు. తనకు మీరంటే ఇష్టమే అని భావిస్తే.. హుందాగా మీ ఫీలింగ్స్‌ను తనతో షేర్ చేస్కోండి. తను మీతో చాలా టైం గడిపింది, మిమ్మల్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించింది కాబట్టి.. నో చెప్పేందుకు అవకాశాలు తక్కువే. ఒకవేళ తను నో చెప్పినా.. ఫ్రెండ్స్‌గా ఉందామని అడగండి. తనను ఇంప్రెస్ చేయడానికి మార్గాలు మూసుకుపోకుండా చూసుకోండి. ఇన్ని దశల్లో.. మధ్యలోనే తను మీ చాటింగ్‌ను, మిమ్మల్ని పట్టించుకోవడం మానేస్తే.. తను మీకు సరిపడదని లైట్ తీస్కోండి.

English summary

Tips to Impress a Girl on Chat

Impressing a girl is the most difficult task to do for a boy and if you are in touch with her only through chatting it seems impossible to impress her.
Story first published:Friday, November 17, 2017, 17:24 [IST]
Desktop Bottom Promotion