Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
ప్రేమను వ్యక్తపరిచేందుకు సరైన సమయం ఏది?
ప్రేమ గురించి మీరు ఏమనుకుంటే అదే నిజమని నమ్మండి. చాలా మంది ప్రేమలో పడతారు, బయటకు వస్తారు. వారి ఉద్దేశంలో ప్రేమకున్న అర్థం వేరే కావొచ్చు. ప్రేమను ప్రపోజ్ చేసే సమయం జీవితంలో ఒక పండుగ లాంటిది. ఈ పండుగ ఒక తీయని వేడుకలా మారేలా చేసుకోవడంలో మీ వంతుదే కీలక పాత్ర.
లవ్‌లో చాలా మంది బ్రేకప్‌ల గురించి వినుంటాం, చూసుంటాం. ప్రేమ ఇంత గొప్పదా అనిపిస్తుంటుంది. మనం చిన్నప్పుడు క్యూపిడ్ అనే ప్రేమ దేవుడు ప్రేమ బాణాలను ఎవరి పైకేతే సంధించి వేస్తాడో వారికి ప్రేమ కలుగుతుందని. అయితే ఇదంతా నిజం కావొచ్చు, అయితే ఇప్పుడు మనం ప్రేమను ఏయే సందర్భాల్లో వ్యక్తపరచాలో ఏయే సందర్భాల్లో చేయకూడదో తెలుసుకుందాం.

కొన్ని నెలలు ఆగండి
ఎవరితోనైనా స్నేహంగా ఉన్నప్పుడు అది ప్రేమగా మారి వారికి తెలియజేయాలనుకున్నప్పుడు కొన్ని నెలలు ఆగితే బాగుంటుంది. ఐ లవ్ యూ అనే ఆ మాట చెప్పేముందు మీ బంధంలో ఉన్న దగ్గరితనాన్ని, దూరాలను అంచనా వేసుకోవాలి. ఇతరుల మనసులో మీకు తగిన స్థానం ఉందని గట్టిగా నమ్మితేనే ప్రేమిస్తున్నాననే విషయం చెప్పాలి. అలా కాకుండా హడావిడిగా చెబితే వాళ్లు మీకు నో చెబితే మీ మనసు గాయపడవచ్చు.

సరైన సమయం
మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు సరైన సమయం కోసం ఎదురుచూడండి. అన్ని సమయాలు ప్రేమ ప్రపోజల్‌కు మంచిది కాదు. మనకు నచ్చినవారు స్థిమితంగా లేనప్పుడు, వారు బాధల్లో ఉన్నప్పుడు అస్సలు ప్రేమను వ్యక్తపర్చవద్దు. మనం అలాంటి సమయాల్లో మన ప్రేమను తెలియజేస్తే వాళ్లు మరింత ఒత్తిడికి గురయ్యేందుకు అవకాశం ఉంది. వాళ్లను మరింత బాధపెట్టినవాళ్లమవుతాం. మనం ప్రేమించిన వ్యక్తి మంచి మూడ్‌లో ఉండగా లేదా సంతోషంగా ఉన్నప్పుడు, ఆలోచనలు స్థిరంగా ఉన్నప్పుడే ప్రపోజ్ చేయడం అన్ని విధాలా మంచిది.

నిజంగా ప్రేమిస్తేనే..
ఏదో ఐలవ్‌యూ చెప్పడం ఫ్యాషన్ అని.. ప్రేమించడం ఇప్పుడొక ట్రెండ్‌గా మారిందని చెప్పి మీకు ఇష్టమైన వాళ్లకు ప్రేమిస్తున్నానని చెప్పకండి. ప్రేమ చాలా విలువైనది. మీరు నిజంగా ప్రేమిస్తున్నానని నమ్మితేనే ఆ విషయాన్ని తెలియజేయండి. కొందరు అమ్మాయిలు అబ్బాయిల సిక్స్‌ప్యాక్ బాడీ చూసి పడిపోతారు. మరి కొంత మంది అబ్బాయిలు అమ్మాయిల పొడవాటి కురులు, అందమైన మొహం చూసి పడిపోతారు. ఇది ఆకర్షణ కావొచ్చు. ప్రేమ అంటే పవిత్రమైనది. మీ మనసుకు నిజంగా ఆ భావన కలిగినప్పుడే మీ ప్రేమను వ్యక్తపర్చండి.

మత్తు మందులో అస్సలు వద్దు
చాలా మంది మగవాళ్లు బాగా తాగినప్పుడే తమకు ఇష్టమైనవారికి లవ్ ప్రపోజ్ చేస్తారట. తాగిన మైకంలో నడవడమే సరిగా రాదు. అలాంటప్పుడు ప్రేమ లాంటి కీలక విషయాలను ఎలా చెప్పగలం. మీరే ఆలోచించండి. మీరు ప్రశాంతంగా, స్థిమితంగా ఉన్న సమయంలోనే ప్రేమను వ్యక్తపర్చండి. మొదటగా తాగి ప్రపోజ్ చేయడం అంతగా కరెక్ట్ కాదు. ఇంక రెండో విషయం అలా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు ఫూల్ చేసుకున్నట్టే లెక్క. తాగినప్పుడు భావోద్వేగలు పీక్ స్టేజ్‌లో ఉంటాయి. వాటిని అప్పుడే వ్యక్తపర్చకుండా మరుసటి రోజు ఉదయం వరకు ఉంచుకోండి.
ప్రేమలో వేలల్లో ఒకరిని ఎంచుకుంటాం. నిజమైన భాగస్వామి కనిపిస్తే మనలో అలజడి అనేది ఉండదు. సరైన వ్యక్తి అతడే లేదా ఆమె అని నమ్మినప్పుడు ప్రేమ వ్యక్తపరిచే విషయంలో స్పష్టత వస్తుంది. మన లవ్ స్టోరీ సక్సెస్ కావాలంటే ప్రేమ ప్రపోజల్ చాలా కీలక ఘట్టం. మరి మీరూ ఎవరినైనా ప్రేమిస్తే పైన చెప్పినవన్నీ పాటిస్తారు కదూ!



Click it and Unblock the Notifications