For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రేక‌ప్ త‌ర్వాత మాజీ ప్రియుడ్ని క‌లిసే అవ‌కాశం వ‌స్తే ఏం చేస్తారు?

By Sujeeth Kumar
|

బ్రేక‌ప్ యుద్ధ రంగానికేమీ తీసిపోదు. తీపి, చేదు జ్ఞాప‌కాల‌న్నీ మ‌ర్చిపోయి మ‌న భావోద్వేగాల‌తో పోరాటం చేయాల్సి ఉంటుంది. సాధార‌ణ జీవితానికి వ‌చ్చేందుకు అంత సులువేవీ కాదు. సంద‌ర్భాలు, మ‌నుషులు స‌మ‌యానికి త‌గ్గ‌ట్టు మారిపోతుంటారు. బ్రేక‌ప్ త‌ర్వాత సంబంధంలో ఏం త‌ప్పు జ‌రిగి ఉంటుంద‌ని ఆలోచిస్తూ ఉంటాం. ఒక వేళ అలా జ‌రిగి ఉండ‌క‌పోతే ఏం అయి ఉండేది. ఒక వేళ మ‌ళ్లీ ఆ చాన్స్ వ‌స్తే మాజీ భాగ‌స్వామితో పొర‌పాటును ఎలా స‌రిద్ధిద్దుకునేవాళ్లం అనే ఆలోచ‌న‌లు చుట్టుముడుతుంటాయి. బ్రేక‌ప్ అయిన కొంద‌రిని వారి అనుభ‌వాలను అడిగి తెలుసుకున్నాం. ఒక వేళ మ‌ళ్లీ వారి జీవిత భాగ‌స్వామిని క‌లిసే అవ‌కాశం వ‌స్తే ఏం చెప్పుకుంటారు అని అడిగాం. వారు చెప్పిన స‌మాధానాలివిగో...

నేను ఒక అబ్బాయితో 4 నెల‌ల పాటు డేటింగ్ చేశాను.

నేను ఒక అబ్బాయితో 4 నెల‌ల పాటు డేటింగ్ చేశాను.

నేను ఒక అబ్బాయితో 4 నెల‌ల పాటు డేటింగ్ చేశాను. ఆ స‌మ‌యాన్ని నా జీవితంలో మ‌ర్చిపోలేను. అత‌డికి యూర‌ప్‌లో త‌న క‌ల‌ల ఉద్యోగం వ‌చ్చింది. దూర‌పు సంబంధాల‌పైన అత‌డికి న‌మ్మ‌కం లేదు. అందుకే మేమిద్ద‌రం విడిపోవాల్సి వ‌చ్చింది. అత‌డి కెరీర్ ప‌ట్ల నాకు సంతోషంగా ఉన్నా మ‌ళ్లీ చాన్స్ వ‌స్తే మ‌న దేశానికి వ‌చ్చి నన్ను పెళ్లి చేసుకోమ‌ని బ్ర‌తిమిలాడాల‌నిపిస్తుంది.

మా ఇధ్ద‌రి బ్రేక‌ప్ అయి సంవ‌త్స‌రం గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ నేను కోలుకోలేక‌పోతున్నాను.

మా ఇధ్ద‌రి బ్రేక‌ప్ అయి సంవ‌త్స‌రం గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ నేను కోలుకోలేక‌పోతున్నాను.

మా ఇధ్ద‌రి బ్రేక‌ప్ అయి సంవ‌త్స‌రం గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ నేను కోలుకోలేక‌పోతున్నాను. నా మాజీ భాగ‌స్వామికి గ‌తేడాది వివాహమైంది. కానీ ఏదో జీవితం అలా గ‌డిచిపోతుంది. ఒక్కోసారి అనిపిస్తుంటుంది. త‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లి త‌న‌ను ఇప్ప‌టికీ ప్రేమిస్తున్నాను అని చెబుదామ‌నుకుంటాను. అయితే అలా చేయ‌డం మా ఇద్ద‌రికీ మంచిది కాదు అని తెలుసు. కొన్ని విష‌యాలు అలా వ‌దిలేయ‌డ‌మే మంచిది.

సంబంధంలో 6 ఏళ్ల పాటు కొన‌సాగిన‌ప్పుడు

సంబంధంలో 6 ఏళ్ల పాటు కొన‌సాగిన‌ప్పుడు

సంబంధంలో 6 ఏళ్ల పాటు కొన‌సాగిన‌ప్పుడు ఇక మా ఇద్ద‌రికీ ప‌డ‌ద‌ని చివ‌రికి బ్రేక‌ప్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక నెల అవుతోంది .. ప్ర‌తి రోజు త‌న‌ను మిస్ అవుతున్నాను. ఇప్ప‌టికీ ఎవ‌రితోనైనా డేటింగ్‌కు వెళ్లినా, స్నేహితుల‌తో బ‌య‌ట‌కు వెళ్లినా ఏం చేసినా త‌ను ప‌క్క‌న ఉంటే బాగుంటుంద‌నే ఫీలింగ్ క‌లుగుతుంటుంది. క‌నీసం ఒక్క రోజు త‌న‌తో గ‌డిపే చాన్స్ మ‌ళ్లీ రావాల‌ని కోరుకుంటున్నాను.

 ప్రేమ గుడ్డివారిని చేస్తుంది.

ప్రేమ గుడ్డివారిని చేస్తుంది.

నేనొక ఒక అబ్బాయితో డేటింగ్ చేశాను. అత‌డు చాలా స్వార్థ‌ప‌రుడు. న‌న్ను అవ‌స‌రానికి బాగా వాడుకున్నాడు. అయినా అత‌డి పైన ప్రేమ చావ‌లేదు. చివ‌రికి నా ఆత్మ గౌర‌వాన్ని కాపాడుకునేందుకు అత‌డికి బ్రేక‌ప్ చెప్పాను. ఒక వేళ అత‌డ్ని క‌లిసే అవ‌కాశం వ‌స్తే నా జీవితంలో చేసిన అత్యంత పెద్ద పొర‌పాటు అత‌డితో డేట్ చేయ‌డ‌మే అని చెప్పాల‌నిపిస్తుంది.

మా ఇద్ద‌రి అభిరుచులు వేరుగా ఉండేవి

మా ఇద్ద‌రి అభిరుచులు వేరుగా ఉండేవి

సంబంధంలో ఉండ‌టం వ‌ల్ల భాగస్వామి నుంచి ఏం కావాల‌న్న‌దాని గురించి స్ప‌ష్ట‌త వ‌చ్చింది. నేను డేటింగ్ చేసిన అబ్బాయి చాలా మంచివాడు. అయితే మా ఇద్ద‌రి అభిరుచులు వేరుగా ఉండేవి. మా ఇద్ద‌రి భావ‌న‌లు ఎప్పుడూ వేరుగా ఉండేవి. జీవితం ప‌ట్ల మా ఇద్ద‌రి అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉండేవి. అందుకే అత‌డి నుంచి విడిపోవ‌డ‌మే మంచిద‌ని పించింది.

అత‌డ్ని జీవితంలో క‌లిసుండ‌క‌పోతే బాగుండేది

అత‌డ్ని జీవితంలో క‌లిసుండ‌క‌పోతే బాగుండేది

నా మాజీ ప్రియుడు నాతో ఉన్న‌ప్పుడు ర‌క‌ర‌కాల వాగ్దానాలు చేసేవాడు. నేను విడిచి ఉండ‌ను, నువ్వే నా నిజ‌మైన ప్రేమ‌వి, మ‌నం ఒక రోజు పెళ్లి చేసుకుందాం. ఇలా ర‌క‌ర‌కాల మాట‌ల‌తో న‌న్ను వ‌శ‌ప‌ర్చుకునేవాడు. కొన్నేళ్ల త‌ర్వాత న‌న్ను అంత‌గా ప‌ట్టించుకోవ‌డం మానేశాడు. మేమిద్ద‌రం బ్రేక‌ప్ చెప్పుకున్నాం. ఇదే స‌రైన నిర్ణ‌యం అనిపించింది. త‌ప్పుడు వాగ్దానాలు చేసినందుకు అత‌డిపై కోపంగా ఉండేది. అయితే ఇప్ప‌టికీ అత‌డ్ని మిస్ అవుతున్నాను. ఒక్కోసారి అనిపిస్తుంటుంది.. అత‌డ్ని జీవితంలో క‌లిసుండ‌క‌పోతే బాగుండేద‌ని!

English summary

6 people reveal the secrets they want their ex-partner to know

Break ups are no less than a battlefield. We fight with our own emotions, try to forget all the sweet and bitter memories, and it’s no less than a challenge to bounce back to the normal life. Things, situations and people change with time, and everything is not in our control always. We all analyse what went wrong in the relationship after a break up, and come up with multiple ‘what if’ situations, right?
Story first published: Wednesday, February 21, 2018, 17:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more