For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రిన్స్ ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను.. చివరకు అలా చేశాడు - My Story #49

నాలాగా అతనికి చాలా మంది ప్రపోజ్ చేసి ఉంటారని నాకు తెలుసు. కానీ నాది మాత్రం చాలా సిన్సియర్ లవ్. అందరమ్మాయిల మాదిరిగా నేను టైమ్ పాస్ కోసం అతన్ని ప్రేమించలేదు. నేను అతన్ని ఎన్నో ఏళ్లుగా ఇష్టపడుతున్నాను.

|

ప్రిన్స్.. నాకు బస్సులో పరిచయం అయ్యారు. అతను నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు పదో తరగతిలో ఉండేవారు. స్కూల్ ఎస్ పీఎల్ గా అతను ఉండేవారు. రోజూ స్కూల్లో ప్రేయర్ చేయించేది అతనే. అబ్బో అతను అప్పట్లో స్కూల్ మొత్తానికి ఒక హీరో. నేనప్పుడు చాలా చిన్న పిల్లను. కానీ మా అక్కవాళ్లు, వాళ్ల ఫ్రెండ్స్, టెన్త్ క్లాస్ లో అప్పట్లో నాకు తెలిసిన అమ్మాయిలకు మాత్రం అతను రాజకుమారుడు.

అన్నింట్లో ఫస్ట్

అన్నింట్లో ఫస్ట్

చదువులోనూ, ఆటల్లోనూ అన్నింట్లోనే అతను ఫస్ట్. అందుకే అతనంటే అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు, ఉపాధ్యాయులకు కూడా చాలా గౌరవం. అలాంటి వ్యక్తి అప్పట్లో నాలాంటి వారికి పరిచయం కావడం కూడా చాలా కష్టం. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అతనికి ఉండేది.

అతన్ని చాలామంది మరిచిపోయారు

అతన్ని చాలామంది మరిచిపోయారు

పదో తరగతిలో మంచి మార్కులు సాధించాడు. కానీ అతను టెన్త్ తర్వాత ఏదో కారణాల వల్ల చదవలేదు. కొన్ని రోజులు ఇంటి దగ్గరే ఉన్నాడు. పదో తరగతి అయిపోయాక అతన్ని క్లాస్ మేట్స్ కూడా చాలామంది అతన్ని మరిచిపోయారు. కానీ నాకు మాత్రం గుర్తొన్నాడు. నేను అప్పటికి అతనికి ఎవ్వరో తెలియదు.

అతనూ స్టూడెంటే

అతనూ స్టూడెంటే

నేను డిగ్రీలో జాయినప్పుడు అతను కూడా అదే కాలేజీలో కనిపించాడు. లెక్చరర్ గా జాయినయ్యాడేమో అనుకున్నాను. కానీ అతను కూడా మా కాలేజీ స్టూడెంటే అని తెలిసింది. కానీ మా సీనియర్. నేను ఇంటర్ లో బైపీసీ తీసుకున్నాను కాబట్టి డిగ్రీలో బీఎస్సీ సైన్స్ స్ట్రీమ్ లో నేను ఉండేదాన్ని. కానీ అతను ఎంపీసీ చేశారు. అందుకే బీఎస్సీ మ్యాథ్స్ చేస్తున్నాడు.

మిస్ కాకూడదనుకున్నా

మిస్ కాకూడదనుకున్నా

స్కూల్లో నేను అతన్ని పరిచయం చేసుకోవాలనుకున్నాను. కానీ మిస్ అయిపోయాను. ఇప్పుడు మాత్రం కచ్చితంగా పరిచయం చేసుకోవాలనుకున్నాను. కానీ నాకు చాలా రోజుల వరకు ఛాన్స్ రాలేదు.

ప్రిన్స్ సీటు ఇచ్చాడు

ప్రిన్స్ సీటు ఇచ్చాడు

మా కాలేజీ సిటీలో ఉండేది. నేను రోజూ మా ఊరి నుంచి బస్సులో పక్కనున్న సిటీకి వచ్చేదాన్ని. ఒక రోజు మా స్టేజి దగ్గర బస్సు ఎక్కడానికి అని వెయిట్ చేస్తున్నాను. అప్పటికే బస్ మొత్తం ఫుల్ అయిపోయింది. నేను కూర్చొడానికి నాకు సీటు దొరకలేదు. ప్రిన్స్ నాకు కూర్చొడానికి సీటు ఇచ్చాడు. నేను వెళ్లి కూర్చొన్నాను. అతని లేచి నిలబడ్డాడు. అప్పటి వరకు నేను ఎవరనేది అతనికి తెలియదు. నాకు మాత్రం అతను ఎవరో నాకు తెలుసు.

మరుసటి రోజు కూడా

మరుసటి రోజు కూడా

అతనికి థ్యాంక్స్ చెప్పాను. అతను బస్ దిగాక ఒంటిరిగా వెళ్తున్నాడు. వెళ్లి పలకరిద్దాం అనుకున్నాను. కానీ ధైర్యం చాలలేదు. మరుసటి రోజు బస్ లో నా కోసం సీటు పెట్టాడు. లేడీస్ సీట్లలో ఒక అమ్మాయి పక్కనే నాకోసం సీటు ఉంచాడు. మాది లాస్ట్ స్టేజీ. మా స్టేజీ దగ్గరకు వచ్చే సరికి బస్ రోజూ ఫుల్ అవుతుంది. అందువల్ల నేను రోజూ నిలబడే వెళ్లాల్సి వచ్చేది.

ఫ్రీ టైమ్ అంతా అతనితోనే

ఫ్రీ టైమ్ అంతా అతనితోనే

అలా నా కోసం బస్ లో సీటు తీసిపెట్టడం మొదలైనప్పటి నుంచి అతనితో పరిచయం పెరిగింది. స్నేహం పెరిగింది. రోజూ బాగా మాట్లాడుకునే వాళ్లం. కాలేజీలో ఏమాత్రం ఫ్రీ టైమ్ దొరికినా కూడా ఇద్దరం బాగా మాట్లాడుకునేవాళ్లం.

పెద్దవాడు అయినా నాకు బాగా ఇష్టం

పెద్దవాడు అయినా నాకు బాగా ఇష్టం

నాకు స్టడీస్ పరంగా కూడా బాగా హెల్ప్ చేసేవాడు. నాకు కావాల్సిన స్డడీ మెటీరియల్ మొత్తం కూడా అతని ఫ్రెండ్స్ నుంచి తీసుకొచ్చి ఇచ్చేవాడు. నాకు ప్రతి విషయంలో బాగా సహాయం చేసేవాడు. అతను ఏజ్ లో నాకన్నా చాలా పెద్దవాడు. అయినా అతనంటే నాకు కాస్త ఇష్టం పెరిగింది. అది ప్రేమగా మారింది.

కలల రాకుమారుడు

కలల రాకుమారుడు

నా ప్రేమ విషయం అతనితో చెబుదామనుకున్నాను. అలాగే అతని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాను. ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడు అతను. అతన్ని దక్కించుకోవడం నాకు లక్ గా నేను భావించాను.

రిజెక్ట్ చేస్తే నేను తట్టుకోలేను

రిజెక్ట్ చేస్తే నేను తట్టుకోలేను

అయితే అతనికి ఆ విషయం నేరుగా చెప్పే ధైర్యం నాకు లేదు. చాలా రోజులు వెయిట్ చేశాను. అతను నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని డౌట్ ఉండేది. నేను ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాత అతను నన్ను రిజెక్ట్ చేస్తే నేను తట్టుకోలేను. అందుకే నేను చాలా రోజుల వరకు నా ప్రేమను అతనితో చెప్పలేదు.

టైమ్ పాస్ కోసం కాదు కదా

టైమ్ పాస్ కోసం కాదు కదా

అయితే ఒక రోజు ఒపెన్ అయ్యాను. నా మనస్సులోని మాటను అతనికి చెప్పాను. అతను ఏమి చెప్పకుండా సైలెంట్ గా వెళ్లిపోయాడు. నాలాగా అతనికి చాలా మంది ప్రపోజ్ చేసి ఉంటారని నాకు తెలుసు. కానీ నాది మాత్రం చాలా సిన్సియర్ లవ్. అందరమ్మాయిల మాదిరిగా నేను టైమ్ పాస్ కోసం అతన్ని ప్రేమించలేదు. నేను అతన్ని ఎన్నో ఏళ్లుగా ఇష్టపడుతున్నాను.

నా గురించి పూర్తిగా తెలియదు

నా గురించి పూర్తిగా తెలియదు

కానీ అతని మనస్సులో ఏముందో నాకు తెలియలేదు. మరుసటి రోజూ మళ్లీ అడిగాను. కానీ అతను మాత్రం ఎలాంటి సమాధానం చెప్పలేదు. మళ్లీ అడిగాను. అప్పుడు కాసేపు మాట్లాడాడు. నన్ను చేసుకుంటే నువ్వు చాలా కష్టాలు భరించాల్సి వస్తుంది. నా గురించి నీకు పూర్తిగా తెలియదు.

నేను చాలా తేడా

నేను చాలా తేడా

నాకు నచ్చినట్లుగానే నేనుంటాను. ఒకరికోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకునే టైప్ కాదు. అందుకే నీ భవిష్యత్తుకు ఇబ్బంది ఏర్పడకుండా ఉండాలనే నేను నిన్ను లవ్ చేయడం లేదని చెప్పాడు. అయినా ఫర్వాలేదు.. నేను నిన్ను అర్థం చేసుకుంటానన్నాను. కానీ అతను నేను నీకు సూటవ్వను అని వెళ్లి పోయాడు.

బాగా అర్థం అయ్యింది

బాగా అర్థం అయ్యింది

అంతగా ప్రేమిస్తే జస్ట్ ఇంత క్యాజ్ వల్ గా సమాధానం ఇచ్చాడని చాలాసార్లు బాధ అనిపించింది. నేను చాలా డిప్రెషన్ కు లోనయ్యాను. కానీ ప్రేమలో పడితే మాత్రం ప్రతి దానికి రెడీగా ఉండాలనే విషయం నాకు అప్పుడు అర్థం అయ్యింది. మనం ఎంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తి మనల్ని కూడా ప్రేమిస్తారనుకోవడం పొరపాటు. వాళ్ల ఆలోచనలు వాళ్లకు ఉంటాయి.

అలాంటివి చేయొద్దు

అలాంటివి చేయొద్దు

వాళ్లకన్నా ఇంకా మంచి స్థాయిలో ఉన్నవాళ్లను, వాళ్లని ఇంకా బాగా అర్థం చేసుకునే వాళ్లని వారు ప్రేమించాలనుకుంటారు. బాగా ఒక వ్యక్తిని ప్రేమించి అతను వద్దంటే నిరుత్సాహానికి గురికావొద్దు. ఆత్మహత్యలు చేసుకోవడం, చదువుపైనే శ్రద్ధ పెట్టకుండా ఉండడంలాంటివి అస్సలు చేయొద్దు. ప్రేమలోకి దిగేముందు అన్నింటికీ రెడి అయి ప్రేమించడం మొదలుపెట్టండి. ప్రేమ విఫలం అయినా బాధపడకుండా ఉండేలా మీకు మీరు ధైర్యం తెచ్చుకోండి.

English summary

falling in love has taught me one thing you have to be ready for anything

falling in love has taught me one thing you have to be ready for anything
Story first published:Thursday, January 18, 2018, 13:00 [IST]
Desktop Bottom Promotion