అతనితో అప్పుడు బాగా ఎంజాయ్ చేశా.. ఇప్పుడు బాధపడుతున్నా - My Story #69

Written By:
Subscribe to Boldsky

ప్రతి అమ్మాయికి జీవితంలో ఒక్క లవ్ స్టోరీ అయినా ఉంటుంది. చాలామంది అమ్మాయిలకు పెళ్లికాకముందు ఒక ప్రేమ కథ కచ్చితంగా ఉంటుంది. లవ్ స్టోరీ లేకున్నా కనీసం ఒక అబ్బాయి అయినా ప్రపోజ్ చేసి ఉంటాడు. నాకు కూడా ఒక అబ్బాయి నేను డిగ్రీ చదివేటప్పుడు ప్రపోజ్ చేశాడు.

నేనంటే ఇష్టం అన్నాడు

నేనంటే ఇష్టం అన్నాడు

నేనంటే ఎంతో ఇష్టం అని చెప్పాడు. నన్ను ఎన్నో రోజులుగా నుంచి ప్రేమిస్తున్నానన్నాడు. అది కూడా ఫేర్ వెల్ పార్టీ అప్పుడు. మూడేళ్ల నుంచి అతను నన్ను ప్రేమించాడట. మరి మా ముక్క ముందే నాకు చెప్పి ఉంటే డిగ్రీలో ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లం కదా అన్నాను.

బాయ్ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎంజాయ్

బాయ్ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎంజాయ్

ఎందుకంటే నా ఫ్రెండ్స్ లో చాలా మందికి బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారు వాళ్లతో ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లు. నాకు మాత్రం ఒక్కరు కూడా ప్రపోజ్ చెయ్యలేదు. నాకు బాధగా ఉండేది. ఒక్కరైనా నన్ను ప్రేమిస్తున్నానని చెబుతారని నేను డిగ్రీ మొత్తం వెయిట్ చేశాను. చివరకు ఆ అబ్బాయి డిగ్రీ అయిపోటప్పుడు నాకు ప్రపోజ్ చేశాడు.

పెళ్లి చేసుకోవాలన్నుకున్నాం

పెళ్లి చేసుకోవాలన్నుకున్నాం

ఇద్దరం పీజీలో జాయినయ్యాం. ఇద్దరికీ ఒకే యూనివర్సీటిలో సీటు వచ్చింది. అక్కడ మేము మరింత క్లోజ్ అయ్యాం. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నేను కచ్చితంగా అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అయితే అతను మాత్రం కాస్త భయపడేవాడు.

చాలాసార్లు సెక్స్ లో

చాలాసార్లు సెక్స్ లో

ఇక వర్సీటిలో ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాం. ఎప్పుడు ఖాళీ దొరికినా ఇద్దరం బైక్ పై ఔటింగ్ కు వెళ్లేవాళ్లం. ఇక ఇద్దరం చాలా సార్లు సెక్స్ లో పాల్గొన్నాం. అయితే ఎలాంటి ఇబ్బంది రాకుండా కండోమ్స్ వాడేవాళ్లం. ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నామని నేను కూడా అతని అడిగిన ప్రతి దానికి ఒకే చెప్పేదాన్ని. ఆ రెండు మేము చేయని ఎంజాయ్ అంటూ లేదు.

అతను పట్టించుకునేవాడు కాదు

అతను పట్టించుకునేవాడు కాదు

చదువు పూర్తయ్యాక ఇద్దరం వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాం. అయినా రోజూ టచ్ లో ఉండేవాళ్లం. మన ప్రేమ గురించి మీ అమ్మానాన్నలతో చెప్పు అని నేను చాలా సార్లు అతనితో చెప్పేదాన్ని. కానీ అతను మాత్రం అస్సలు పట్టించుకునేవాడు కాదు. చెబుతానులే.. దానిదేముంది అనేవాడు.

తాగుతూ ఉండిపోయాడు

తాగుతూ ఉండిపోయాడు

రోజు తన తల్లిదండ్రుల దగ్గరకి నేరుగా తీసుకెళ్తాను వెయిట్ చెయ్యమని నన్ను బస్టాండ్ లో కూర్చొబెట్టాడు. అతను వస్తాడని అక్కడే చాలా సేపు కూర్చొన్నాను. అస్సలు రాలేదు. అసలు నేను వెయిట్ చేస్తున్నాననే విషయం కూడా మరిచిపోయి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటూ తాగుతూ ఉండిపోయాడు.

రిజిస్టర్ మ్యారేజ్ అన్నాడు

రిజిస్టర్ మ్యారేజ్ అన్నాడు

మా అమ్మనాన్నకు చెబితే వాళ్లు ఒప్పుకునేలా లేదు మరోసారి ఫిబ్రవరి 14న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని చెప్పి మోసం చేశాడు. నన్ను అలా అతను రెండు సార్లు మోసం చేశాడు. నేను అతనికి అన్నీ సమర్పించి అతనే సర్వంగా భావించినా కూడా అలా చెయ్యడంతో నాకు చాలా బాధ అనిపించింది.

నాతో గడుపుతావా అన్నాడు

నాతో గడుపుతావా అన్నాడు

తర్వాత నా కెరీర్ పై ఫోకస్ పెట్టాను. గవర్నమెంట్ జాబ్ కు ప్రిపేర్ అయితే ఉండేదాన్ని. మళ్లీ సడన్ గా ఒక రోజు నా రూమ్ కు వచ్చాడు. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. ఒక్కసారి స్టార్ట్ చేద్దామా అన్నాడు. నేను దానికి అస్సలు ఒప్పుకోలేదు.

టైమ్ పాస్ కోసం గడపం కదా

టైమ్ పాస్ కోసం గడపం కదా

ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకుంటాడని అన్నీ సమర్పిస్తుంది కానీ ఇలా టైమ్ పాస్ కోసం ఎవ్వరితోనూ గడపదని చెప్పాను. తర్వాత అతను నాపై కోప్పడుతూ వెళ్లిపోయాడు. అతను కేవలం నాతో ఎంజాయ్ చేయడం కోసమే నన్ను వాడుకున్నాడు.

చాలా సార్లు అందులో పాల్గొన్నాం

చాలా సార్లు అందులో పాల్గొన్నాం

నిజంగా అతనికి నాపై ప్రేమ ఉంటే కచ్చితంగా పెళ్లి చేసుకునేవాడు. నేను అతన్ని రోజూ అడుతున్నా కూడా పట్టించుకోకుండా ఉండడు.అతనితో నేను చాలా సార్లు సెక్స్ లో పాల్గొన్నాను. ఇద్దరం ఎంజాయ్ చేశాం. కానీ ఇప్పుడతను నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు.

అస్సలు ప్రేమించేదాన్ని కాదు

అస్సలు ప్రేమించేదాన్ని కాదు

ఇలాంటి వాడని తెలిసి ఉంటే అస్సలు ప్రేమించేదాన్ని కాదు. ఒకప్పుడు ఒకరైనా నాకు ప్రపోజ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఇప్పుడు మాత్రం అస్సలు లవ్ చేయడం మంచిది కాదు అనిపిస్తోంది. యవ్వనంలో ఉన్నప్పుడు ఏదేదో అనుభవించాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ కోరికలను నియంత్రించుకోగలగితేనే మంచిదని ఇప్పుడనిపిస్తుంది.

English summary

i believed the same person twice and both times i was blindsided by love

i believed the same person twice and both times i was blindsided by love
Story first published: Friday, February 2, 2018, 9:30 [IST]
Subscribe Newsletter