శృంగార ప్రపంచంలో తేలిపోయాం.. ఒకే రోజూ మూడు సార్లు పని కానిచ్చాం - My Story #80

Posted By:
Subscribe to Boldsky

ఒసేయ్.. ఇలా పిలిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అందులో మా కాలేజీలో నేనే అందమైన అమ్మాయిని. కానీ ఆ అబ్బాయి అప్పుడప్పుడు అలా కాలేజీలో నన్ను పిలిచేవాడు. అప్పుడు నాకు కోపం వచ్చేది కాదు. చాలా సంతోషంగా ఉండేది. అతని పేరు సూర్య.

సూర్య చాలా సహకరించారు

సూర్య చాలా సహకరించారు

నేను ఎంఏ ఇంగ్లిష్ చదివేటప్పుడు అతను నాకు పరిచయం.

నేను కాలేజీలో చేరగానే నాకు పరిచయం అయిన మొదటి వ్యక్తి అతనే. సూర్య నాకు కౌన్సెలింగ్ లో కూడా చాలా సహకరించారు. నా ర్యాంక్ కు యూనివర్సిటీలో సీటు వస్తుందో లేదోనని నేను బయపడుతూ కూర్చొన్నా.

ధైర్యం చెప్పాడు

ధైర్యం చెప్పాడు

అప్పుడు నా పక్కన ఉన్న ఆ అబ్బాయి ధైర్యం చెప్పాడు. నా ర్యాంక్, నా రిజర్వేషన్ కేటగిరి అన్ని చూసి నాకు కచ్చితంగా యూనివర్సిటీలో సీటు వస్తుందని చెప్పాడు. అతను చెప్పినట్లుగానే నాకు యూనివర్సిటీలో సీటు వచ్చింది. ఆ రోజు అతనికి థ్యాంక్స్ చెబుదామంటే అతను కనపడలేదు.

ఎంత వెతికానో తెలుసా

ఎంత వెతికానో తెలుసా

ఆ తర్వాత యూనివర్సిటీలో అతను ప్రత్యక్షమయ్యాడు. అతను కనపడగానే నాకు ఏదో తెలియని ఆనందం వచ్చింది. నీకోసం నేను ఎంత వెతికానో తెలుసా అన్నాను. థ్యాంక్ యూ అని అన్నాడు.

హీరో పాత్రలో ఊహించుకునేదాన్ని

హీరో పాత్రలో ఊహించుకునేదాన్ని

ఇక క్లాస్ లో ప్రొఫెసర్లు ఏ లెసెన్ చెప్పినా అందులో హీరో పాత్రలో నేను అతన్ని ఊహించుకునేదాన్ని. రోమియో జూలియట్ నావెల్ లో గురించి ప్రొఫెసర్ చెబుతుంటే ఆ రెండు పాత్రల్లో మా ఇద్దరినీ ఊహించుకునేదాన్ని. హ్యామ్లెట్, మాక్బెత్, ఒథెల్లో, మర్చంట్ ఆఫ్ వెనిస్, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ప్రతి లెసెన్ లో లవర్స్ పాత్రలను మొత్తం మా ఇద్దరినే ఊహించుకునేదాన్ని.

మొదటి సారి అతని నుంచి రెస్పాన్స్

మొదటి సారి అతని నుంచి రెస్పాన్స్

ఓసారి సీరియస్‌గా క్లాస్ లో లెసెన్ వింటున్నా. ఇంతలో నా వాట్సాప్ కు మెసేజ్ వచ్చింది. హాయ్‌ అని అతను పంపాడు. ఒక్కసారిగా షాక్‌ అయ్యాను. ఎందుకంటే అంతవరకు నేను ఒక్కదాన్నే ఏదో డ్రీమ్స్ లో అలా తేలిపోయేదాన్ని. మొదటి సారి అతని నుంచి రెస్పాన్స్ వచ్చేసరికి నాకు ఎక్కడలేని ఆనందం కలిగింది.

ఒంటిరిగా దొరికితే చాలు

ఒంటిరిగా దొరికితే చాలు

నాకు అబ్బాయిలతో మాట్లాడడం అంటే కాస్త భయం. కానీ అతను కొన్ని రోజుల తర్వాత నాతో బాగా కలిసిపోయాడు. నేను ఎప్పుడైనా ఒంటిరిగా దొరికితే చాలు ఆపకుండా గలగలా మాట్లాడేవాడు. కొన్ని రోజుల తర్వాత నాకు కూడా భయం పోయింది. నేను కూడా అతనితో మాట్లాడడం మొదలుపెట్టాను.

అన్నీ నాకు నచ్చాయి

అన్నీ నాకు నచ్చాయి

ఒక రోజు అతనితో కలిసి పర్సనల్ గా మాట్లాడాను. తన మాట, తన అభిప్రాయాలు, తన నవ్వు ఇలా అన్నీ నాకు నచ్చాయి.

క్లాసులో ప్రొఫెసర్ లెసెన్ చెబుతుంటే మేమిద్దరం చూపులతో మాట్లాడుకునేవాళ్లం. క్యాంటిన్ లో కలిసినప్పుడల్లా ఇద్దరం చాలా సేపు మాటల్లో మునిగితేలిపోయేవాళ్లం.

నరకంలా ఉండేది

నరకంలా ఉండేది

నేను అతన్ని ప్రేమిస్తున్నాని అర్థం అయ్యింది. ఇక హాలీడేస్ వచ్చినప్పుడు నాకు నరకంలా ఉండేది. మళ్లీ యూనివర్సీటీ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని రోజూ ఎదురు చూసేదాన్ని. నా ఫ్రెండ్స్ అందరికీ క్లాస్ కు వెళ్లాలంటే బద్ధకం.. నాకు మాత్రం చాలా ఉత్సాహంగా ఉండేది. ఉదయమే లేచి క్లాస్ కు రెడీ అయి వెళ్లేదాన్ని.

నాకు లవర్ ఉంది

నాకు లవర్ ఉంది

ఒక రోజు నా మనస్సులో మాటను చెప్పాలనుకున్నాను. నువ్వంటే ప్రాణం.. నేను నిన్నే పెళ్లి చేసుకుని జీవితాంతం నీతోనే గడుపుదాం అని అనుకుంటున్నాను అని చెప్పాను. అయితే అతను నాకు లవర్ ఉంది అన్నాడు. నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లుగా అనిపించింది.

వేరే అమ్మాయితో బంధం

వేరే అమ్మాయితో బంధం

మనం ఇద్దరం ఫ్రెండ్స్ గానే ఉందాం అన్నాడు. నేను తర్వాత రోజు నుంచి మాట్లాడడం మానేశాను. కానీ అతను బాధపడుతూ వచ్చి నువ్వు మాట్లాడకుండా ఉంటే నేను ఉండలేను అన్నాడు.ఒక ఫ్రెండ్ గా నాతో మాట్లాడు అన్నాడు. అయినా నేను అతనితో మాట్లాడలేదు. తనతో జీవితాంతం కలిసి ఉండాలనుకున్నాను. కానీ అతనికి వేరే అమ్మాయితో బంధం ఉందంటే నా మనస్సు ఎలా తట్టుకోగలుతుంది.

లవర్ మోసం చేసింది

లవర్ మోసం చేసింది

మొత్తానికి మా కోర్స్ పూర్తయింది. నేను ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా జాయినయ్యాను. అతను నెట్ కు ప్రిపేర్ అవుతున్నాడు. ఆ సమయంలో ఒక రోజు అతని నుంచి ఫోన్ వచ్చింది. మాట్లాడాను. తన లవర్ తనని మోసం చేసిందని.. ఒక అమ్మాయిని అంతగా నమ్మితే అలా మోసం చేసి చివరకు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని అన్నాడు.

బాగైంది వెదవకి.. ఇలాగే కావాలి

బాగైంది వెదవకి.. ఇలాగే కావాలి

మొదట నేను జాలి చూపించాను. కానీ మనస్సులో మాత్రం బాగైంది వెదవకి.. ఇలాగే కావాలి అనుకున్నాను. ఆ రోజు నాతో చాలా సేపు మాట్లాడాడు. మనుషులు దూరమైతేనే కదా మనుషుల విలువ తెలిసేది అనుకున్నాను. అయినా అతనితో ఉన్న గత అనుభవాలు ఒకవైపు నాకు గుర్తొస్తున్నాయి. ఇతను మళ్లీ నాకు హ్యాండ్ ఇస్తాడేమోనని అనిపించేది.

నువ్వే గుర్తొస్తావ్

నువ్వే గుర్తొస్తావ్

ఇక తర్వాత రోజూ నుంచి రోజూ ఫోన్లలో మాట్లాడుకోవడం, వాట్సాప్‌ లో ఛాటింగ్‌ చేయడం చేసేవాళ్లం. నాకు సంతోషం వచ్చినా.. బాధ కలిగినా ముందు నువ్వే గుర్తొస్తావ్ అనేవాడు. నీతో ప్రతి విషయం చెప్పాలనిపిస్తుంటుంది అనేవాడు. నీలాంటి వ్యక్తి నాకు జీవితంలో అస్సలు దొరకదు అనేవాడు. మొత్తానికి ఇద్దరం కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం నడిపాం.

నాపై ప్రేమను ఒలకబోశాడు

నాపై ప్రేమను ఒలకబోశాడు

ఒక రోజు అతని రూమ్ కి వెళ్లాను. ఆ రోజు అతను ఒక్కడే ఉన్నాడు. చాలా రోజుల తర్వాత కలిశాం కాబట్టి నాపై ప్రేమను ఒలకబోశాడు. ఎన్నో రోజుల నుంచి నేను అతని నుంచి ఆశించినది ఆ రోజు దక్కింది. నన్ను దగ్గరికి తీసుకున్నాడు. నాతో ఊసులాడాడు. నా తలను నిమిరాడు.

తప్పు చేయాలనుకున్నాం

తప్పు చేయాలనుకున్నాం

నన్ను ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. నేను సహకరించాను. తర్వాత ఇద్దరి మనస్సులు పెళ్లి కాకుండానే ఆ తప్పు చేయాలని భావించాయి. అందుకు నేను కూడా ఒకే అన్నాను. బయటి ప్రపంచాన్ని మొత్తం మరిచిపోయాం.

శృంగార ప్రపంచంలో తేలిపోయాం

శృంగార ప్రపంచంలో తేలిపోయాం

హాయిగా శృంగార ప్రపంచంలో తేలిపోయాం. ఒకే రోజూ మూడు సార్లు పని కానిచ్చాం. బాగా సంతృప్తి చెందాం. మా శృంగారంలో కలిగిన సంతృప్తి వేరు. అది ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ వ్యక్తపరిచేందుకు బాగా సహకరించింది. (ఇంకా ఉంది)

(మిగతాది #Mystory81లో చూడండి)

English summary

i think we understood each other very well now

i think we understood each other very well now. I felt our connection had a magical and a spiritual aspect in it.
Subscribe Newsletter