నీతో ఒక్కసారి గడపాలని ఉంది అన్నాను.. ఒకే అన్నాడు - My Story #66

Written By:
Subscribe to Boldsky

మాది కరీంనగర్. నా పేరు హర్షిత. నేను చిన్నప్పుడు ఒమన్ లో ఉండేదాన్ని. మా అమ్మనాన్నలు ఒమన్ దేశపు రాజధాని అయిన మస్కట్ లో పని చేసేవారు. బతుకుదెరువు కోసం మా కుటుంబం అక్కడికి వెళ్లింది. నన్ను ఒక్కదాన్ని ఇంటి దగ్గర విడిచిపెట్టడం ఇష్టం లేక నన్ను కూడా ఒమన్ తీసుకెళ్లారు.

మస్కట్ లోని చదివేదాన్ని

మస్కట్ లోని చదివేదాన్ని

ఒమన్లోని ఒక కంపెనీలో మా నాన్న పని చేసేవారు. ఆ మధ్య అది మూతపడటంతో మేము తిరిగి కరీంనగర్ కు వచ్చాం.

మస్కట్ లోని ఇండియన్ స్కూల్ లో నేను చదివేదాన్ని. నాకు స్కూల్ లో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. వారిలో కిరణ్ ఒకడు. అతనిది కూడా కరీంనగర్ కావడంతో ఇద్దరం బాగా పరిచయం అయ్యాం.

నువ్వే కొద్దిగా నోట్స్ రాసి ఇవ్వు

నువ్వే కొద్దిగా నోట్స్ రాసి ఇవ్వు

ఒక రోజు కిరణ్ స్కూల్ కు రాలేదు. నాకు ఏమి అర్థం కాలేదు. కిరణ్ వాళ్ల నాన్న మా నాన్నకు మంచి ఫ్రెండ్. సాయంత్రం ఆ అంకుల్ మా ఇంటికి వచ్చాడు. కిరణ్ చెయ్యి ఫ్యాక్చర్ అయ్యిందన్నాడు. కొన్ని రోజులు స్కూల్ కు రాలేడమ్మా.. నువ్వే కొద్దిగా నోట్స్ రాసి ఇవ్వు అని చెప్పాడు. తర్వాత నేను కిరణ్ వాళ్ల ఇంటికి వెళ్లాను.

నా మనస్సుకు నచ్చాడు

నా మనస్సుకు నచ్చాడు

కిరణ్ తో కొద్ది సేపు మాట్లాడాను. అతడు ఒక్కరోజు స్కూల్ కు రాకుంటేనే నాకు ఎలాగో అనిపించింది. తను అంతగా నా మనస్సుకు నచ్చాడు. అతను చాలా రోజుల వరకు స్కూల్ కు రాలేదు. అప్పుడు నాకు ప్రతి క్షణం ఏదో వెలితిగా ఉండేది. మొత్తానికి కొన్నాళ్ల తర్వాత అతను మళ్లీ స్కూల్ కు రావడం మొదలైంది.

చాలా బాధ అనిపించేది

చాలా బాధ అనిపించేది

నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అతనితో ఒక్క రోజూ మాట్లాడకున్నా నా మనస్సుకు చాలా బాధ అనిపించేది. తర్వాత మా ఫైనల్ పరీక్షలు పూర్తయ్యాయి. కొన్ని రోజులు సెలవులు ఇచ్చారు. సెలవుల్లో ప్రతి రోజూ నేను కిరణ్ తో చాలా సరదాగా గడిపేదాన్ని.

కిరణ్ తో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది

కిరణ్ తో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది

అయితే సెలవులు పూర్తయ్యాక తను మళ్లీ స్కూల్ కు రాలేదు. ఏం జరిగిందని తెలుసుకుంటే వాళ్ల నాన్నకు ఆరోగ్యం బాగాలేదని తెలిసింది. దాంతో వాళ్లు త్వరలోనే ఇండియా వెళ్తారని మా డ్యాడీ చెప్పాడు. కిరణ్ వాళ్లు మొత్తానికి ఇండియా వెళ్లిపోయారు. అప్పటి నుంచి కిరణ్ తో నా కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది. కానీ నాకు అతను ప్రతి రోజూ గుర్తొచ్చాడు.

అతనంటే చాలా ఇష్టం

అతనంటే చాలా ఇష్టం

అతనికి నేనంటే ఇష్టమో లేదో తెలియదుగానీ నాకు మాత్రం అతనంటే చాలా ఇష్టం. నాకు ఆ క్షణంలో ఒమన్ నుంచి ఇండియాకు వెళ్లి ఉంటే బాగుండేది అనిపించింది. కొన్నాళ్లకు కిరణ్ వాళ్ల నాన్న చనిపోయాడని తెలిసింది. మా కుటుంబం మొత్తం చాలా బాధపడింది. మరికొన్ని రోజులకు మా డ్యాడీ పని చేసే కంపెనీ మూతపడింది. దీంతో మేము ఒమన్ లో చాలా రోజులు చాలా ఇబ్బందులకు గురయ్యాం.

కరీంనగర్ లో చిన్న బిజినెస్

కరీంనగర్ లో చిన్న బిజినెస్

మా డ్యాడీకీ సాలరీ రాకపోవడం, జాబ్ కూడా లేకపోవడంతో చాలా కష్టాలు అనుభవించాం. తర్వాత మా డ్యాడీ కంపెనీలో పని చేసే వారంతా ఇండియాకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. మా డ్యాడీ కూడా నన్ను, అమ్మను తీసుకుని కరీంనగర్ కు వచ్చాడు. తర్వాత కరీంనగర్ లో చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు.

నా ఆలోచనంతా అతనిపైనే

నా ఆలోచనంతా అతనిపైనే

ఇప్పటికీ బిజినెస్ బాగానే రన్ అవుతోంది. కరీంనగర్ వచ్చేటప్పుడు నా ఆలోచనంతా కిరణ్ పైనే ఉంది. కిరణ్ ఇప్పుడు ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడనని నేను ప్రతిక్షణం గుర్తు తెచ్చుకునేదాన్ని. కానీ కలవాలంటే నాకు ఏ రూట్ లేదు. అందుకే ఒక ప్లాన్ వేశాను.

చూసొద్దామని చెప్పాను

చూసొద్దామని చెప్పాను

మా డ్యాడీకి కిరణ్ వాళ్లు ఎక్కడున్నారో.. పాపం ఎలాగున్నారో చూసొద్దామని చెప్పాను. నాన్న మొదట అంతగా పట్టించుకోలేదు. తర్వాత అమ్మ కూడా చెప్పడంతో వాళ్ల అడ్రస్ తెలుసుకున్నాడు. మేము కరీంనగర్ లో ఉంటాం. కిరణ్ వాళ్లది మాకు కొద్ది దగ్గర్లోనే ఒక పల్లెటూర్. వాళ్ల నాన్న చనిపోయాక వాళ్లు ఊర్లోనే ఉన్నారంట. కిరణ్ చదువుతూనే కుటుంబ బాధ్యతలు మొత్తం చూసుకుంటున్నాడట.

కాలేజీకి అని ఇంట్లో చెప్పి

కాలేజీకి అని ఇంట్లో చెప్పి

మొత్తానికి ఒక రోజు మా డ్యాడీ వెళ్లి కిరణ్ వాళ్లను పలకరించి వచ్చాడు. నేను మా డ్యాడీని అడిగి వాళ్లు ఎక్కడుంటారో కనుక్కోగలిగాను. అయితే మా డ్యాడీకి అర్థం కాకుండా కిరణ్ డిటేల్స్ సాధించాను. నేను కరీంనగర్ లోనే కాలేజీలో జాయినయ్యాను. ఒక రోజు కాలేజీకి అని ఇంట్లో చెప్పి ఉదయం క్లాస్ కు వెళ్లకుండా కిరణ్ వాళ్ల ఊరికి వెళ్లాను. కిరణ్ వాళ్ల నాన్న పేరు చెబితే ఆ ఊర్లో ఒక పెద్దాయన ఇంటికి దగ్గరకు తీసుకెళ్లాడు.

మా మెమోరీస్ మొత్తం గుర్తు చేసుకున్నాం

మా మెమోరీస్ మొత్తం గుర్తు చేసుకున్నాం

కిరణ్ ను చూశాను. నాకు ఎక్కడలేని ఆనందం కలిగింది. అతను కూడా చాలా సంతోషపడ్డాడు. ఆ రోజు కిరణ్ తో చాలా సేపు మాట్లాడాను. మా మెమోరీస్ మొత్తం గుర్తు చేసుకున్నాం. ఆ రోజు అతనికి ఒక మాట చెప్పాలనుకున్నా. అవే త్రీ మ్యాజికల్ వర్డ్స్. తనను నేను చాలా రోజులుగా ప్రేమిస్తున్నాను. ఆ మాటలు ఆ రోజు కచ్చితంగా చెప్పాలనుకున్నాను.

నిన్ను పెళ్లి చేసుకుంటాను

నిన్ను పెళ్లి చేసుకుంటాను

తర్వాత నా మనస్సులోని మాట కిరణ్ తో చెప్పాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాను. కిరణ్ సంతోషపడ్డాడు. కానీ తాను ఆర్థిక స్థోమత లేని వాడినని తన స్థాయికి నేను సరిపోనని అన్నాడు. అయినా పర్వాలేదు నిన్ను చాలా రోజులుగా నేను ప్రేమిస్తున్నాని చెప్పాను. ఆ రోజు ఇంటికి వచ్చాక కూడా అతని గురించే ఆలోచిస్తూ కూర్చొన్నాను.

ఆ రోజు బాగా రెడీ అయ్యాను

ఆ రోజు బాగా రెడీ అయ్యాను

మళ్లీ ఒక రోజు కాలేజీకి వెళ్లకుండా వాళ్ల ఇంటికి వెళ్లాను. ఆ రోజు బాగా రెడీ అయ్యాను. అప్పటికే నేను అతని ఫోన్ నంబర్ తీసుకున్నాను. నేను వస్తున్నట్లు చెప్పాను. ఆ రోజు చాలా అందంగా తయారయ్యాను. అతడు కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్లగానే అతను బాగా రిసీవ్ చేసుకున్నాడు.

నీతో నాకు గడపాలని ఉంది

నీతో నాకు గడపాలని ఉంది

నా మనస్సులో ఉన్న కోరికను అతనితో చెప్పాను. నేను నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాను. నీతో నాకు గడపాలని ఉంది అని చెప్పాను. మొదట నేనే వెళ్లి అతని ముద్దుపెట్టుకున్నాను. తర్వాత అతను కూడా నన్ను కిస్ చేశాడు. వాళ్లింట్లో ఎవరూ లేరు. నేను అతన్ని రెచ్చగొట్టాను. చాలా సేపు ముద్దుల్లో మునిగితేలాం. అతనితో గడిపిన గంటల తరబడి ఆ రోజు గడిపాను. కానీ ఆ సమయం అంతా నాకు ఒక్క క్షణంలా ఉంది.

English summary

i was shy and to my surprise he was also bit shy to talk to me

i was shy and to my surprise he was also bit shy to talk to me
Story first published: Wednesday, January 31, 2018, 13:00 [IST]
Subscribe Newsletter