అతని పక్కనే పడుకున్నా కూడా టచ్ చేయలేదు - My Story #45

Written By:
Subscribe to Boldsky

నాపేరు మెర్సీ. మాది క్రిస్టియన్ కుటుంబం. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎక్కువగా దేవునికి సంబంధించిన అంశాల గురించే మాట్లాడుకునేవాళ్లం. మమ్మల్ని మా అమ్మనాన్న ఎంతో పద్ధతిగా పెంచారు. నాకు ఒక అక్క, ఒక తమ్ముడు.

కాలేజీ, చర్చి తప్ప ఏమీ తెలియదు

కాలేజీ, చర్చి తప్ప ఏమీ తెలియదు

నాకు ఇళ్లు, కాలేజీ, చర్చి తప్ప మరో లోకం తెలియదు. అలాంటి నాలోకంలోకి ఒక అబ్బాయి వచ్చాడు. నేను ఎంఏ ఇంగ్లిష్ చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు. నేను చేసుకోవాలనుకున్న భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్ మొత్తం ఆ అబ్బాయిలో ఉన్నాయి.

ప్రభాస్ లా కాదు.. నానిలా

ప్రభాస్ లా కాదు.. నానిలా

అతను అప్పటికే ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడు. మార్నింగ్ కాలేజీ వచ్చేవాడు. ఆఫ్టర్ నూన్ నుంచి జాబ్ కు వెళ్లేవాడు. క్లాస్ లో ఎవరితో మాట్లాడేవాడు. చూడడానికి చాలా బాగుండేవాడు. ప్రభాస్ లాగా కాకున్నా న్యాచురల్ స్టార్ నానిలా ఉండేవాడు. అతన్ని చూడగానే ఇతన్ని పెళ్లి చేసుకుంటే బాగుండు అని అనిపించింది.

క్లాస్ జరుగుతుంటే అస్సలు పక్కకు చూసేవాడు కాదు. చాలా బిజీగా నోట్స్ రాసుకునేవాడు.

ఒక్కసారైనా పలకరిస్తాడని..

ఒక్కసారైనా పలకరిస్తాడని..

చాలా రోజుల వరకు చూశాను. కనీసం ఒక్కసారైనా పలకరించడా అని.. కానీ నన్ను అస్సలు పలకరించలేదు. ఇక నేనే ఒక రోజు ధైర్యం చేసి ఏటండీ.. మీరు అస్సలు కాలేజీలో ఎవ్వరినీ పట్టించుకోరు.. మరీ అంతగా రిజర్వ్ అయి ఉంటారన్నాను. అప్పుడు కూడా జస్ట్ స్మైల్ ఇచ్చి వెళ్లిపోయాడు.

నిద్రపట్టలేదు

నిద్రపట్టలేదు

ఇంటికి వెళ్లాక నిద్రపట్టలేదు. ఒక ఆడపిల్లను.. పైగా ఇంత అందెగత్తని నేను పలకరిస్తే కూడా అతనికి అంత టెంపరా? అని అనుకున్నాను. కనీసం ఏదో ఒక ఆన్సర్ ఇచ్చి ఉంటే నా ఇగో హర్ట్ అయి ఉండేది కాదు. కానీ ఏమి చెప్పకుండా అలా వెళ్లిపోవడం నాకు బాధేసింది.

మెసేజ్ కూడా చెయ్యడు

మెసేజ్ కూడా చెయ్యడు

మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో అందరూ మెసేజ్ చేస్తారు. అందరూ ఉదయమే ఒకరినొకరు విషెస్ చేసుకుంటారు. కానీ ఆయన మాత్రం గ్రూప్ లో ఒక్క మెసేజ్ కూడా చేయలేదు.

మిడ్ నైట్ మెసేజ్ చేశాడు

మిడ్ నైట్ మెసేజ్ చేశాడు

ఒకరోజు సడెన్ గా నా సెల్ కు అతని నుంచి ఒక టెస్ట్ మెసేజ్ వచ్చింది. హ్యాపీ బర్త్ డే మెర్సీ అని మెసేజ్ చేశాడు. నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అది కూడా మిడ్ నైట్ పన్నెండు గంటలకు. నాకు ఆ రోజు చాలామంది విషెస్ చెప్పారు. కానీ అతని విషెస్ మాత్రం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించాయి.

కాలేజీలో పార్టీ

కాలేజీలో పార్టీ

ఆ రోజు కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ నా బర్త్ డే పార్టీ గ్రాండ్ గా చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఒక పెద్ద కేక్ తీసుకొచ్చారు. కాలేజీ పూర్తవ్వగానే కేక్ కట్ చేసి కాసేపు సరదగా గడుపుదామని అందరూ అనుకున్నారు. అందుకు కాలేజీలో ప్రొఫెసర్స్ పర్నిషన్ కూడా తీసుకున్నారు. అందర్ని కేక్ కటింగ్ కు ఇన్వైట్ చేశారు.

కేక్ పై అతని పేరు కూడా..

కేక్ పై అతని పేరు కూడా..

కేక్ పై ఉన్న విషెస్ చూసి షాక్ అయ్యాను. హ్యాపీ బర్త్ డే మెర్సీ అని దానిపై రాశారు. అలాగే అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అంటూ అతని పేరు కూడా రాశారు. అతని బర్త్ డే మరుసటి రోజేనట. ఇద్దరి బర్త్ డేలను ఒకేసారి సెలబ్రేట్ చేద్దామని ఫ్రెండ్స్ అన్నారు. అందుకే ఇలా అరేంజ్ చేద్దామని చెప్పారు. అయితే ఈ విషయం మా ఇద్దరికీ తెలియదు.

చాలా సిగ్గు

చాలా సిగ్గు

అలా కేక్ అతని పేరు నా పేరు రాసినందుకు అతను ఎలా ఫీలయ్యాడో కానీ నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అతను నా పక్కన నిలబడి కేక్ కట్ చేయడానికి చాలా సిగ్గుపడ్డాడు. అతనికి సిగ్గు ఎక్కువ. అందుకే అతను ఎవరితో ఎక్కువగా కలిసేవాడు కాదు. అతని సిగ్గు, అతని మంచితనం అన్నీ నాకు నచ్చాయి.

ఫుల్ ఎంజాయ్

ఫుల్ ఎంజాయ్

ఆ రోజు కాలేజీలో బర్త్ డే పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేశాం. అతను కూడా చాలా సరదాగా గడిపాడు. అందరం డ్యాన్స్ వేస్తూ జాలీగా గడిపాం. సాయంత్రం అతనికి మెసేజ్ పంపాను. ఈ రోజు మీరు చాలా బాగున్నారు అని మెసేజ్ చేశాను. థ్యాంక్స్... మీరు కూడా చాలా బాగున్నారు అని మెసేజ్ పంపాడు.

రాత్రంతా చాటింగ్

రాత్రంతా చాటింగ్

అలా మొదలైన మా చాటింగ్ ఆ రోజు రాత్రంతా సాగింది. అయితే కేవలం జనరల్ విషయాలే మాట్లాడుకున్నాం. మరుసటి రోజు కాస్త త్వరగా కాలేజీకీ రమ్మని చెప్పాను. ఒకే అన్నాడు. ఉదయమే వచ్చి మెసేజ్ పంపాడు. గంట ముందుగానే మేమిద్దరం కాలేజీకి వెళ్లాం.

ఒంటిరిగానే అయితే ఒకేనట

ఒంటిరిగానే అయితే ఒకేనట

ఇద్దరం మాటల్లో మునిగిపోయాం. అతనికి పదిమంది ముందు మాట్లాడడం సిగ్గుగానీ ఒక వ్యక్తితో మాత్రం చాలా బాగా మాట్లాడుతాడని ఆ రోజే తెలిసింది. అతని ప్రతి విషయం గురించి నాతో చెప్పాడు. అతని కుటుంబ పరిస్థితుల దగ్గర నుంచి ప్రతిదీ నాతో ఆ రోజు షేర్ చేసుకున్నాడు.

పెళ్లి చేసుకోవాలంటే..

పెళ్లి చేసుకోవాలంటే..

ఆ రోజు నేను ఫిక్స్ అయ్యాను. ఎలాగైనా సరే అతన్నే పెళ్లి చేసుకుందామన్నకున్నాను. కానీ మేము క్రిస్టియన్స్. అతనిది వేరే మతం. మా మతం గురించి అతనికి పెద్దగా తెలియదు. అయితే ఒక రోజు అతనికి జీసస్ గురించి మా మతం గురించి చెప్పాను.

మా దాంట్లోకి లాగాను

మా దాంట్లోకి లాగాను

మరుసటి రోజు ఆదివారం. అతన్ని నేను రెగ్యులర్ గా వెళ్లే చర్చికి రమ్మని పిలచాను. అక్కడికి వచ్చాడు. ఆ రోజు చర్చిలో ఇచ్చిన మెసేజ్ కు అతనికి బాగా నచ్చింది. తర్వాత నుంచి రెగ్యులర్ గా చర్చికి వచ్చేవాడు. బైబిల్ చదివేవాడు. ప్రార్థన చేసుకునేవాడు.

ఫిక్స్ అయ్యాను

ఫిక్స్ అయ్యాను

మా తల్లిదండ్రులకు కూడా అతన్ని పరిచయం చేశాను. అయితే అప్పటి వరకు నేను కేవలం అతని ఫ్రెండ్ నే. అతనికి నా మనస్సులో ఉన్న మాట చెప్పలేదు. ఒకరోజు అతనికి నా మనస్సులో ఉన్న మాట చెబుదామని ఫిక్స్ అయ్యాను.

ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు

ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు

ఆ రోజు వాళ్లింట్లో వాళ్లు అందరూ పెళ్లికి వెళ్లారని మెసేజ్ చేశాడు. నాకిదే ఛాన్స్ అని అనుకున్నాను. వాళ్లింటికి వెళ్దామనుకున్నాను. అతనికి చెప్పాను. ఎందుకు వస్తున్నావు.. వద్దులే అన్నాడు. కానీ నేను మాత్రం వస్తాను అని రిక్వెస్ట్ చేసుకోవడంతో ఒకే అన్నాడు.

బాగా నచ్చాడు

బాగా నచ్చాడు

నేను బాగా రెడీ అయ్యాను. తర్వాత వాళ్ల ఇంటికెళ్లాను. అతను వంట చేస్తూ ఉన్నాడు. నేను వెళ్లగానే చాలా బాగా పలకరించాడు. నాకు కాఫీ కూడా తనే చేసి తీసుకొచ్చాడు. రోజురోజుకు అతను చాలా బాగా నచ్చుతున్నాడు.

పెళ్లి

పెళ్లి

కాసేపు నీతో మాట్లాడాలి అని అతనితో చెప్పాను. నిన్ను నేను చాలా రోజులుగా ఇష్టపడుతున్నాను.. నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పాను. అతను కొద్ది సేపు ఆలోచించడం మొదలు పెట్టాడు.

నాది చాలా డిఫరెండ్ క్యారెక్టర్

నాది చాలా డిఫరెండ్ క్యారెక్టర్

నేను నీకు అస్సలు సూట్ అవ్వను. నాది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పాడు. నేను చాలా సీరియస్ గా ఉంటాను. నేను చాలా రిజర్వ్ డ్ పర్సన్ అని చెప్పాడు. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. నేను నువ్వు అనుకున్నంత మంచివాడిని కాదు.. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటానని చెప్పాడు.

అయినా ఒకే

అయినా ఒకే

కాసేపు నాకేమీ అర్థం కాలేదు. ఇతనిలో ఈ కోణం కూడా ఉందా అనుకున్నాను. అయినా సరే ఒకే అని చెప్పాను. కానీ ఇలాంటి ప్రేమ కథ మీరు ఎప్పుడూ చూసి ఉండరు. నేను అతనికి వంద మెసేజ్ పంపితే అతను ఒక్క మెసేజ్ పంపేవాడు.

నేనే కిస్ పెట్టేదాన్ని

నేనే కిస్ పెట్టేదాన్ని

అతనికి నేను కిస్ ఇవ్వాల్సిందే తప్పా.. అతను నాకు ఇచ్చేవాడు కాదు. నేను అతన్ని నీ డ్రెస్ బాగుంది నువ్వు బాగున్నావ్ అని మెచ్చుకున్నానే తప్పా అతను నన్ను ఒక్కరోజు కూడా మెచ్చుకోలేదు. నాది చాలా సిన్సియర్ లవ్ ఆ విషయాన్ని నేను అతనితో పదేపదే చెప్పేదాన్ని.

నాకన్నా వందరెట్లు ఎక్కువ

నాకన్నా వందరెట్లు ఎక్కువ

కానీ అతను మాత్రం ఒక్కరోజు కూడా నాతో అలాంటి విషయాలు ఏమి చెప్పేవాడు కాదు. కానీ అతనికి నాపైన నాకన్నా వందరెట్లు ఎక్కువ ప్రేమ ఉండేది. అలాంటి అతన్ని అస్సలు ఎవ్వరూ చూసి ఉండరేమో.

నాన్నతో డైరెక్ట్ గా..

నాన్నతో డైరెక్ట్ గా..

నా ప్రేమ విషయం గురించి మా నాన్నతో చెబితే అతను పెళ్లికి ఒప్పుకోలేదు. నా బాయ్ ఫ్రెండ్ కూడా నేరుగా మా ఇంటికి వచ్చి మా ప్రేమ గురించి నా తల్లిద్రండులతో మాట్లాడాడు. కానీ మా నాన్న ఒప్పుకోలేదు. మీ ఇంట్లోవారి ఇష్టం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అంటూ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో అస్సలు టచ్ లో లేడు.

ఫస్ట్ నైట్ రోజు లవ్ స్టోరీ చెప్పా

ఫస్ట్ నైట్ రోజు లవ్ స్టోరీ చెప్పా

తర్వాత నాకు మా ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు. కానీ నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. మా ఇంట్లో వాళ్లు చూసిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అతనికి నా ప్రేమ విషయం గురించి ఫస్ట్ నైట్ రోజు చెప్పాను. అతని మనసత్వం వేరు. నాకు నా బాయ్ ఫ్రెండ్ కు మధ్య అలాంటివన్నీ అయిపోయాయి అని అతను సందేహపడ్డాడు.

పక్కన పడుకున్నా కూడా..

పక్కన పడుకున్నా కూడా..

నిజంగా నా బాయ్ ఫ్రెండ్ దేవుడు. నేను వెళ్లి అతని పక్కన పడుకున్నా కూడా నన్ను టచ్ చేయలేదు. నేను అతన్ని ముద్దు పెట్టుకున్నాను కానీ అతను మాత్రం నన్ను ఏం చేయలేదు. అతన్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను అప్పుడు అవన్నీ చేశాను. నేను పెళ్లి అయ్యేంత వరకు కన్యగానే ఉన్నాను. నేను వర్జిన్ నే అని నా భర్తతో ఫస్ట్ నైట్ రోజు చెప్పాలనిపించిది.

అతను మగాడు

అతను మగాడు

కానీ ఆడదాన్ని కదా మరీ అంత సిగ్గు విడిచి మాట్లాడలేను. అందుకే ఆ మాటల్ని నా మనస్సులో ఉంచుకున్నాను. కానీ నిజంగా బాయ్ ఫ్రెండ్ లాంటి వాళ్లు సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు. నమ్మిన సిద్దాంతాల కోసం దేన్ని అయినా త్యాగం చేసేవాడు మగాడు.. మగోడు. అలాంటి అతను నా జీవితంలోకి అలా మెరుపుతీగలాగా వచ్చి వెళ్లిపోయాడు. అతను ఎప్పటికీ నా జ్ఞాపకమే.

English summary

i was virgin until marriage i constantly had explain myself

i was virgin until marriage i constantly had explain myself
Story first published: Monday, January 15, 2018, 10:50 [IST]
Subscribe Newsletter